E-Paper
Advertisement

Honeymoon Se Hatya on OTT : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సెన్సేషనల్ మర్డర్ కేసు… ఎక్కడ చూడవచ్చో తెలుసా ?

Honeymoon Se Hatya on OTT : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సెన్సేషనల్ మర్డర్ కేసు… ఎక్కడ చూడవచ్చో తెలుసా ?
Advertisement

Honeymoon Se Hatya on OTT : మోస్ట్ అవైటింగ్ డాక్యుమెంటరీ సిరీస్ ‘హనీమూన్ సే హత్య’ (Honeymoon Se Hatya) తాజాగా ఓటీటీలోకి వచ్చింది. రియల్ క్రైమ్ స్టోరీస్ ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. మేకర్స్ ఈ సిరీస్ ను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఓటిటి మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్ మొదలు పెట్టిన ‘హనీమూన్ సే హత్య’లో మేకర్స్ ఏం చూపించారు ? ఈ సిరీస్ ని ఎక్కడ చూడొచ్చు ? అనే వివరాల్లో తెలుసుకుందాం పదండి.

జీ5 ఓటిటిలో స్ట్రీమింగ్

‘హనీమూన్ సే హత్య’ చిత్రానికి అజయ్ శర్మ దర్శకత్వం వహించారు. ఇందులో అనురేఖ భగత్, సుస్మిత మెయిన్ రోల్స్ పోషించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కినప్పటికీ, సత్యేన్ బోర్డోలోయ్ దీనికి స్క్రిప్ట్ రాశారు. ఈ డాక్యుమెంటరీ సిరీస్ ని ఇండియాను షేక్ చేసిన ఐదు సంచలన హత్య కేసుల ఆధారంగా తెరకెక్కించారు. ఎన్నో ఆశలతో పెళ్లిళ్లు చేసుకున్న ఆ జంటలలో… చివరికి భార్యలు తమ భర్తలను అంతమొందిస్తారు. దానికి కారణం ఏంటి ? అన్న విషయాన్ని ఇందులో చర్చించే ప్రయత్నం చేశారు. ఇక ఈ డాక్యుమెంటరీ పరిశోధకులు బాధితుల బంధువుల ఇంటర్వ్యూ లతోపాటు ఆర్కైవ్ ఫుటేజ్ లను కూడా ఉపయోగించి, వివాహ బంధంలో ఉండే ఒత్తిడి, ద్రోహం, వివాహేతర సంబంధాలు వంటి విషయాలను లోతుగా పరిశీలించారు. ఈ ఐదు ఎపిసోడ్ల సిరీస్ ప్రస్తుతం జీ 5 (ZEE5) ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది.

Advertisement

Read Also :  రిలీజై నెలకూడా కాకముందే ఓటీటీలోకి మలయాళం కామెడీ డ్రామా… ఏ ఓటీటీలో ఎప్పుడు చూడొచ్చంటే ?

స్టోరీ ఏంటంటే?

ఈ డాక్యుమెంటరీ సిరీస్ 5 సెన్సేషనల్ మర్డర్ కేసుల ఆధారంగా రూపొందింది. అందులో మొదటిది మేఘాలయ సోనం రఘు వంశీ కేసు. హనీమూన్ కోసం మేఘాలయ కొండల్లోకి వెళ్లిన ఇండోర్ నూతన వధూవరులకు సంబంధించిన హై ప్రొఫైల్ కేసు ఇది. రెండవది మీరట్ బ్లూ డ్రం కేసు. దీని గురించి ఎన్నో మీమ్స్, రీల్స్ వైరల్ అయ్యాయి. కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. బ్లూ డ్రంలో ఒక అబ్బాయి శవం దొరకడం ఎంతటి కలకలం సృష్టించిందో ఎవ్వరూ మర్చిపోలేరు. అలాగే ఓ ప్రముఖ సోషల్ ఇన్ఫ్లూయెన్సర్ హత్య కేసును ఇందులో చూడొచ్చు. నాలుగవది ముంబై టైల్ కేసు. ఇందులో బాధితుడి మృతదేహాన్ని టైల్స్ కింద దాచిపెట్టడం జరిగింది. ఇంక చివరిది ఢిల్లీ ఎలక్ట్రిక్ షాక్ కేసు. ఈ కేసులో చంపడానికి ఏకంగా కరెంట్ షాక్ ని ఉపయోగించారు. మరి సంతోషంగా ఉన్న భార్యాభర్తల బంధంలో ఇలాంటి దారుణమైన ఘటనలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? ఈ 5 సెన్సేషనల్ కేసులలో భార్యలు తమ భర్తలను చంపడానికి గల కారణం ఏంటి ? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ సిరీస్ పై ఒక లుక్కెయ్యండి.

Tags

Related News

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

14,000 ఏళ్ల వయసున్న టీచర్… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులున్న క్లాసిక్ సై-ఫై మూవీ

Big Stories

Advertisement
×