Woman Protest: స్వేచ్ఛ బ్యూరో: తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ భార్య భర్త ఇంటి ముందు బైఠాయించిన ఘటన మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. రాజపేట మండలం జాల గ్రామానికి చెందిన కాకల్ల కనకయ్య, వెంకటమ్మల కుమార్తె సౌమ్యకు, నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కన్నె యాదయ్య, మల్లమ్మల రెండో కుమారుడు శివతో 2021లో ఘనంగా వివాహం జరిగింది. పెళ్లి సమయంలో పెద్దల సమక్షంలో సంప్రదాయబద్ధంగా రూ. 2.50 లక్షల నగదు, ఆరు తులాల బంగారం కట్నకానుకలుగా అందజేశారు.
వివాహం జరిగిన మొదటి ఏడాది వీరి సంసారం సాఫీగానే సాగింది. అయితే, గత నాలుగు సంవత్సరాలుగా భర్త శివ తనను ఇంటికి తీసుకువెళ్లకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని సౌమ్య ఆవేదన వ్యక్తం చేశారు. భర్త మరియు బావ వైఖరితో విసిగిపోయిన బాధితురాలు, చివరకు న్యాయం కోసం భర్త ఇంటి ముందే మౌన పోరాటానికి దిగారు.
Also read: మరో సారి లీకుల బారిన పడ్డ రాజమౌళి సినిమా ‘వారణాసి’.. ఈ సారి యాక్షన్ వంతు..
”నాకు న్యాయం జరిగే వరకు ఈ ఇంటి ముందు నుండి కదిలేది లేదు” అని సౌమ్య స్పష్టం చేశారు. ఈ విషయమై ఇప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. అధికారులు స్పందించి తనకు తన భర్తతో కలిపి జీవించేలా న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు. ఈ క్రమంలో ఆమెకు మద్దతుగా జాల గ్రామస్తులు మరియు నాగిరెడ్డిపల్లి ప్రజలు భారీ సంఖ్యలో మద్దతు తెలిపారు.
Also read: ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి మంత్రుల పేషీలు.. అధికారుల ప్రతిష్టకు గండం!