BigTV English

TDP Donation Website: టీడీపీ విరాళాల వెబ్‌సైట్‌ ప్రారంభం.. తొలి చందా ఎంతంటే..?

TDP Donation Website: టీడీపీ విరాళాల వెబ్‌సైట్‌ ప్రారంభం.. తొలి చందా ఎంతంటే..?
Chandrababu Naidu
Chandrababu Naidu

Chandrababu Naidu Started Donation Website: తెలుగుదేశం పార్టీ విరాళాల వెబ్‌సైట్‌ను ఆ పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెబ్‌సైట్‌(https://tdpforandhra.com)ను ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌ నుంచే టీడీపీకి విరాళాలు ఇవ్వాలని చంద్రబాబు స్పష్టం చేశారు.


కాగా ఈ వెబ్‌సైట్‌లో రూ. 99 నుంచి విరాళాలు అందిచే వెసులుబాటు కల్పించారు. తొలి విరాళంగా చంద్రబాబు రూ. 99,999ను పార్టీకి అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ చీఫ్ మాట్లాడారు. ఎన్ఆర్ఐల కోసం వెబ్‌సైట్ రూపొందించామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్ఆర్ఐలు పార్టీకోసం విరాళాలు ఇవ్వటమే కాకుండా రాష్ట్రం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.

విరాళాలు ఇచ్చినవారికి రశీదులు ఇస్తామని.. పార్టీ కార్యకర్తలు, టీడీపీ సానుభూతిపరుల నుంచే విరాళాలు సేకరిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. డిజిటల్ కరెన్సీ ద్వారా ట్రాకింగ్ సులువుని తెలిపారు. ఇక అమెరికాలోనూ రాజకీయ విరాళాలకు అనుమతి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. వైసీపీ గ్యంబ్లర్ల నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ విరాళాలు సేకరించద్దన్నారు.


Also Read: Pawan Kalyan: నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకున్న ఆడపిల్లలు: పవన్ కళ్యాణ్

ఆంధ్ర ప్రదేశ్‌ను కాపాడుకోడానికే కూటమిగా ఏర్పడ్డామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకోడానికి ప్రజలు కలసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఒక్కరు మాత్రమే బాగుపడ్డారని.. 5 కోట్ల మంది నష్టపోయారన్నారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×