E-Paper
Advertisement

Drugs Case: డ్రగ్స్ కేసులో పరారైన వాడు ఈ హీరోయిన్ తమ్ముడే… ఇది రెండో సారి??

Drugs Case: డ్రగ్స్ కేసులో పరారైన వాడు ఈ హీరోయిన్ తమ్ముడే… ఇది రెండో సారి??
Advertisement

Drugs Case:మత్తు పదార్థాల వాడకం ఎంత ప్రమాదకరమో ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ పదే పదే మత్తు పదార్థాలను స్వీకరించడం లేదా వాటిని విక్రయించడం లాంటివి చేస్తూ ఎంతోమంది బంగారు భవిష్యత్తును కొంతమంది స్వార్థం కోసం నాశనం చేస్తున్నారు. ముఖ్యంగా కోట్ల విలువ చేసే ఈ మాదకద్రవ్యాల అమ్మకాలు ఈ మధ్యకాలంలో మరింత పెరిగిపోయాయి. అధికారులు ఎప్పటికప్పుడు మాదకద్రవ్యాల వినియోగం, విక్రయించడాలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నా.. ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు వీటిని ఉపయోగిస్తూ ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఈ డ్రగ్స్ వ్యవహారం ఏ రేంజ్ లో కలకలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు..

అయితే ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ అంటూ పేరు మోసిన ఒక హీరోయిన్ సోదరుడు కూడా డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. ఇక ఇతడిని పట్టుకునే ప్రయత్నం చేయగా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రముఖ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు డ్రగ్స్ కేసులో మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా హైదరాబాదు మాసబ్ ట్యాంక్ ట్యాంకు వద్ద ట్రూప్ బజార్ లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఈగల్ టీం నిర్వహించిన దాడుల్లో భారీగా 43 గ్రాముల కొకైన్ , ఎండిఎంఏ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పరారీలో రకుల్ సోదరుడు..

Advertisement

ఈ దాడుల్లో నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ అనే పెడ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరి దగ్గర ఉన్న నలుగురు రెగ్యులర్ కస్టమర్ల లిస్టులో అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అమన్ ప్రీత్ సింగ్ ను అదుపులోకి తీసుకోవాలని పోలీసులు ప్రయత్నం చేస్తున్న విషయం తెలుసుకున్న అమన్ పరారైనట్లు సమాచారం.మొత్తానికైతే డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్ ఇరుక్కోవడం ఇది రెండవసారి కావడం గమనార్హం.

ALSO READ:Google Top Search: అత్యధిక ప్రజాధారణ పొందిన హీరోయిన్స్.. మొదటి స్థానం ?

గతంలో కూడా..

Advertisement

ఇదిలా ఉండగా గత సంవత్సరము కూడా డ్రగ్స్ కేసులో సైబరాబాద్ పోలీసులకు అమన్ ప్రీత్ సింగ్ పట్టుబడిన విషయం తెలిసిందే . అప్పట్లోనే ఈ విషయం సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు మరొకసారి అమన్ ప్రీత్ సింగ్ అదే డ్రగ్స్ వ్యవహారంలో ఇరుక్కోవడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై రకుల్ ప్రీత్ సింగ్ ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.

రకుల్ ప్రీత్ సింగ్..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. ఆ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. అక్కడ ప్రముఖ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. దీనికి తోడు గత రెండు రోజుల క్రితం ఘనంగా జాకీ బర్తడే వేడుకలను కూడా నిర్వహించారు. అయితే ఇప్పుడు సడన్గా ఈమె తమ్ముడు డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం సంచలనంగా మారింది.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×