Home Loan Interest Rates: ఈ ఏడాది మీరు ఇల్లు కొనడం లేదా కట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే మీరు హోమ్ లోన్ గురించి ఆలోచిస్తుంటారు. మీ కష్టానికి బ్యాంకు లోన్ తోడైతే మీ కలల సౌధం రూపుదిద్దుకుంటుంది. మార్కెట్ లోని ప్రముఖ హోమ్ లోన్ రుణ సంస్థలు.. అందిస్తున్న వడ్డీ రేట్ల గురించి తెలుసుకుందాం. హోమ్ లోన్ అంటే కాస్త పెద్ద మొత్తంలో తీసుకుంటారు. కాబట్టి వడ్డీ కాస్త తగ్గినా..పెద్ద మొత్తంలో తేడా కనిపిస్తుంది. హోమ్ లోన్ తీసుకునే ముందు పలు సంస్థలు అందిస్తున్న వడ్డీ రేట్లు, తిరిగి చెల్లించే విధానాలు, ఈఎంఐ సదుపాయాలు ఇలా అన్నింటిని చెక్ చేస్తుంటారు. వీటితో పాటు నిపుణులు సలహాలు కూడా ముఖ్యమే.
అయితే లోన్ తీసుకునే వారు సాధారణంగా వడ్డీ రేట్లపై మాత్రమే దృష్టి పెడతారు. అయితే, హోమ్ లోన్ తీసుకునే ముందు వడ్డీ రేటుతో పాటు వివిధ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే, ప్రాసెసింగ్ ఫీజులు, ముందస్తు చెల్లింపు ఛార్జీలు మొదలైన ఇతర అంశాలు కూడా హోమ్ లోన్ లో భాగంగా ఉంటాయి.
1.క్రెడిట్ ప్రొఫైల్ – క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉండాలి. ముఖ్యంగా 750 కంటే ఎక్కువ ఉన్న వారికి హోమ్ లోన్ సులభంగా దొరుకుతుంది.
2.స్థిరమైన ఆదాయం- మీ నెలలవారీ స్థిర ఆదాయం ఉండాలి. ఆర్థిక ఇబ్బంది లేకుండా హోమ్ లోన్ తిరిగి చెల్లించేలా ఉండాలి.
3. హోమ్ లోన్ అంటే కేవలం వడ్డీ రేట్లను మాత్రమే కాకుండా, ఇతర విషయాలను కూడా పరిశీలించాలి. ప్రాసెసింగ్ ఫీజులు, ఛార్జీలు, బీమా ఖర్చులు, ముందస్తు చెల్లింపు ఫైన్లు, గడువు తేదీ వర్తించే ఇతర ఫీజుల కోసం చెక్ చేయండి.
4. లోన్ పీరియడ్ కూడా చాలా కీలకం. ఎక్కువ కాలపరిమితి నెలవారీ ఈఎంఐలను తగ్గించగలదు, కానీ రుణంపై చెల్లించే మొత్తం వడ్డీని భారీగా పెంచుతుంది. అదేవిధంగా, తక్కువ కాలపరిమితి మొత్తం వడ్డీ ఖర్చులను తగ్గిస్తుంది. కానీ నెలవారీగా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఈఎంఐ మొత్తాన్ని ఎంచుకోండి.
5. ప్రీ క్లోజర్ రూల్స్ – ముందస్తుగా లోన్ చెల్లించాలని భావిస్తే.. ఈ విధానం గురించి పూర్తి సమాచారం రుణ సంస్థను అడిగి తెలుసుకోండి.
గృహ రుణాలు విషయంలో అనవసరమైన ఒత్తిడి లేకుండా, లాంగ్ టర్మ్ ప్లానింగ్ తో ఆర్థిక స్థిరత్వానికి తోడ్పడేలా ఉండాలి.
Also Read: హోం లోన్ కు ఇన్సూరెన్స్.. తీసుకోవాలా? వద్దా?
గమనిక: ఈ ఆర్టికల్ లోని సమాచారం పూర్తిగా ఇంటర్నెట్ ఆధారితం. ఈ వివరాలను బిగ్ టీవీ తెలుగు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ధ్రువీకరించడంలేదు. యూజర్ అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం అందిస్తున్నాం. ఏదైనా లోన్ విషయమై నిపుణులను సంప్రదించగలరు.