BigTV English

Jio Utsav Sale: జియో ఉత్సవ్ మొదలైంది.. ఈ వస్తువులపై బంపర్ డిస్కౌంట్

Jio Utsav Sale: జియో ఉత్సవ్ మొదలైంది.. ఈ వస్తువులపై బంపర్ డిస్కౌంట్
Advertisement

Jio Utsav Sale: జియోమార్ట్ మరోసారి వినియోగదారుల మనసులు గెలుచుకునే ఆఫర్లతో ముందుకు వచ్చింది. ప్రతి పండుగ సీజన్‌లో మనం ఎదురుచూసేది షాపింగ్ కదా.. ఇప్పుడు జియోమార్ట్ జియో ఉత్సవం లైవ్ నౌ అంటూ భారీ తగ్గింపులతో పండుగ సంబరాలను మొదలుపెట్టింది. ఇంట్లో అవసరమైన వస్తువుల నుండి చాక్లెట్ గిఫ్ట్ ప్యాక్‌ల వరకు ప్రతి కేటగిరీలోనూ మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు ఉన్నాయి.


సగానికి సగం ధర

ముందుగా ఇంటి అవసరాల గురించి మాట్లాడితే, ఫార్చ్యూన్ రిఫైండ్ రైస్ బ్రాన్ ఆయిల్ 2.5 కిలోల ప్యాక్‌ తో పాటు కోహినూర్ ఫీస్ట్ రోజానా బాస్మతి రైస్ 5 కిలోల ప్యాక్ కలిపి అసలు ధర రూ.1244 ఉండేది. కానీ ఇప్పుడు జియోమార్ట్‌లో కేవలం రూ.699కే లభిస్తోంది. అంటే సగానికి పైగా తగ్గింపు. ఇది విన్నవారే షాక్ అవుతున్నారు. సాధారణంగా మనం మార్కెట్‌లో వెళ్తే ఇంత తగ్గింపు ఏ బ్రాండ్‌ కూడా ఇవ్వదు. కానీ జియోమార్ట్ మాత్రం వినియోగదారుల జేబుకు తగ్గట్టుగా ధరలు కుదించింది. ఇంత తక్కువ ధరలో ఇంత మంచి క్వాలిటీ దొరకడం అంటే నిజంగా జియోమార్ట్‌ కే సాధ్యం.


గిప్ట్ ప్యాక్ లపై కూడా తగ్గింపు

ఇక పండుగలు దగ్గర పడితే చాక్లెట్‌ల పండుగ మొదలవుతుంది కదా! ఇప్పుడు జియో ఉత్సవంలో చాక్లెట్ గిఫ్ట్ ప్యాక్‌లపై అద్భుతమైన తగ్గింపులు ప్రకటించారు. రూ.275 నుండి ప్రారంభమయ్యే ఈ గిఫ్ట్ ప్యాక్‌లపై కనీసం 33శాతం వరకు తగ్గింపు ఉంది. సెలబ్రేషన్స్, స్నికర్స్, హర్షీస్ కిసెస్ లవ్ ఎడిషన్, ఓరియన్ చోకో పై వంటి ప్రముఖ బ్రాండ్లు ఇందులో ఉన్నాయి. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ లేదా ఆఫీస్ మిత్రుల కోసం గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఇవి సరిగ్గా సరిపోతాయి. అంతేకాదు, రూ.499 లేదా అంతకంటే ఎక్కువ గిఫ్ట్ ప్యాక్‌ల కొనుగోలుపై మరో 5శాతం అదనపు తగ్గింపు కూడా ఉంది. పండుగ గిఫ్ట్‌లు ఇంత తక్కువ ధరలో దొరకడం అంటే ఇది నిజంగా జియోమార్ట్ మ్యాజిక్ అని చెప్పాలి.

