BigTV English

Intimacy Boost: ఏంటీ.. చలికాలంలో ఆలుమగలు అలా కలిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందా? సైన్స్ ఏం చెబుతోందంటే?

Intimacy Boost: ఏంటీ.. చలికాలంలో ఆలుమగలు అలా కలిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందా? సైన్స్ ఏం చెబుతోందంటే?
Advertisement

శీతాకాలంలో భాగస్వామితో హాయిగా ఉండటం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారని తెలుసా? చలి కాలంలో శృంగారం మీలో రోగనిరోధక శక్తిని పెంచుతుందని మీకు తెలుసా శృంగారం వైరస్‌ లతో పోరాడే సామర్థ్యాన్ని 30 శాతం పెంచుతుందనే వాదన నిజమేనా? ఇంతకీ సైన్స్ శృంగారంతో ఆరోగ్యం గురించి ఏం చెప్తుందంటే?


శృంగారం రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుందా?   

శృంగారం అనేది శరీరంలోని మాంటీ బాడీల ఉత్పత్తికి కారణం అవుతుంది. ఈ యాంటీ బాడీలు జలుబు, ఫ్లూ సహా అనేక శీతాకాలం ఆరోగ్య సమస్యలను అరికట్టేందుకు సాయపడుతాయని చాలా మంది నమ్ముతారు. అయితే, సైన్స్ ఏం చెప్తుంది? పరిశోధనలు ఏ విషయాలు వెల్లడించాయి? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

విల్కేస్ విశ్వవిద్యాలయం 2004లో ఈ అంశానికి సంబంధించి ఒక అధ్యాయనాన్ని నిర్వహించింది. శృంగారం చేయని వారితో పోల్చితే వారానికి 1-2 సార్లు శృంగారం చేసే వారి లాలాజలంలో IgA అనే ​​యాంటీబాడీ 29 శాతం ఎక్కువగా ఉందని తేలింది. IgA అనేది ముక్కు, గొంతును వైరస్‌ల బారి నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.  ఇక జర్మనీలో 2016లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, శృంగార ఉద్వేగం తర్వాత, శరీరంలో తెల్ల రక్త కణాలు త్వరగా విస్ఫోటనం చెందుతాయని తేలింది. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.  వీటి పెరుగుదల శృంగారం చేసిన దాదాపు 45 నిమిషాల తర్వాత జరుగుతుంది. 2021లో జరిపిన అధ్యయనం ప్రకారం, నెలకు 3 సార్లు కంటే ఎక్కువ శృంగారం చేసే వ్యక్తులకు COVID-19 సోకే అవకాశం తక్కువగా ఉన్నట్లు తేలింది. వారి  రోగనిరోధక వ్యవస్థలు బలంగా ఉండటం వల్ల కోవిడ్ రాకపోవచ్చని అధ్యయంలో పాల్గొన్న పరిశోధకులు వెల్లడించారు.


శృంగారంతో శీతాకాలంలో ఆరోగ్య సమస్యలు ఉండవా?    

శీతాకాలంలో తక్కువ సూర్యకాంతి ఉన్నప్పుడు, అలసిపోయినట్లు, నిరుత్సాహంగా అనిపించినప్పుడు శృంగారం అనేది మానసిక స్థితి, శక్తిని పెంచుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి సాయపడుతుంది.  శృంగారం అనేది ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ల లాంటి మంచి అనుభూతిని కలిగించే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి ఒత్తిడిని 20 నుంచి 30 శాతం తగ్గిస్తాయి. అలసట యాయం అవుతుంది. సంతోషాన్ని కలిగిస్తుంది. కిన్సే ఇన్స్టిట్యూట్  2015లో జరిపిన అధ్యయనంలో క్రమం తప్పకుండా  శృంగారంలో పాల్గొనే స్త్రీలలో బలమైన రోగనిరోధక వ్యవస్థను కలిగి ఉంటున్నట్లు తెలిపింది.

Read Also: రాళ్లపై నివసించే రియల్ స్పైడర్ మ్యాన్.. ఎక్కడుందో తెలుసా?

ఇక శీతాకాలంలో విటమిన్ డి తక్కువగా ఉంటుంది. సుమారు 42 శాతం మంది ప్రజలు తక్కువ ఎండ కారణంగా ఈ లోపం ఏర్పడుతుంది. ఈ కారణంగా అలసటకు కారణం అవుతుంది. ఇలాంటి సమయంలో శృంగారం మానసిక శక్తిని పెంచడంతో పాటు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సాయపడుతుంది. గుండె పని తీరు కూడా పెరుగుతుంది. ఫలితంగా ఉత్సాహం కలుగుతుంది. మొత్తంగా వారానికి 1-2 సార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల యాంటీబాడీలు పెరిగి, ఒత్తిడిని ఎదుర్కోవడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. శీతాకాలంలో కలిగి ఆనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.

Read Also:  ఓడియమ్మ.. దీపావళికి సోన్ పాపిడి గిఫ్ట్ ఇవ్వడానికి కారణం ఇదేనట!

Related News

Garlic: చలికాలంలో వెల్లుల్లి ఎక్కువగా తింటే.. నమ్మలేనన్ని ప్రయోజనాలు !

Waking Up: మధ్య రాత్రి మెలకువ వస్తోందా? అసలు కారణాలివే !

Breakfasts: మార్నింగ్ ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ తింటే.. రోజంతా ఫుల్ ఎనర్జీ

Soan papdi Sweet: ఓడియమ్మ.. దీపావళికి సోన్ పాపిడి గిఫ్ట్ ఇవ్వడానికి కారణం ఇదేనట!

Spinach: పాలకూరతో పాటు.. ఇవి అస్సలు తినొద్దు !

Health Risks: పండగ సమయంలో నోటిని అదుపు చేసుకోలేకపోతున్నారా ? ఇలా చేయకుంటే సమస్యలు తప్పవు

Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్ తగ్గించే.. బెస్ట్ ఫుడ్స్ ఏంటో తెలుసా ?

Big Stories

×