Credit Cards: నేటి ఆధునిక యుగంలో కరెన్సీ నోట్లను ఉపయోగించే వాళ్లు చాలా తక్కువ. ఇప్పుడంతా ఆన్‌లైన్ పేమెంట్లు లేదా డెబిట్, క్రెడిట్ కార్డులే రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా ఇంట్లో సరుకులకు నెలనెలా అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కిరాణా షాపుల్లోనే డబ్బునంతా తగలేస్తున్నారు అంటూ ఇంట్లో పెద్దవాళ్లు కూడా అంటుంటారు. అయితే కాస్త మెదడు పెట్టి ఆలోచిస్తే.. కిరాణా ఖర్చులను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అది కూడా మీ వద్ద ఉన్న క్రెడిట్ కార్డుల ద్వారా. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఏదైనా పండుగలు లేదా అకేషన్లు వచ్చినప్పుడు ప్రముఖ ఆన్‌లైన్ గ్రోసరీ ప్లాట్‌ఫామ్‌లు.. ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నాయి. అలాంటి అవకాశాలను అస్సులు మిస్ చేసుకోకూడదు. మీ వద్ద అమెజాన్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఉన్నట్లయితే.. దాంతో ప్రైమ్ సభ్యులు షాపింగ్ చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఒకవేళ ప్రైమ్ లేకపోతే 3 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
అలాగే HDFC Millennia కార్డు.. ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్ వాటిల్లో చేసిన ఖర్చులపై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. దీంతోపాటు సాధారణ ఖర్చులకు కూడా కొంత శాతం వరకు రిటర్న్ లభిస్తుంది. కాబట్టి.. మీరు ఎక్కువగా ఎక్కడ షాపింగ్ చేస్తారో చూసుకుని, ఎప్పుడు ఏ కార్డు వాడాలో కూడా తెలుసుకోవడం చాలా అవసరం.
సాధారణంగా కొన్ని క్రెడిట్ కార్డులు కిరాణా షాపింగ్‌పై అదనపు బోనస్ రివార్డ్స్‌ను నిత్యం అందిస్తుంటాయి. ముఖ్యంగా కొన్ని HDFC కార్డులు సాధారణ ఖర్చులతో పోలిస్తే.. కిరాణా కొనుగోళ్లపైనే ఎక్కువ రివార్డ్ పాయింట్లను అందిస్తాయి. అలాగే, కొన్ని బ్యాంకులు నిర్దిష్ట సూపర్ మార్కెట్లతో భాగస్వామ్యం చేసుకుని ప్రత్యేక డిస్కౌంట్లు లేదా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ అవకాశాలను సరిగ్గా వినియోగిస్తే.. నెలవారీ కిరాణా ఖర్చుల్లో కొంత మొత్తాన్ని తగ్గించుకోవచ్చు.
మరో తెలివైన మార్గం ఏమిటంటే.. గిఫ్ట్ కార్డులను వినియోగించుకోవడం. చాలా బ్యాంకులు, ప్లాట్‌ఫామ్‌లు 5 నుంచి 10 శాతం తగ్గింపుతో సూపర్ మార్కెట్ గిఫ్ట్ కార్డులను అందిస్తాయి. ఇవి కొనుగోలు చేసి కిరాణా షాపింగ్‌లో ఉపయోగిస్తే.. అదనపు ఆదా కష్టమేమీ కాదు. అంతేకాదు.. ఫెస్టివల్స్ సీజన్లో అయితే 5 రెట్లు రివార్డ్ పాయింట్లు, జీరో ఇంట్రెస్ట్ EMIల వంటి ప్రత్యేక ఆఫర్లు కూడా అందబాటులో ఉంటాయి.
గ్రోసరీ సూపర్ మార్కెట్లు తమవైపు నుంచి డిస్కౌంట్లు ఇస్తే.. వాటిని క్రెడిట్ కార్డు క్యాష్‌బ్యాక్‌తో కలిపితే మొత్తం లాభం ఇంకా పెరుగుతుంది. అంటే.. స్టోర్ డిస్కౌంట్ 10 శాతం ఉంటే, దానికి తోడు 5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తే మొత్తం 15 శాతం వరకు ఆదా అవుతుందన్న మాట. ముఖ్యంగా Flipkart Axis Bank వంటి కో-బ్రాండెడ్ కార్డులు కూడా కిరాణా ఖర్చులపై మంచి ప్రయోజనాలను అందిస్తాయి.
క్రెడిట్ కార్డుల ద్వారా కిరాణా ఖర్చులను తగ్గించుకోవాలంటే.. సరైన క్రెడిట్ కార్డును ఎంచుకోవడం ముఖ్యం. దీంతో అందుబాటులో ఉన్న ఆఫర్లు, క్యాష్‌బ్యాక్, రివార్డ్స్‌ను సద్వినియోగం చేసుకోవడం చాలా సులభం. ఇలా చేస్తే రోజువారీ షాపింగ్ కేవలం ఖర్చుగా కాకుండా.. ఒక విలువైన సేవింగ్ అవకాశంగా మారుతుందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.