E-Paper
Advertisement

మ్యూల్ ఖాతాలపై సజ్జనార్ సర్జికల్ స్ట్రైక్.. బ్యాంక్ అధికారులకు తప్పని అరెస్టులు!

మ్యూల్ ఖాతాలపై సజ్జనార్ సర్జికల్ స్ట్రైక్.. బ్యాంక్ అధికారులకు తప్పని అరెస్టులు!
Advertisement

Mule Accounts: స్వేచ్ఛ బ్యూరో: బ్యాంకుల్లో మ్యూల్​ ఖాతాలు ఉంటే చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్​ కమిషనర్ వీ.సీ.సజ్జనార్​ స్పష్టం చేశారు. టార్గెట్లు కాదు…కస్టమర్ల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. సేఫ్​ కస్టమర్​ ఛాలెంజ్​ దిశగా బ్యాంకర్లు అడుగులు వేయాలని చెప్పారు. ఒక్క అకౌంట్ హోల్డర్​ కూడా సైబర్​ నేరాల బారిన పడకుండా చూడటమే లక్ష్యంగా పని చేయాలన్నారు. బంజారాహిల్స్​ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్​ లో గురువారం వేర్వేరు బ్యాంకుల ప్రతినిధులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ బ్యాంక్ జీరో మ్యూల్ అకౌంట్స్​ లక్ష్యంగా పని చేయాలని చెప్పారు. రకరకాలుగా జనానికి టోకరా వేస్తూ లక్షలు..కోట్లు కొల్లగొడుతున్న సైబర్​ క్రిమినల్స్ మ్యూల్ అకౌంట్ల ద్వారా ఆ డబ్బును ఎగరేసుకు పోతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఖాతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

మ్యూల్ అకౌంట్లను తెరవటం..

నేషనల్​ సైబర్ క్రైమ్​ రిపోర్టింగ్​ పోర్టల్ లో నమోదయ్యే ఫిర్యాదుల ఆధారంగా ఆయా బ్రాంచీలు ఎప్పటికప్పుడు పనితీరును సమీక్షించుకోవాలన్నారు. ఖాతాల సంఖ్య కాకుండా అకౌంట్ హోల్డర్ల భద్రతనే ఉద్యోగులు కీలక పనితీరు సూచికగా పరిగణించాలని చెప్పారు. ఆపరేషన్​ ఆక్టోపస్ 2.0లో భాగంగా జరిపిన దాడుల్లో 850 కేసుల్లో 15‌‌0 కోట్ల రూపాయల మోసాన్ని గుర్తించినట్టు చెప్పారు. ఆపరేషన్​ లో భాగంగా మ్యూల్ అకౌంట్లను తెరవటంలో సహకరించిన 32మంది బ్యాంకు అధికారులను అరెస్ట్​ చేసినట్టు తెలిపారు. కంబోడియా, వియత్నాం, దుబాయ్​ వంటి దేశాల నుంచి సైబర్ నేరాలు చేస్తున్న అంతర్జాతీయ ముఠాలు స్థానిక బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై మ్యూల్​ అకౌంట్ల ద్వారా డబ్బును తరలించుకు పోతున్నారని తెలిపారు. కేవైసీ నిబంధనలను ఉల్లంఘించే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవటంతోపాటు వారిని బ్యాంకింగ్​ రంగం నుంచి బ్లాక్ లిస్ట్ చేయాలని సూచించారు.

Advertisement

Also Read: ఆర్టీసీ సమ్మె సస్పెన్స్.. 29 డిమాండ్లకు సర్కార్ ఓకే.. ఆ మూడింటిపైనే పీటముడి!

డబ్బు విత్ డ్రా చేస్తున్నారా..?

ఇక, ఫిక్స్​ డ్​ డిపాజిట్లను ముందస్తుగా క్లోజ్​ చేసేందుకు వచ్చే కస్టమర్ల విషయంలో బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సైబర్​ క్రిమినల్స్​ ఒత్తిడి.. బెదిరింపుల వల్లనే వాళ్లు డబ్బు విత్ డ్రా చేస్తున్నారా? అన్నది పరిశీలించాలని చెప్పారు. అదే నిజమైతే వారికి అవగాహన కల్పించి సైబర్​ క్రిమినల్స్ చేతుల్లో డబ్బు పోగొట్టుకోకుండా చూడాలని తెలిపారు. మ్యూల్​ అకౌంట్లను గుర్తించే మ్యూల్ హంటర్​ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. 1930 నెంబర్​ పై అకౌంట్​ హోల్డర్లకు విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. సైబర్​ నేరగాళ్ల నెట్​ వర్క్​ ను పూర్తిగా తుడిచి పెట్టేవరకు ఆపరేషన్​ ఆక్టోపస్​ కొనసాగుతుందని చెబుతూ దీంట్లో బ్యాంకులు పోలీసులకు సహకరించాలని కోరారు. సమావేశంలో ఆర్బీఐ రీజనల్​ డైరెక్టర్​ చిన్మయ్ కుమార్, అదనపు సీపీ ఎం.శ్రీనివాసులు, సైబర్​ క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ శివమారుతితోపాటు 45 బ్యాంకులకు చెందిన 75మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Also read: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న కౌన్సిలర్.. పోలీసుల మౌనం వెనుక మర్మమేంటో..?

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×