E-Paper
Advertisement

Gpay Flex: బ్యాంక్‌లో డబ్బులు లేకపోయినా యుపిఐ పేమెంట్.. గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్

Gpay Flex: బ్యాంక్‌లో డబ్బులు లేకపోయినా యుపిఐ పేమెంట్.. గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్
Advertisement

Gpay Flex Credit Card| ఈ రోజుల్లో ఫోన్‌పే, గూగుల్ పే, పేటిఎం లాంటి యుపిఐ పేమెంట్స్ ప్రజల జీవితంలో భాగమైపోయాయి. ముఖ్యంగా భారతదేశంలో యుపిఐ చెల్లింపులు ప్రతిరోజు లక్షల కోట్లు నమోదవుతున్నాయి. అయితే యుపిఐ ద్వారా చెల్లింపులు చేసేందుకు ముందుగా బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు ఉండడం చాలా ముఖ్యం. అకౌంట్‌ ఖాళీగా ఉంటే యుపిఐ సర్వీస్ పనిచేయదు.

కానీ ఇదంతా నిన్నటి వరకు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు లేకపోయినా పేమెంట్ చేసే అవకాశం ఉంది. ఈ సౌలభ్యం ప్రస్తుతానికి గూగుల్ పే లో మాత్రమే ఉంది. భారతీయ యూజర్ల కోసం తాజాగా గూగుల్ స్పెషల్ డిజిటల్ క్రెడిట్ కార్డ్ లాంచ్ చేసింది. బ్యాంక్ అకౌంట్‌లో డబ్బు లేకుండానే UPI పేమెంట్స్ చేయొచ్చు.

Advertisement

ఇది గూగుల్ పే యాప్ లోపల క్రెడిట్ ఫెసిలిటీలా పని చేస్తుంది. ఆక్సిస్ బ్యాంక్ సపోర్ట్‌తో వచ్చింది. RuPay నెట్‌వర్క్ మీద రన్ అవుతుంది. దీని అధికారిక పేరు Flex by Google Pay. ఈ క్రెడిట్ కార్డు.. రోజువారీ UPI పేమెంట్స్ విధానాన్ని మార్చేస్తుంది. అత్యవసర సమయంలో పేమెంట్ చేయాలంటే తక్షణం క్రెడిట్ ఉపయోగించి చెల్లింపులు చేయొచ్చు.

Flex by Google Pay అంటే ఏంటి?

ఫ్లెక్స్ బై గూగుల్ పే ఒక డిజిటల్ క్రెడిట్ కార్డ్. గూగుల్ పే యాప్ లో మాత్రమే పని చేస్తుంది. దీని ద్వారా ఫిజికల్ కార్డ్ లేకుండానే యూజర్లకు క్రెడిట్ బెనిఫిట్స్ లభిస్తాయి. మర్చంట్ (ఏదైనా షాపులో) UPI QR కోడ్ స్కాన్ చేసి క్రెడిట్‌తో పే చేయొచ్చు. రోజువారీ చిన్న పేమెంట్స్‌కి చాలా సులువు. స్వైప్ లేదా ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు. గూగుల్ పే యాప్ మాత్రమే చాలు.

ఫ్లెక్స్ బై గూగుల్ పే ఎలా పని చేస్తుంది?

Advertisement

RuPay ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఫ్లెక్స్ క్రెడిట్ కార్డ్ పని చేస్తుంది. గూగుల్ పే అకౌంట్‌కి డైరెక్ట్‌గా లింక్ అవుతుంది. యాక్సిస్ బ్యాంక్ బ్యాంకింగ్ సర్వీసెస్ మేనేజ్ చేస్తుంది. మర్చంట్ QR స్కాన్ చేసి ఫ్లెక్స్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండానే పేమెంట్ కంప్లీట్ అవుతుంది. నార్మల్ UPI పేమెంట్ లాగానే ప్రక్రియ అంతా జరుగుతుంది. బ్యాక్‌ఎండ్‌లో క్రెడిట్ కార్డ్ టెక్నాలజీ ఉపయోగిస్తారు.

ఫ్టెక్స్ కీ ఫీచర్స్ ఏమిటి?

ప్రతి పేమెంట్‌పై రివార్డ్ పాయింట్స్ (స్టార్స్) వస్తాయి. ఒక స్టార్ విలువ ఒక రూపాయి. ఈ స్టార్స్ సేకరించి మళ్లీ రిడీమ్ చేయొచ్చు. పెద్ద పేమెంట్స్‌ని EMIకి కన్వర్ట్ చేయొచ్చు. ఇందులో సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సమస్య ఉంటే క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేయొచ్చు, PIN నెంబర్ మార్చుకోవచ్చు. స్పెండింగ్ లిమిట్స్ సెట్ చేయొచ్చు. అన్నీ గూగుల్ పే యాప్ లోపలే సెట్టింగ్స్ ఉంటాయి.

రోజువారీ యూజర్లకి బెనిఫిట్స్ ఇవే..

బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండానే పే చేయొచ్చు. ఎమర్జెన్సీ వేళ ఈ కార్డ్ చాలా ఉపయోగకరం. గ్రోసరీ, ఫ్యూయల్, ఫుడ్, షాపింగ్.. ఏదైనా సరే చిన్న పేమెంట్స్ స్ట్రెస్ ఫ్రీగా సాగిపోతాయి. రోజువారీ ఖర్చులపై రివార్డ్స్ వస్తాయి. క్రెడిట్ వినియోగం కంట్రోల్‌లో, ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది.

Also Read: భీమ్ యుపిఐ స్పెషల్ ఆఫర్.. అందరికీ క్యాష్‌బ్యాక్.. త్వరపడండి

ఫ్లెక్స్ క్రెడిట్ కార్డ్ ఎలా పొందాలి?

ఈ క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేయడం చాలా సులువు. బ్యాంక్ వెళ్లాల్సిన అవసరం లేదు, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. గూగుల్ పే యాప్‌లో వెయిటింగ్ లిస్ట్ ఆప్షన్ ఉంది. డైరెక్ట్‌గా జాయిన్ అవ్వొచ్చు. రోల్‌అవుట్ పూర్తయ్యాక కార్డ్ యాక్టివేట్ అవుతుంది. త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుంది.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×