E-Paper
Advertisement

Lectrix LXS 2.0 @ Rs 50,000: రూ. 50 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ చూస్తే షాకే!

Lectrix LXS 2.0 @ Rs 50,000: రూ. 50 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ చూస్తే షాకే!
Advertisement
Lectrix LXS 2.0
Lectrix LXS 2.0

Buy Lectrix LXS 2.0 at Rs 50,000: దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం భారీగా పెరిగింది. మార్కెట్‌లోకి కంపెనీలు పోటాపోటీగా స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. తక్కువ ధరతో ఆకట్టుకునే డిజైన్, అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నాయి. ముఖ్యంగా ఈ స్కూటర్ల మార్కెట్‌లో స్టార్టప్‌లు గట్టిగానే పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే Lectrix ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ తన హై స్పీడ్‌ ఎలక్ట్రిక్ స్కూటర్‌ LXS 2.0ను లాంచ్ చేసింది.

LXS 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర చూసినట్లయితే.. రూ. 49,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ లెక్ట్రిక్స్ బ్రాండ్ ప్రముఖ SAR గ్రూప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగానికి చెందినది. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌తో 100 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. గరిష్ఠంగా 50 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. అంతేకాకుండా బ్యాటరీపై లైఫ్‌టైమ్ వారంటీని కంపెనీ ఇస్తుంది.

Advertisement

‌ LXS 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులు సబ్‌స్క్రిప్షన్ ప్రాతిపదికన బ్యాటరీ సేవలకు చెల్లించాల్సి ఉంటుందని Lectrix వెల్లిడించింది . బ్యాటరీ-ఎ-సర్వీస్(BAAS) ప్రోగ్రామ్ కింద లెక్ట్రిక్స్ EV కస్టమర్‌లు ఎలక్ట్రిక్ స్కూటర్‌ల కంటే 40 శాతం వరకు తక్కువ చెల్లిస్తారని కంపెనీ తెలిపింది.

Also Read: ఏప్రిల్ 24న అల్ట్రావయోలెట్ నుంచి కొత్త బైక్.. దేశంలో ఇదే అత్యంత వేగవంతమైన ఈవీ

Advertisement

అంతేకాకుండా ఫిబ్రవరి 2024లో LXS 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ-రేంజ్‌ వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్‌ పూర్తి ఛార్జింగ్‌పై 98 కి.మీల రేంజ్‌ను అందిస్తుంది. ఇందులో 2.3kW బ్యాటరీ ప్యాక్‌ ఉంది. ఈ స్కూటర్ ధర రూ. 79,999.

ఇక Lectrix LXS 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో యాంటీ-థెఫ్ట్ సిస్టమ్, ఎమర్జెన్సీ SOS ఉంది. డోర్-టు-డోర్ సర్వీస్‌లాంటి మరెన్నో అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. కాగా ఈ సంస్థ ఇప్పటికే దేశవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ మంది కస్టమర్ బేస్‌ను కలిగి ఉంది. లెక్ట్రిక్స్ కొత్త స్కూటర్ కొనుగోలు దారులను టార్గెట్ చేస్తూ.. మూడు సంవత్సరాల వరకు వారంటీ ఇస్తోంది.

Also Read: థార్‌కి పోటీగా జీప్ రాంగ్లర్ ఎస్‌యూవీ.. ఆకట్టుకుంటున్న ఫీచర్స్!

LXS 2.0 స్కూటర్ నుంచి బ్యాటరీని డీలింగ్ చేసి మంచి EV అనుభవాన్ని ఇస్తుంది. ప్రస్తుత ఈవీ స్కూటర్ల ధరలు కూడా రూ. లక్షల్లో ఉన్నాయి. దీంతో బడ్జెట్‌లో కంపెనీ LXS 2.0 స్కూటర్ లాంచ్ చేసింది. అలానే బ్యాటరీపై లైఫ్‌టైమ్ వారెంటీ ఇస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే వారికి ఇదో మంచి ఆఫర్ కానుంది.

Related News

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

Big Stories

Advertisement
×