E-Paper
Advertisement

డబుల్ యాక్సిడెంట్ బెనిఫిట్ తో డబుల్ క్లెయిమ్.. ఎల్ఐసీ పాలసీలో ఈ రైడర్ గురించి తెలుసా?

డబుల్ యాక్సిడెంట్ బెనిఫిట్ తో డబుల్ క్లెయిమ్.. ఎల్ఐసీ పాలసీలో ఈ రైడర్ గురించి తెలుసా?
Advertisement

LIC DAB Rider: ఎల్ఐసీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై డబుల్ యాక్సిడెంట్ బెనిఫిట్(DAB)ను అందిస్తుంది. బేస్ పాలసీకి రైడర్‌గా డబుల్ యాక్సిడెంట్ బెనిఫిట్ ను యాడ్ చేసుకోవచ్చు. ప్రమాదం కారణంగా పాలసీదారుడు మరణిస్తే ఎడిషనల్ కవరేజీ పొందేందుకు ఈ రైడర్ కొనుగోలు చేయవచ్చు. డబుల్ యాక్సిడెంట్ బెనిఫిట్ కోసం బీమా మొత్తంలోని ప్రతి 1000 రూపాయలకు.. 1 రూపాయి చొప్పున అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ప్రమాదం కారణంగా పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే నామినీ రెట్టింపు మొత్తం క్లెయిమ్ చేసుకోవచ్చు.

డబుల్ యాక్సిడెంట్ బెనిఫిట్ కింద పాలసీదారులకు.. సమ్ అస్యూర్డ్ మొత్తానికి రెట్టింపు అందిస్తారు. రైడర్ ఫోర్స్ లో ఉన్నప్పుడు పాలసీదారుడు ప్రమాదంలో మరణిస్తే ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు. అయితే DAB క్లెయిమ్ చేసేవారు LIC నిబంధనల మేరకు ఫ్రూఫ్ లు సబ్మిట్ చేయాలి. సాధారణంగా ఎఫ్‌ఐఆర్, పోస్ట్-మార్టం రిపోర్ట్ వంటి డాక్యుమెంట్స్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.

ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవాలి?

  1. పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదం జరిగిన తేదీ నుంచి 90 లేదా 180 రోజులలోపు మరణిస్తేనే డబుల్ యాక్సిడెంట్ బెనిఫిట్ క్లెయిమ్ అవుతుంది.
  2. సహజ కారణాలు, ముందు నుంచే ఉన్న అనారోగ్య కారణాలతో మరణం సంభవిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉండవు.
  3. పాలసీ గడువు ముగిసిన తర్వాత ప్రమాదంలో పాలసీదారుడు మరణిస్తే, DAB ప్రయోజనాలు వర్తించవు.

ఎలా క్లెయిమ్ చేయాలి?

  • పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించిన 120 రోజులలోపు ఆ విషయాన్ని LIC బ్రాంచ్ లో తెలియజేయాలి.
  • లీగల్ అథారిటీ ధ్రువీకరించిన డెత్ సర్టిఫికెట్, ఇతర పత్రాలను సబ్‌మిట్ చేయాలి.
  • డాక్యుమెంట్స్ ను SDM సరిచూసి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత క్లెయిమ్ ఆమోదం పొందుతుంది.
  • క్లెయిమ్ ఆమోదం పొందిన తర్వాత, డీఏబీ మొత్తం నామినీ ఖాతాకు బదిలీ అవుతుంది.

ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి?

  • ఎఫ్ఐఆర్
  • పోస్ట్‌మార్టం రిపోర్ట్
  • పోలీసు దర్యాప్తు నివేదిక
  • స్పాట్ పంచనామా
  • ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం

మినహాయింపులు

Advertisement

సూసైడ్, సెల్ఫ్ ఇంజ్యూరీ, మెంటల్ కండీషన్ సరిగ్గా లేనికారణంగా డెట్ సంభవిస్తే.. క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. మద్యం లేదా మాదకద్రవ్యాల కారణంగా, అల్లర్లు, యుద్ధంలో పాల్గొనం వల్ల మరణం సంభవిస్తే డబుల్ యాక్సిడెంట్ బెనిఫిట్ వర్తించదు. అలాగే అడ్వెంచర్ స్పోర్ట్స్, పర్వతారోహణ, స్టీపుల్‌ చేసింగ్, క్రిమినల్ యాక్టివిటీ లేదా చట్ట ఉల్లంఘన కారణంగా మరణం సంభవిస్తే డబుల్ యాక్సిడెంట్ బెనిఫిట్ వర్తించదు.

Also Read: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?.. ఈ 5 విషయాలు చెక్ చేయండి

Related News

ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తారు? బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయ్!

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

పర్సనల్ లోన్ EMI కట్టలేకపోయారా? క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా ఎలా సరిచేయాలి?

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×