E-Paper
Advertisement

Gold Rate Today: రికార్డుల వేటలో పసిడి.. ఒక్కరోజే భారీ జంప్.. నేడు తులం బంగారం ఎంతంటే?

Gold Rate Today: రికార్డుల వేటలో పసిడి.. ఒక్కరోజే భారీ జంప్.. నేడు తులం బంగారం ఎంతంటే?
Advertisement

Gold Rate Today: రాను.. కిందకు రాను అంటోంది బంగారం. పుత్తడి ఒక్కటేనా, నాకెం తక్కువ.. తాను కూడా కిందకు దిగనంటోంది వెండి. ఇలా ఒకదానికొకటి పోటాపోటీగా కొండెక్కి కూర్చొన్నాయి. అవును.. కొన్నిరోజులుగా పసిడి, వెండి ధరలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆకాశన్నంటుతోన్న ధరలతో సామాన్యుడు చుక్కలు చూస్తున్నాడు. కొంతమంది పసిడి ప్రియులు వెండి వైపు చూడటంతో తాను బంగారంతో పోటీకి ఏమాత్రం తగ్గనంటోంది.

నేడు పసిడి ధరలు ఇలా..
మార్కెట్ పరిశీలించినట్లయితే గంట గంటకు బంగారం-వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. కానీ.. వాటి డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,020 కాగా.. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,220 వద్ద ఉంది. అలాగే శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,350 ఉండగా.. నేడు శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,450 వద్ద ఉంది. నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.1,200 పెరిగింది.

Advertisement

బంగారం ధరలు పెరగడానికి అసలు కారణం..
బంగారం ధర పెరగడానికి అంతర్జాతీయ మార్కెటులో ఉన్న పరిస్థితిలో కారణమంటున్నారు విశ్లేషకులు. ఇక వెండి విషయానికొస్తే ప్రస్తుత పరిస్థితుల్లో సిల్వర్ వినియోగం పెరగడమే కారణమని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప ధరలు కిందకు దిగే పరిస్థితి ఏమాత్రం కనబడటం లేదంటున్నారు మార్కెట్ ఎక్స్‌పర్ట్స్. దీంతో సా మాన్యుడి ఇన్నాళ్లు దూరంగా ఉన్న బంగారంతో వెండి కూడా చేరిపోనుంది. బంగారం కొనాలనుకున్న పేదవాడికి అది గుదిబడంగానే మిగలనుంది.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,41,220 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,450 వద్ద పలుకుతోంది.

Advertisement

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,41,220 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,29,450 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,41,220 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,29,450 వద్ద ఉంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,41,370 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,29,600 వద్ద కొనసాగుతోంది.

Also Read: నిజామాబాద్‌లో ఏటీఎం దొంగల బీభత్సం.. ఒకేరోజు రెండు చోట్ల చోరీ..

నేటి సిల్వర్ ధరలు ఇలా..
ఓర్నాయనో.. అసలు వెండి ధరలు ఇలా పెరుగుతున్నాయి ఏంటీ? నిన్నమొన్నటి వరకు కేజీపై వెయ్యి, రెండువేయ్యిలు పెరిగితే నేడు రికార్డ్
స్థాయిలో ధరలు పెరిగిపోయాయి. దీంతో సిల్వర్ కొనాలి అనుకునే వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.. అసలు సిల్వర్ ఎందుకు ఇంతలా పెరుగుతుందని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిన్న శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,54,000 ఉండగా.. నేడు శనివారం కేజీ సిల్వర్ ధర రూ. 2,74,000 వద్ద కొనసాగుతోంది. నేడు కేజీ సిల్వర్ ధరపై రూ.20,000 పెరిగింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2,51,000 వద్ద పలుకుతోంది.

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×