E-Paper
Advertisement

రూ.30,000లోపు బడ్జెట్లో.. మార్కెట్లోని బెస్ట్ ఏసీలు.. ఫీచర్లు, ధర వివరాలివే!

రూ.30,000లోపు బడ్జెట్లో.. మార్కెట్లోని బెస్ట్ ఏసీలు.. ఫీచర్లు, ధర వివరాలివే!
Advertisement

Best ACs Under Rs 30,000: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మండిపోతుండటంతో ఏసీలకు డిమాండ్ మరింత పెరిగిపోతోంది. తక్కువ బడ్జెట్ లో మంచి ఏసీల కోసం ప్రజలు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో రూ.30,000లోపు బడ్జెట్లో లభిస్తున్న టాప్ కంపెనీలకు చెందిన ఏసీలను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటి ఫీచర్లు, ధర ఆధారంగా మీకు నచ్చిన దానిని సెలక్ట్ చేసుకోండి.

వోల్టాస్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ

ఏసీ మధ్యస్తంగా ఉన్న గదులకు సరిగ్గా సరిపోతుంది. 5 స్టార్ రేటింగ్ తో రావడం వల్ల విద్యుత్ ను చాలా పొదుపుగా వినియోగిస్తుంది. దీనిలోని 5 ఇన్ 1 కన్వర్టిబుల్ ఫీచర్.. మీ అవసరానికి అనుగుణంగా కూలింగ్ ను అడ్జస్ట్ చేసేందుకు ఉపయోగపడుతుంది. అలాగే యాంటీ డస్ట్ ఫిల్టర్లు.. గాలిలోని దుమ్ము, దూళిని తొలగిస్తాయి. మార్కెట్ లో ఈ ఏసీ ధర సుమారు రూ.29,999గా ఉంది.

క్యారియర్ 1.5 టన్ 5 స్టార్ విండో ఏసీ

Advertisement

గోడకు కాకుండా కిటికీలకు అమర్చుకునే ఏసీ కోసం చూస్తుంటే దీనిని ట్రై చేయండి. దీనిలోని 4 ఇన్ 1 ఫిల్టర్లు.. దుమ్ము, బ్యాక్టీరియా, దుర్వాసనలను అరికట్టి స్వచ్ఛమైన చల్లగాలిని అందిస్తుంది. అలాగే సూపర్ టర్బో మోడ్ ఫీచర్.. గదిని వేగంగా చల్లబరిచేందుకు సాయపడుతుంది. దీనిలోని ఎనర్జీ సేవర్ మోడ్ ను ఉపయోగించి.. కరెంటు వినియోగాన్ని ఆదా చేసుకోవచ్చు. మార్కెట్ లో ఈ విండో ఏసీ ధర సుమారుగా రూ.27,490గా ఉంది.

డైకిన్ 1 టన్ 3 స్టార్ ఏసీ

ఇంట్లో చిన్న గదులు ఉంటే ఈ ఏసీ సరిగ్గా సరిపోతుంది. మంచి ఇన్వర్టర్ టెక్నాలజీతో ఇది అందుబాటులోకి వచ్చింది. దీనిలో ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే.. ఎకొనొ మోడ్ (Econo Mode) కరెంటు బిల్లు మరీ ఎక్కువ రాకుండా నియంత్రిస్తుంది. పీఎం 2.5 ఫిల్టర్లు.. గాలిలోని అతి సూక్ష్మమైన హానికారక క్రిములను తొలగిస్తుంది. అలాగే తక్కువ శబ్దంతో పనిచేసే నియో స్వింగ్ కంప్రెసర్ ద్వారా రాత్రిళ్లు హాయిగా నిద్రపోవచ్చు. దీని ధర సుమారు రూ.29,990

Lloyd 1 టన్ 3 స్టార్ ఏసీ

Advertisement

తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు ఉన్న ఏసీ కోరుకుంటే దీన్ని ట్రై చేయవచ్చు. ఏసీ ప్యానెల్‌పై ఉష్ణోగ్రతను చూపించే స్టైలిష్ డిస్‌ప్లేను ఇది కలిగి ఉంది. దీనిలోని టర్బో కూల్ ఫీచర్.. కొన్ని నిమిషాల్లోనే గదిని చల్లగా మార్చేస్తుంది. ఇందులో స్వచ్ఛమైన గాలిని అందించే క్లీన్ ఎయిర్ ఫిల్టర్లు అందించారు. ఒకవేళ రన్నింగ్ సమయంలో పవర్ పోతే.. పాత సెట్టింగ్స్ తోనే రీస్టార్ట్ అయ్యేలా ఈ ఏసీని డిజైన్ చేశారు. కాగా ఇది రూ.25,999కు మార్కెట్లో అందుబాటులో ఉంది.

Also Read: అమ్మబాబోయ్, 10,200mAh బ్యాటరీతో.. Vivo Y600 Pro లాంచ్.. ధర కూడా చాలా తక్కువే!

హిటాచీ 1.2 టన్ 3 స్టార్ ఏసీ

ఇతర ఏసీలకు భిన్నంగా ఇది 1.2 టన్ సామర్థ్యంతో లభిస్తుంది. 52°C ఎండలో కూడా సమర్థవంతంగా కూలింగ్ అందిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. అది కూడా చాలా తక్కువ శబ్దంతో పనిచేస్తూ.. రాత్రిళ్లు హాయిగా నిద్రించేందుకు సాయపడుతుందని పేర్కొన్నాయి. ఈ ఏసీ.. వేడిని త్వరగా బయటకు పంపి, వేగంగా కూలింగ్ అందించనుంది. ఫిల్టర్ క్లీన్ చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఇందులోని ఇండికేటర్లు అలర్ట్ కూడా చేస్తాయి.

Also Read: వీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 5G సేవలు.. గెట్ రెడీ అంటూ మెసేజ్‌లు!

Related News

అమ్మబాబోయ్.. మళ్లీ పెరగబోతున్న రీఛార్జ్ ధరలు.. ఏకంగా 15% టారిఫ్ హైక్!

గెలాక్సీ రింగ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఫోన్‌తోనే ఛార్జింగ్, కేస్ అవసరమే లేదు!

నాయిస్ నుంచి సరికొత్త స్క్రీన్‌లెస్ ఫిట్‌నెస్ బ్యాండ్.. ఆ కార్డు మీద కొలుగోలు చేస్తే భారీ ఆఫర్!

మ్యూజిక్ లవర్స్‌కు వీఐ బంపరాఫర్.. ఫ్రీగా ‘Spotify ప్రీమియం’.. కొత్త ప్లాన్స్ ఇవే!

రూ.599కే వన్‌ప్లస్ హెడ్‌ఫోన్స్.. ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు, Independence Day Sale ఆఫర్లు ఇవే!

డిజైన్ పిచ్చెక్కిస్తోంది బాబోయ్.. ఐకూ లవర్స్‌కి ఇది కదా కావాల్సింది!

యాపిల్ నుంచి మరో సంచలనం.. ఈసారి ఎయిర్‌పాడ్స్‌లోనే కెమెరాలు!

రూపాయి ఖర్చు లేకుండా.. ఇంట్లోనే ల్యాప్‌టాప్ స్పీడ్‌ని డబుల్ చేయండిలా!

Big Stories

Advertisement
×