E-Paper
Advertisement

పీఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుందా?.. ఆన్ లైన్ లో కేవైసీ అప్‌డేట్.. సింపుల్ ప్రాసెస్ ఇలా!

పీఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుందా?.. ఆన్ లైన్ లో కేవైసీ అప్‌డేట్..  సింపుల్ ప్రాసెస్ ఇలా!
Advertisement

PF KYC Update Process: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగుల పదవీ విరమణ సమయంలో లేదా అత్యవసర సమయాల్లో పెద్ద మొత్తం డబ్బు పొందేందుకు సహకరిస్తుంది. నెల నెలా జీతంలో కొంత మొత్తం పీఎఫ్ ఖాతాలో ఉద్యోగి జీతం నుంచి జమ చేస్తారు. వీటికి కంపెనీలు సైతం కొంత అమౌంట్ యాడ్ చేస్తాయి. అయితే ఏదైనా అవసరానికి పీఎఫ్ డబ్బు తీసుకోవాలనుకుంటే.. క్లెయిమ్ చేసుకోవచ్చు. అందుకు క్లెయిమ్ చేసుకునే ముందు కేవైసీ వివరాలు, ఇతర సమాచారాన్ని అప్‌డేట్ చేసుకుంటే.. క్లెయిమ్ రిజెక్ట్ కాకుండా ఉంటుంది.

కేవైసీ అప్డేట్

UAN మెంబర్ పోర్టల్ లో తమ డేటాను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా పీఎఫ్ క్లెయిమ్ రిజెక్షన్, విత్ డ్రా సమస్యలను నివారించవచ్చు. ఆధార్, ఈపీఎఫ్ రికార్డుల మధ్య డేటాలో తేడాలు ఉండటం వల్లే పీఎఫ్ క్లెయిమ్ ఎక్కువగా రిజెక్ట్ అవుతుంటాయి. మెంబర్ పేరు, పుట్టిన తేదీ లేదా జెండర్ లో చిన్నపాటి తప్పులు లేదా తేడాలు ఉంటే, క్లెయిమ్ అప్రూవ్ కు సమయం పడుతుంది. EPFO ​చందాదారుడి ​అన్ని వివరాలను ఆధార్ డేటాతో సరిపోల్చి చూస్తుంది. పీఎఫ్ అకౌంట్ వివరాలను ఇప్పుడు ఆన్ లైన్ లోనే సరిచేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో పీఎఫ్ కేవైసీ వివరాలు ఎలా అప్‌డేట్ చేసుకోవాలి?

Advertisement

1. మీ UAN నెంబర్, పాస్‌వర్డ్ తో UAN పోర్టల్‌లో లాగిన్ అవ్వండి.
2. ప్రాథమిక వివరాలలో, ‘Manage’ పై క్లిక్ చేసి ‘Modify/ Change Basic Details’ ట్యాబ్‌ను సెలెక్ట్ చేయండి.
3. ఆధార్‌లో ఉన్నట్లు మీ వివరాలను ఎంటర్ చేయండి. మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్, ఇతర బేసిక్ వివరాలను జాగ్రత్తగా అప్‌డేట్ చేయండి. ఆ తర్వాత సిస్టమ్ UIDAIలోని వివరాలను వెరిఫై చేస్తుంది.
4. ఆ తర్వాత, ‘update details’ క్లిక్ చేయండి. ‘యజమాని ఆమోదం’ కోసం మీ వివరాలు సమర్పిస్తామని నిర్థారించవచ్చు. మీరు పనిచేసే కంపెనీ యాజమాన్యం లాగిన్ చేసి ఆన్‌లైన్‌లో ఈ వివరాలను ఆమోదించాలి. వాళ్లు ఆమోదించిన తర్వాత, మీ ఈపీఎఫ్ అకౌంట్ లో డేటా అప్ డేట్ అవుతుంది.

Also Read: ఈపీఎఫ్ వడ్డీ రేటులో మార్పుల్లేవ్.. డబ్బులు ఖాతాల్లో జమ ఎప్పుడంటే?

పీఎఫ్ విత్ డ్రా కీలక వివరాలు

Advertisement

కేవైసీ అప్‌డేట్ చేసుకుంటే.. ఎలాంటి ఇబ్బంది లేకుండా పీఎఫ్ (PF) విత్‌డ్రాయల్స్ చేసుకోవచ్చు. ఆధార్‌ను పాన్ తో లింక్.. అలాగే బ్యాంకు వివరాలను జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి. సాధారణంగా పీఎఫ్ అప్‌డేట్‌లకు యజమాని ఆమోదం అవసరం అయినప్పటికీ, బ్యాంక్ అకౌంట్ వివరాలు, IFSC అప్‌డేట్‌లను యజమాని ప్రమేయం లేకుండా నేరుగా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం, కేవైసీ అప్డేట్ చేయకపోతే పీఎఫ్ విత్ డ్రాకు అనుమతి లేదు. అందువల్ల, ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో మీ పీఎఫ్ వివరాలు అప్‌డేట్‌ చేసుకోవడం అవసరం.

Related News

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!

భయపెడుతోన్న రూపాయి.. బలపడుతోన్న డాలర్, RBI కళ్లెం వేయగలదా?

పోస్ట్ ఆఫీస్ RDలో నెలకు రూ.6,000 పొదుపు చేస్తే.. 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

పండుగ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ సీక్రెట్ ఇదే

19 ఏళ్ల యువకుడి అద్భుత సృష్టి.. 3D ప్రింటింగ్ ఐడియాతో.. రూ.7 కోట్లకు పైగా సంపాదన!

అత్తమామల ఇల్లు, ఆస్తిపై కోడలికి హక్కులుంటాయా? భారత చట్టం ఏం చెబుతోందంటే

Big Stories

Advertisement
×