E-Paper
Advertisement

Upto 70% off on Bikes: లక్ష రూపాయల బైక్ జస్ట్ 30 వేలకే.. మరీ అంత తక్కువ ఎలా బ్రో?

Upto 70% off on Bikes:  లక్ష రూపాయల బైక్ జస్ట్ 30 వేలకే.. మరీ అంత తక్కువ ఎలా బ్రో?
Advertisement

70% Discount on Bikes: రూ. 1 లక్ష విలువ చేసే బైక్ కేవలం రూ. 30 వేలకే దొరుకుతుంది. అంత తక్కువ ధరకు ఎలా అని భావిస్తున్నారా? కానీ, ముమ్మాటికీ నిజం. కొద్ది రోజుల వాడిన బైక్స్ ఏకంగా 50 శాతం నుంచి 70 శాతం వరకు తగ్గింపు ధరకు లభిస్తున్నాయి. అదీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పొందే అవకాశం ఉంటుంది. ఇంతకీ అంత తక్కువ ధరకు బైకులు ఎల లభిస్తాయనే ఇప్పుడు తెలుసుకుందాం..

మీర అంత తగ్గింపు ధర ఎలా?  

సాధారణంగా బ్యాంకులు బైకులు కొనుగోలు చేయడానికి లోన్లు ఇస్తాయి. వారు తిరిగి చెల్లించని కారణంగా వాటిని స్వాధీనం చేసుకుంటాయి. వాటిని భారీ డిస్కౌంట్లకు అమ్మేస్తారు. ఈ బైకులు లోన్స్ చెల్లించని వారి నుంచి ఎక్కువగా జప్తు చేస్తారు. బ్యాంకులు ఆ వాహనాలను ఉంచుకోవు. తమ డబ్బును రికవరీ చేసుకునేందుకు వాటిని అమ్ముతాయి. తమ  అమౌంట్ వస్తే చాలు అనుకుంటాయి. షోరూమ్ మార్జిన్లు, కమీషన్లతో అవసరం లేకుండా తక్కువ ధరలకు అమ్మేస్తాయి. వేలానికి టైమ్ పీరియడ్ ఉంటుంది. ధరలు మార్కెట్ విలువ కంటే చాలా తక్కువగా ప్రారంభమవుతాయి. సాధారణంగా రూ. 1 లక్ష ఉండే బైక్ ధర, వేలం సందర్భంగా రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు లభిస్తుంది. అటు ట్రాఫిక్ వాయిలేషన్స్ కు పాల్పడిన బైక్స్ ను కూడా పోలీసులు సీజ్ చేస్తారు. వాటిని యజమానులు తీసుకెళ్లకపోతే, వాటిని కూడా వేలంలో విక్రయిస్తారు. ఈ బైకులను బ్యాంకు అధికారులతో పాటు ప్రభుత్వశాఖలు, పోలీసులు, ఆర్టీఏ అధికారులు అమ్ముతారు.

వేలం గురించి ఎలా తెలుసుకోవాలంటే?

Advertisement

ఈ బైక్స్ వేలం గురించి తెలుసుకునేందుకు కొన్ని వెబ్ సైట్లు ఉన్నాయి. వాటి ద్వారా ఎప్పటికప్పుడు వేలం వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. eAuctionsIndia.com, ForeclosureIndia.com, AutoBSE.com లాంటి వెబ్ సైట్లలో ఈ వివరాలను పొందుపరుస్తారు.

Read Also:  ఇక మరింత చౌకగా ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎందుకో తెలుసా?

ఈ బైక్స్ ఎలా కొనాలంటే?

Advertisement

⦿ వేలంలో తక్కువ ధరకు బైకులు కొనాలనుకునే వాళ్లు ముందుగా సదరు వేలం నిర్వహించే వెబ్ సైట్లలో పాన్, ఆధార్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత నచ్చిన వాహనాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.

⦿ అనంతరం రిఫండబుల్ అమౌంట్ అంటే, బైక్ ధరలో 5 నుంచి 10 శాతం ధరను చెల్లించి ఆక్షన్ కోసం బిడ్ వేయాలి.

⦿ ఎవరైతే ఎక్కువ బిడ్ వేస్తారో వారికే ఆ బైక్ అలాట్ అవుతుంది. బ్యాలెన్స్ చెల్లించి వాహనాన్ని ఇంటికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.

వేలంలో బైక్ కొనేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

⦿ వాహనం కండీషన్ ఎలా ఉందో చెక్ చేయాలి.

⦿ మార్కెట్ ధర ఎంత ఉందో తెలుసుకోవాలి.

⦿ రిపేర్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో చూడండి.

⦿ అన్ని ఓకే అనుకున్న తర్వాతే బైక్ కొనుగోలుకు ముందుకు వెళ్లాలి.

Read Also: దొంగతనం కాకుండా బైక్ ను కాపాడుకోవడం ఎలా? ఈ టిప్స్ పాటించండి!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×