Bandla Ganesh: నటుడుగా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత కొద్దిపాటి గుర్తింపు సాధించుకున్న బండ్ల గణేష్ తర్వాత కాలంలో నిర్మాతగా మారారు. నటుడుగా కెరియర్ మొదలు పెట్టిన బండ్ల గణేష్ నిర్మాతగా మారడం వెనక చాలా విమర్శలు కూడా ఉన్నాయి. ఒక ప్రముఖ పొలిటిషన్ కి బినామీగా ఉండటంవలనే నిర్మాత అయిపోయాడు అనే కామెంట్స్ కూడా అప్పట్లో విపరీతంగా వచ్చేవి. నిర్మాతగా ఆంజనేయులు, తీన్మార్ సినిమాలు ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయాయి.
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు బండ్ల గణేష్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలమైన విజయాన్ని సాధిస్తూ అద్భుతమైన కలెక్షన్స్ కూడా తీసుకొచ్చింది. ఆ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాతగా సెటిల్ అయిపోయాడు బండ్ల గణేష్.
ప్రస్తుతం బండ్ల గణేష్ సినిమాలు నిర్మించడం లేదు. కానీ ఇంటర్వ్యూస్ లో కనిపించిన ప్రతిసారి వైరల్ అవుతుంటారు. అలానే కొన్ని ఫంక్షన్స్ కి బండ్ల గణేష్ హాజరవుతూ మాట్లాడిన విధానం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాంట్రవర్షియల్ టాపిక్స్ ని చాలా క్యాజువల్ గా మాట్లాడటం బండ్ల గణేష్ కు అలవాటైపోయింది.
రీసెంట్ గా బండ్ల గణేష్ అల్లు అరవింద్ పైన మాట్లాడిన మాటలు కూడా తీవ్రమైన దుమారాన్ని రేపాయి. బన్నీ వాస్ లాంటి యంగ్ ప్రొడ్యూసర్స్ ఆ మాటలకు కౌంటర్ కూడా ఇచ్చారు. ఇకపోతే బండ్ల గణేష్ ఇంట్లో నేడు దివాలి పార్టీ జరగనుంది.
టాలీవుడ్ స్టార్స్ కి దివాళీ స్పెషల్ పార్టీ బండ్ల గణేష్ ఇస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈరోజు హైదరాబాద్ లోని బండ్ల నివాసం లో స్టార్స్ హంగామా చేయనున్నట్లు తెలుస్తుంది. మెగాస్టార్ తో సహా పలువురు హీరోలు, బడా నేతలు హాజరు కానున్నారు.
దీపావళి పండుగ అనేది హిందువులకు చాలా ప్రత్యేకమైన పండుగ. ముఖ్యంగా బండ్ల గణేష్ ఈ పండుగను చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. గతంలో కూడా చాలామంది గుండె సామానుతో బండ్ల గణేష్ ఫోటో దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి.
అయితే నేడు బండ్ల గణేష్ ఇంత మంది సెలబ్రిటీల్ని ఒకచోట చేర్చడానికి కారణం ఏంటి అనేది కూడా ఆలోచించదగ్గ విషయం. మరోవైపు సినిమా నిర్మాతగా మళ్లీ ప్రస్థానాన్ని మొదలు పెట్టాలి అనే ఆలోచనలో భాగంగా సినిమా ప్రముఖులకు ఆహ్వానం పలుకుతున్నాడా అనేది కొంతమందికి వస్తున్న సందేహం.
Also Read: Bigg Boss 9 Elimination : ఇది రణరంగమే, భరణి ఎలిమినేట్? అంతా ఇమ్మానియేల్ చేతుల్లోనే