E-Paper
Advertisement

HRA Changes: హైదరాబాద్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. హెచ్ఆర్ఏ 50 శాతానికి పెంపు!

HRA Changes: హైదరాబాద్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. హెచ్ఆర్ఏ 50 శాతానికి పెంపు!
Advertisement

HRA Changes: హైదరాబాద్ లో అద్దె ఇంట్లో ఉంటున్న ఉద్యోగులకు గుడ్ న్యూస్. హౌస్ రెండ్ అలవెన్సులను 50 శాతం పరిమితికి పెంపు ప్రతిపాదన చేసింది కేంద్రం. హైదరాబాద్ లో లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అద్దె ఇంట్లో ఉంటూ.. ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అలాంటి వారందరికీ హౌస్ రెంట్ అలవెన్సులపై(HRA) మినహాయింపుల పరిమితి 50 శాతానికి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. హెచ్ఆర్ఐ పన్ను మినహాయింపుల ప్రయోజనం కల్పించే మెట్రో నగరాల జాబితాలో హైదరాబాద్‌ను చేర్చాలని నిర్ణయించింది.

50 శాతం జాబితాలో హైదరాబాద్

ప్రధాన మెట్రో నగరాల్లో నివసిస్తు్న్న ఉద్యోగులకు పన్ను ఉపశమనం కలిగించేందుకు.. ఓల్డ్ ట్యాక్స్ సిస్టమ్ లో ఇంటి అద్దె భత్యం 50 శాతం మినహాయింపు నగరాల జాబితాను విస్తరించాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. ప్రస్తుతం ముంబై, దిల్లీ, కోల్‌కతా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లోని పన్ను చెల్లింపుదారులు జీతంలో 50% వరకు హెచ్ఆర్ఏ మినహాయింపులు పొందుతున్నారు. ఇతర నగరాల్లోని వారు 40% వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. తాజాగా 50% HRA మినహాయింపును బెంగళూరు, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్ కు విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది.

Advertisement

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో ముసాయిదా నిబంధనలను ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసింది. ఇందులో హెచ్ఆర్ఏ మినహాయింపుల కోసం మరికొన్ని మెట్రో నగరాలను 50 శాతం కేటగిరీలోకి చేర్చాలని కేంద్రం ప్రతిపాదించింది. ఆ జాబితాలో కొత్తగా బెంగళూరు, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్ నగరాలను చేర్చాలని నిర్ణయించింది. దీంతో ఈ నగరాల్లో అద్దెకు ఉంటున్న ఉద్యోగులకు చేతికి వచ్చే నికర ఆదాయం పెరగనుంది.

హెచ్ఆర్ఏ మినహాయింపు ఎవరికి?

జీతం పొందే పన్ను చెల్లింపుదారులు, స్వయం ఉపాధితో పన్ను కట్టేవారు ఇంటి అద్దె భత్యం కోసం మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. జీతం పొందే ఉద్యోగులకు సెక్షన్ 10(13A) కింద హెచ్ఆర్ఏ మినహాయింపులు వర్తిస్తాయి. మీరు జీతం పొందే ఉద్యోగి కాకపోయినా, హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేయాలనుకుంటే సెక్షన్ 80GG కింద మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు.

హెచ్ఆర్ఏ మినహాయింపు ఎలా?

Advertisement

చెన్నైలో ఉద్యోగం చేస్తున్న స్వామి 2024-25 ఆర్థిక సంవత్సరంలో నెలకు రూ. 10,000 చొప్పున ఇంటి అద్దె చెల్లిస్తున్నారు. అతడికి నెలకు రూ. 25,000 జీతం, రూ. 2,000 డీఏ లభిస్తాయి. ఆ సంవత్సరంలో రూ. 1 లక్ష హెచ్‌ఆర్‌ఏ కూడా పొందారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను నుంచి హెచ్ఆర్ఏ మినహాయింపును ఈ కింద వివరాలతో అర్థం చేసుకోవచ్చు.

  1. హెచ్ఆర్ఏ – రూ.1 లక్ష
  2. చెన్నైలో నివశిస్తుండడంతో.. జీతం, డీఏలో 50 శాతం హెచ్ఆర్ఏ కిందకు వస్తాయి.
  3. అంటే రూ.3,24,000 లో 50 శాతం =రూ. 1,62,000
  4. చెల్లించిన అద్దె జీతంలో 10 శాతం – (రూ.10,000*12) – రూ. 3,24,000లో 10% = రూ. 87,600.

స్వామి చెల్లించిన మొత్తం అద్దె రూ.1.2 లక్షలపై నేరుగా పన్ను మినహాయింపు పొందలేరు. వీటిని లెక్కలుంటాయి. మూడు మొత్తాలలో అత్యల్ప మొత్తానికి ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే స్వామి మెట్రో నగరమైన చెన్నైలో నివసిస్తున్నందున, బేసిక్, డీఏలో 50% వరకు ప్రయోజనం పొందవచ్చు. హెచ్ఆర్ఏ రూ. 1 లక్ష కాబట్టి, ఈ మొత్తానికి పన్ను మినహాయింపు ఉండదు. అతి తక్కువ మొత్తం అంటే రూ. 87,600 కు పన్ను మినహాయింపు ఉంటుంది. మిగిలిన HRAకి పన్ను విధిస్తారు. కొత్త పన్ను విధానం కింద స్వామికి ఈ మినహాయింపు అందుబాటులో ఉండదు. అంటే రూ. 1 లక్ష మొత్తం HRA వర్తించే స్లాబ్ రేట్ల ప్రకారం పన్ను విధిస్తారు.

Also Read:  కన్నీరు తుడిచే స్కీమ్.. కుటుంబ యజమాని మరణిస్తే.. వెంటనే రూ.20,000 జమ!

Related News

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×