E-Paper
Advertisement

Google Maps AI: గూగుల్ మ్యాప్స్ లో ఏఐ ఫీచర్స్.. ఇకపై ప్రయాణం మరింత ఈజీ

Google Maps AI: గూగుల్ మ్యాప్స్ లో ఏఐ ఫీచర్స్.. ఇకపై ప్రయాణం మరింత ఈజీ
Advertisement

Google Maps AI: గూగుల్ మ్యాప్స్‌ మరో అప్డేట్ తీసుకొచ్చింది. నావిగేషన్, ట్రిప్ ప్లానింగ్‌ లో సహాయపడటానికి “ఆస్క్ మ్యాప్స్”, “ఇమ్మర్సివ్ నావిగేషన్” అనే రెండు ఏఐ ఫీచర్లు అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ మ్యాప్స్ ను జెమిని AI టెక్నాలజీకి జోడించింది. మ్యా్ప్స్ ఏఐ ఫీచర్ కీలకమైన అప్డేట్ గా గూగుల్ తెలిపింది. ఈ కొత్త వెర్షన్ ‘Google Maps’ గతంలో నావిగేషన్ యాప్ కంటే స్పీడ్ గా ఏఐ ఫీచర్లతో పనిచేస్తుంది. ఇంటి నుంచి బయలుదేరే రూట్ ప్లాన్, కొత్త ప్రదేశాలకు తొందరగా చేరుకునేందుకు, ప్రయాణం మార్గాల్లోని హోటళ్లు, ఫుడ్ స్టాల్స్ గురించి సమాచారాన్ని మరింత క్లియర్ గా ఎక్స్ ఫ్లోర్ చేసేందుకు సహాయపడుతుంది.

ఆస్క్ మ్యాప్స్ అంటే ఏమిటి?

గూగుల్ మ్యాప్స్ అప్‌డేట్‌లో ఒకటి ఆస్క్ మ్యాప్స్. ఇది ఇన్ బిల్డ్ గా వస్తున్న ఏఐ కమ్యూనికేషన్ ఫీచర్. జెమిని ఏఐతో అనుసంధానించడంతో సెర్చ్ చేయడం మరింత సులభంగా మారనుంది. ఏఐను మీ భాషలోనే ప్రదేశాలు, మార్గాలు, ఈవెంట్ల గురించి ప్రశ్నలు అడగవచ్చు. ఉదాహరణకు “నాకు దగ్గరలో ఉన్న బెస్ట్ రెస్టారెంట్ ఏది?”, “అందమైన మార్గంలో.. రోడ్ ట్రిప్ ప్లాన్ చేయగలవా?” అని మ్యాప్స్ ను అడగవచ్చు. అలాగే మ్యాప్స్ లో ఫొటోలు, లోకేషన్ లను ఏఐ తన వద్ద ఉన్న సమాచారంతో బెస్ట్ రిప్లై ఇస్తుంది.

Advertisement

ఆస్క్ మ్యాప్స్ ఫీచర్ లో యూజర్స్ ఎక్కడికి వెళ్లాలి, ఏమి చేయాలనుకుంటున్నారో చెబితే.. అందుకు తగిన విధంగా ఇందులో సమాచారం పొందవచ్చు.
ఈ యాప్ ను యూఎస్ఏ, భారత్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలో మరికొన్ని ఫీచర్లతో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇమ్మర్సివ్ నావిగేషన్

ఏఐ అసిస్టెంట్‌తో పాటు యూజర్స్ తమ రూట్ ను నావిగేట్ చేయడానికి ఇమ్మర్సివ్ నావిగేషన్‌ను గూగుల్ తీసుకొచ్చింది. సంప్రదాయ మ్యాప్‌కు భిన్నంగా యూజర్స్ రూట్ మ్యాప్ ను చాలా స్పష్టమైన 3D ఇమేజ్ లో చూడవచ్చు. బిల్డింగ్స్, రోడ్లు, కూడళ్లను 3D ఇమేజ్ లలో చూడవచ్చు. ఇమ్మర్సివ్ నావిగేషన్ డ్రైవర్ లేన్ మార్పులు, క్రాస్‌వాక్‌లు, ట్రాఫిక్ సిగ్నల్‌లు, ఓవర్‌పాస్‌లు వంటి ముఖ్యమైన వాటిని చూపిస్తుంది. దీంతో రూట్ మ్యాప్ ను సులభంగా అర్థం చేసుకోవచ్చు.

Advertisement

కోఆర్డినేట్‌లు, కెమెరా కోణాలు, స్మార్ట్ జూమింగ్ ఫీచర్‌లతో పాటు, హైవేలపై క్లిష్టమైన కూడళ్లు, విలీనాల ద్వారా ఎలా నావిగేట్ చేయాలో అర్థం చేసుకోవడంలో డ్రైవర్‌కు ఈ ఫీచర్స్ సహాయపడతాయి.

Also Read:  మనుషుల కోసం షాపింగ్ చేసే ఏఐ.. గూగుల్ కొత్త ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్

Related News

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

పర్సనల్ లోన్ EMI కట్టలేకపోయారా? క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా ఎలా సరిచేయాలి?

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!

భయపెడుతోన్న రూపాయి.. బలపడుతోన్న డాలర్, RBI కళ్లెం వేయగలదా?

పోస్ట్ ఆఫీస్ RDలో నెలకు రూ.6,000 పొదుపు చేస్తే.. 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

Big Stories

Advertisement
×