BigTV English

Ultraviolette EV Launch Date: ఏప్రిల్ 24న అల్ట్రావయోలెట్ నుంచి కొత్త బైక్.. దేశంలో ఇదే అత్యంత వేగవంతమైన ఈవీ!

Ultraviolette EV Launch Date: ఏప్రిల్ 24న అల్ట్రావయోలెట్ నుంచి కొత్త బైక్.. దేశంలో ఇదే అత్యంత వేగవంతమైన ఈవీ!
Ultraviolette
Ultraviolette

Ultraviolette F77 Launching in India on April 24: ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ అల్ట్రావయోలెట్ తన అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ ఈ బైక్‌ను ఏప్రిల్ 24న విడుదల చేయనుంది. అయితే ఈ బైక్ పేరు మాత్రం ఏమిటో కంపెనీ వెల్లడించలేదు. ఇది దేశంలోనే అత్యంత వేగంగా నడిచే ఎలక్ట్రిక్ బైక్‌గా ఉండనుంది.


ప్రస్తుతం కంపెనీ Ultraviolette F77 ఎలక్ట్రిక్ బైక్‌ను మార్కెట్‌లో విక్రయిస్తోంది. దీని గరిష్ట వేగం గంటకు 140 కిలోమీటర్లు. ప్రస్తుత మోడల్ కంటే దీని వేగం ఎక్కువగా ఉంటుందని కొత్త బైక్ గురించి సంస్థ వెల్లడించింది. విశేషమేమిటంటే.. ఎఫ్77 ఇప్పటివరకు ఎలక్ట్రిక్ మార్కెట్‌లో ఉన్న అత్యంత వేగవంతమైన ఈవీ బైక్. ఈ బైక్ పూర్తి ఫెయిరింగ్ స్పోర్ట్స్ డిజైన్‌లో వస్తుంది. కొత్త బైక్ కూడా ఇదే డిజైన్‌లో వచ్చే ఛాన్స్ ఉంది.

ఫీచర్లు..


F77 ఫాస్ట్ వెర్షన్ శక్తివంతమైన మోటార్‌తో పాటు F99 ప్రోటోటైప్ కొన్ని లక్షణాలను కూడా కలిగి ఉండవచ్చు. ఇది EICMA 2023లో ప్రవేశపెట్టారు. వేగవంతమైన F77లో కొత్త కలర్‌వే, డౌన్‌ఫోర్స్ జెనరేటింగ్ ఫీచర్లను చూడవచ్చు. బైక్‌లోని మిగిలిన భాగాలైన ఛాసిస్, సస్పెన్షన్, బ్రేక్‌లు ఇప్పటికే ఉన్న మోడల్‌ను పోలి ఉండే అవకాశం ఉంది. నివేదిక ప్రకారం.. Ultraviolette F77 ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.8 లక్షల నుండి రూ. 4.55 లక్షల మధ్య ఉండవచ్చు. ఫాస్ట్ వెర్షన్ దాని పాత మోడల్ కంటే కొంచెం ఎక్కువ ధరతో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

Also Read: ఏథర్ రిజ్టా వచ్చేసింది.. ఇది పక్కా ఫ్యామిలీ స్కూటర్!

గత సంవత్సరం చంద్రయాన్-3 ప్రయోగ విజయాన్ని పురస్కరించుకుని F77ను పరిమిత-వేరియంట్ అవతార్‌ విడుదల చేసింది. ఈ మోటార్‌సైకిల్ F77 స్పేస్ ఎడిషన్‌లో తీసుకొచ్చారు. దీని ధర రూ. 5.60 లక్షలు. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను  10 యూనిట్లు మాత్రమే విడుదల చేశారు. బుకింగ్ ప్రారంభించిన వెంటనే అన్ని యూనిట్లు అమ్ముడుపోయాయి. అన్ని బైక్‌లు కేవలం 90 సెకన్లలోపు బుక్ అయ్యాయని కంపెనీ తెలిపింది. ఇది కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 నుండి 60 కి.మీ వేగాన్ని అందుకోగలదు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే F77 307 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది.

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×