Also read: VIVO X90 Pro 2025: డైమెన్సిటీ 9200 ప్రాసెసర్‌తో వివో X90 ప్రో లాంచ్,.. స్టాక్ అయిపోయేలోపే ఫోన్ కొనేయండి

కూల్ డ్రింక్స్ పై భారీ తగ్గింపు

ఇప్పుడు చల్లని పానీయాల విషయానికి వస్తే.. జియోమార్ట్ ఇక్కడ కూడా వెనుకపడలేదు. పండుగల్లో, పార్టీ టైంలో, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లో కోల్డ్ డ్రింక్స్ తప్పవు. ఇప్పుడు జియోమార్ట్‌లో ఫ్రూటీ, మాజా, థమ్సప్, స్పిరిట్, మాండరిన్ వంటి ప్రముఖ పానీయాలపై 33శాతం వరకు తగ్గింపు ఉంది. రూ.40 నుండి ప్రారంభమయ్యే ఈ పానీయాలు ఇప్పుడు అందరికీ చేరువయ్యాయి. ఈ ఆఫర్లు కేవలం డబ్బు ఆదా చేయడమే కాదు, మన సెలబ్రేషన్స్‌కి మరింత రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇస్తాయి.

డోర్‌స్టెప్ డెలివరీ

జియో ఉత్సవం అంటే కేవలం షాపింగ్ ఆఫర్లు మాత్రమే కాదు ఇది ఒక పండుగ వాతావరణం. ఇంటికి కావలసిన వస్తువులైనా, బహుమతులైనా, చాక్లెట్‌లైనా, పానీయాలైనా ప్రతి ఒక్క దానిపైనా జియోమార్ట్ ఇప్పుడు వినియోగదారులను ఆశ్చర్యపరిచే రేంజ్‌లో తగ్గింపులు ఇస్తోంది. షాపింగ్ అనుభవం కూడా చాలా సులభంగా ఉంది. జియోమార్ట్ యాప్‌లోకి వెళ్ళి కొన్ని క్లిక్‌లతోనే మీరు కావలసిన వస్తువులు ఆర్డర్ చేసుకోవచ్చు. డోర్‌స్టెప్ డెలివరీతో మనకు కావలసినది మన ఇల్లు వద్దే అందుతుంది.

జియోమార్ట్ ఇస్తున్న ఆఫర్లు మరింత స్పెషల్‌

పండుగ సీజన్‌ అంటే ఆనందం, సంతోషం, షాపింగ్ – ఇవన్నీ కలిసే సమయం. ఇలాంటి టైమ్‌లో జియోమార్ట్ ఇస్తున్న ఆఫర్లు మన రోజును మరింత స్పెషల్‌గా మార్చేస్తాయి. తక్కువ ధరల్లో మంచి క్వాలిటీ ఉత్పత్తులు అందించడం వల్ల ప్రజల్లో జియోమార్ట్‌ మీద నమ్మకం పెరిగింది. ఇప్పుడు “జియో ఉత్సవం”తో ఆ నమ్మకానికి ఇంకో కొత్త రంగు వచ్చింది. ఇది పరిమిత కాల ఆఫర్ మాత్రమే. కాబట్టి మీరు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే జియోమార్ట్ యాప్‌ ఓపెన్ చేసి, మీకు నచ్చిన ఉత్పత్తులను ఆర్డర్ చేయండి. పండుగలను తీపిగా మార్చే ఈ జియో ఉత్సవ ఆఫర్లను మిస్ అవ్వకండి. పండుగలకి ఇది బెస్ట్ షాపింగ్ డెస్టినేషన్!

Related News

Amazon Great Indian Festival: అమెజాన్ వీకెండ్ వచ్చేసిందోచ్చ్.. 50శాతం నుండి 72శాతం వరకు తగ్గింపు

Festival Of Electronics: రిలయన్స్ డిజిటల్‌లో ‘ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్’, నమ్మలేనంత తక్కువ ధరలు.. ఇంకెందుకు ఆలస్యం !

Gold rate Dropped: భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

JioMart Offer: రెండు రోజులు మాత్రమే.. జియోమార్ట్‌లో కేవలం రూ.99 నుంచే బ్యూటీ ప్రోడక్ట్స్‌

BSNL Offers: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు దీపావళి బొనాంజా.. లక్కీ డ్రాలో 10 గ్రాముల సిల్వర్ కాయిన్.. భారీ తగ్గింపులు

Redmi K90 Pro Max: రెడ్ మీ నుంచి క్రేజీ ఫోన్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

JioFinance Offer: ఫ్రీగా బంగారం.. జియో ఫైనాన్స్ అదిరిపోయే ఆఫర్!

Big Stories

×