E-Paper
Advertisement

బ్యాంక్ అకౌంట్ లేకపోయిన మనీ ట్రాన్స్ ఫర్.. గూగుల్ పే ‘పాకెట్ మనీ’ ఫీచర్‌ గురించి తెలుసా?

బ్యాంక్ అకౌంట్ లేకపోయిన మనీ ట్రాన్స్ ఫర్.. గూగుల్ పే ‘పాకెట్ మనీ’ ఫీచర్‌ గురించి తెలుసా?
Advertisement

Gpay Pocket Money: మీ పిల్లలకు పాకెట్ మనీ ఇస్తున్నారా? అయితే నేరుగా యూపీఐ ద్వారా ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. అదేలా? పిల్లలకు బ్యాంక్ అకౌంట్ లేకుండా మనీ ఎలా ట్రాన్స్ ఫర్ చేస్తాం అనుకుంటున్నారు. ఇందుకోసం గూగుల్ పే “పాకెట్ మనీ” అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా.. పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు సొంత బ్యాంకు అకౌంట్ లేకపోయినా గూగుల్ పే ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. “పాకెట్ మనీ” ఫీచర్ లో తల్లిదండ్రులు ప్రైమరీ హోల్డర్ గా ఉంటారు. తమ పిల్లలు లేదా కుటుంబ సభ్యులను సెకండరీ హోల్డర్ గా యాడ్ చేయవచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత పిల్లలు కూడా గూగుల్ పే ఉపయోగించి నేరుగా పే చేయవచ్చు. పిల్లలు.. తమ సొంత అకౌంట్ లేకుండానే స్నాక్స్, స్కూల్ ఐటమ్స్ లేదా చిన్న అవసరాలకు డబ్బును గూగుల్ పే ద్వారా చెల్లించవచ్చు.

ఎలా సెట్ చేసుకోవాలంటే?

పాకెట్ మనీ ఫీచర్‌ను సెటప్ చేయడం చాలా ఈజీ. తల్లిదండ్రులకు Google Payకి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆ తర్వాత యాప్‌లోని ప్రొఫైల్ లోకి వెళ్లి, UPI సర్కిల్ కింద ఉన్న “పాకెట్ మనీ” ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి. అనంతరం QR కోడ్‌ను స్కాన్ చేసి, ప్రైమరీ అకౌంట్ హోల్డర్ వివరాలు ఎంటర్ చేయాలి. ఇలా మ్యాగ్జిమమ్ ఐదుగురిని యాడ్ చేయవచ్చు. ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి.. రెండో వినియోగదారుడు కూడా తప్పనిసరిగా Google Pay యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ ను యాడ్ చేసుకోవాలి.

రూ.15 వేల లిమిట్

Advertisement

ఈ ఫీచర్ లో పిల్లల ఖర్చులపై పేరెంటల్ కంట్రోల్ ఉంటుంది. నెలకు రూ.15,000 వరకు లిమిట్ విధించవచ్చు. దీంతో పిల్లలకు రూ.15 వేల లోపు మాత్రమే ఖర్చు చేయడానికి వీలుంటుంది. పిల్లలు పేమెంట్ చేస్తున్నప్పుడు.. తల్లిదండ్రులు అఫ్రూవ్ చేసేలా ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇది వివిధ వయసుల వారికి అనువుగా ఉంటుంది. చిన్న పిల్లల ఖర్చులపై ఎక్కువ కంట్రోల్ ఉంటుంది అలాగే కాస్త పెద్ద పిల్లలు అయితే ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కూడా కల్పిస్తుంది.

Also Read:  బ్యాంక్‌లో డబ్బులు లేకపోయినా యుపిఐ పేమెంట్.. గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్

కేవైసీ వెరిఫికేషన్ తప్పనిసరి

Advertisement

సెక్యూరిటీ పరంగా చూస్తే.. ఈ ఫీచర్‌కు కేవైసీ వెరిఫికేషన్ అవసరం. దీంట్లో తల్లిదండ్రులు అధికారిక డాక్యుమెంట్స్ ఉపయోగించి పిల్లలతో తమకున్న సంబంధాన్ని ధృవీకరించాలి. కేవైసీ వెరిఫికేషన్ మీ లావాదేవీలను సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. మొత్తం మీద, “పాకెట్ మనీ” ఫీచర్ డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేయంతో పాటు డబ్బును బాధ్యతాయుతంగా ఎలా వాడుకోవాలో పిల్లలకు నేర్చించడానికి సహాయపడుతుంది.

Related News

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×