E-Paper
Advertisement

Google AI Shopping: మనుషుల కోసం షాపింగ్ చేసే ఏఐ.. గూగుల్ కొత్త ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్

Google AI Shopping: మనుషుల కోసం షాపింగ్ చేసే ఏఐ.. గూగుల్ కొత్త ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్
Advertisement

Google AI Shopping| అమెజాన్, ఫ్టిప్‌కార్ట్ తరహాలో గూగుల్ కూడా కొత్త ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ తీసుకురానుంది. అయితే ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్నే పూర్తిగా మార్చేస్తుంది. భవిష్యత్తులో మనుషులకు బదులు AI ఏజెంట్లు షాపింగ్ చేస్తాయి. ఈ AI.. స్వతహాగా ప్రొడక్ట్స్ వెతుకుతుంది, ధరలు పోల్చి చూసి, కొనుగోలు పూర్తి చేస్తుంది. చెల్లింపులు, కస్టమర్ సపోర్ట్ కూడా ఈ AI చూసుకుంటుంది.ఈ మార్పునకు గూగుల్ పెద్ద అడుగు వేసింది. దీని కోసం గూగుల్ కొత్తగా యూనివర్సల్ కామర్స్ ప్రోటోకాల్ (UCP) ప్రవేశపెట్టింది. ఈ సిస్టమ్ AIతో ఆన్‌లైన్ షాపింగ్‌ను సులభతరం చేస్తుంది.

యూనివర్సల్ కామర్స్ ప్రోటోకాల్ అంటే ఏమిటి?

UCP అనేది ఓపెన్ స్టాండర్డ్ ఫ్రేమ్‌వర్క్. ఇది AI ఏజెంట్లకు పూర్తి షాపింగ్ ప్రక్రియను నిర్వహించే అవకాశం ఇస్తుంది. ప్రొడక్ట్ డిస్కవరీ, చెక్‌అవుట్, చెల్లింపులు, పోస్ట్-పర్చేస్ సపోర్ట్ అన్నీ ఒకే సిస్టమ్‌లో జరుగుతాయి. గతంలో ప్రతి షాపింగ్ సర్వీస్‌కు వేర్వేరు ఇంటిగ్రేషన్లు అవసరం అయ్యేవి. UCPతో ఈ సమస్య పోతుంది. AI ఏజెంట్లు ఏ ప్లాట్‌ఫాం అయినా ఒకేలా పనిచేస్తాయి.

UCPకు మద్దతు ఇచ్చే కంపెనీలు

Advertisement

గూగుల్ UCPని Walmart, Shopify, Etsy, Wayfair వంటి పెద్ద ఈ-కామర్స్ కంపెనీలతో కలిసి తయారు చేసింది. టార్గెట్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామి. ఇకపై బ్రాండ్లు తమ సొంత AI బిజినెస్ ఏజెంట్లను జోడించవచ్చు. ఈ ఏజెంట్లు గూగుల్ సెర్చ్‌లోనే కనిపిస్తాయి. ఇది ట్రస్ట్, స్కేలబిలిటీని మెరుగుపరుస్తుందని గూగుల్ భావిస్తోంది.

గూగుల్ సెర్చ్, జెమినితో ఇంటిగ్రేషన్

UCPని మొదట సెర్చ్ AI మోడ్‌లో అమలు చేస్తారు. జెమిని యాప్‌లో కూడా ఈ ఫీచర్ వస్తుంది. మొదట అమెరికాలో రోల్‌అవుట్ ప్రారంభమవుతుంది. తర్వాత గ్లోబల్‌గా విస్తరిస్తారు. యూజర్లు ఒకే చోట ప్రొడక్ట్స్ రీసెర్చ్ చేసి కొనుగోలు పూర్తి చేయవచ్చు. వేర్వేరు యాప్స్ మధ్య స్విచ్ చేయాల్సిన అవసరం లేదు.

చెల్లింపులు, షిప్పింగ్ ప్రక్రియ

Advertisement

చెల్లింపులకు గూగుల్ పే ఉపయోగిస్తారు. షిప్పింగ్ సమాచారం గూగుల్ వాలెట్ నుంచి తీసుకుంటారు. భవిష్యత్తులో ఇతర పేమెంట్ ప్రొవైడర్లను కూడా సపోర్ట్ చేస్తారు. ఈ విధానం త్వరగా, సురక్షితంగా చెక్‌అవుట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

Also Read: ఐఫోన్ డిస్‌ప్లే పగిలిపోయిందా? రిపేర్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో తెలిస్తే షాకవ్వాల్సిందే

ఏఐ షాపింగ్ ప్రాధాన్యం

AI షాపింగ్ సమయాన్ని ఆదా చేస్తుంది. నిర్ణయాలు తీసుకోవడంలో ఒత్తిడి తగ్గుతుంది. యూజర్ అవసరాలు, ప్రాధాన్యతల ఆధారంగా AI బెస్ట్ ఆప్షన్లను ఎంచుకుంటుంది. ఇది డిజిటల్ కామర్స్‌ను పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. షాపింగ్ మరింత సమర్థవంతంగా, పర్సనలైజ్డ్‌గా, ఆటోమేటిక్‌గా మారనుంది.

Related News

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

8 గంటలకు పైగా బ్యాకప్ ఇచ్చే.. టాప్ 5 ల్యాప్‌టాప్‌లు ఇవే!

Big Stories

Advertisement
×