E-Paper
Advertisement

LIC Jeevan Utsav: ఒక్కసారి ప్రీమియం కడితే జీవితాంతం ఆదాయం.. ఎల్ఐసీ సూపర్ ప్లాన్

LIC Jeevan Utsav: ఒక్కసారి ప్రీమియం కడితే జీవితాంతం ఆదాయం.. ఎల్ఐసీ సూపర్ ప్లాన్
Advertisement

LIC Jeevan Utsav: ఎల్ఐసీ సింగిల్ ప్రీమియంతో జీవితాంతం రాబడి పొందే అద్భుతమైన పాలసీ ‘జీవన్ ఉత్సవ్’ ప్రారంభించింది. జనవరి 12 నుండి జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం పాలసీ కస్టమర్లకు అందుబాటులో ఉందని ఎల్ఐసీ తెలిపింది. ఇది నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్, సేవింగ్స్, పూర్తి జీవిత బీమా పథకమని పేర్కొంది. స్టాక్ మార్కెట్ రిస్క్ లేకుండా మొత్తం జీవిత కాలానికి బీమా రక్షణను కల్పిస్తుంది ఈ పాలసీ.

30 రోజుల పిల్లల నుంచి

సింగిల్ ప్రీమియం చెల్లించి జీవితాంతం రిస్క్‌ కవరేజీ పొందవచ్చు. 30 రోజుల నుంచి 65 ఏళ్ల లోపు వయస్సు గల వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ ప్లాన్‌ను ఎల్ఐసీ ఏజెంట్లు, కార్పొరేట్ ఏజెంట్లు, బ్రోకర్లు, బీమా మార్కెటింగ్ సంస్థల ద్వారా ఆఫ్‌లైన్‌లో తీసుకోవచ్చు. లేదా www.licindia.in ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం జనవరి 12, 2026 నుండి అందుబాటులో ఉంటుంది. నాన్ లింక్ పాలసీ కాబట్టి మార్కెట్ హెచ్చుతగ్గులు పాలసీ ప్రయోజనాలను ప్రభావితం చేయవు.

ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం

Advertisement

⦿ 30 రోజుల నుంచి 65 ఏళ్ల వయసున్న వారు ఈ పాలసీకి అర్హులు

⦿ కనీస ప్రాథమిక బీమా మొత్తం రూ.5 లక్షలు. గరిష్ఠ పరిమితి లేదు.

Advertisement

⦿ ప్రతి రూ.1000కి ఏటా రూ.40 చొప్పున గ్యారంటీడ్‌ అడిషన్స్‌ జమ చేస్తారు.

⦿ రెగ్యులర్‌ బెనిఫిట్‌ ఆప్షన్‌ కింద పాలసీదారుడు ఎంచుకున్న వ్యవధిని బట్టి (7 నుంచి 17 ఏళ్ల తర్వాత) ఏటా సమ్ అస్యూర్డ్ పై 10% ఆదాయం లభిస్తుంది.

⦿ ఫ్లెక్సీ ఇన్‌కం బెనిఫిట్‌ ఆప్షన్‌ కింద పాలసీదారులు..తనకు వచ్చే 10% ఆదాయాన్ని ఎల్‌ఐసీ వద్దే ఉంచుకోవచ్చు. ఇలా ఉంచిన మొత్తంపై ఎల్ఐసీ 5.5% చక్రవడ్డీ చెల్లిస్తుంది. పాలసీదారులు కట్టిన మొత్తంలో 75 శాతం వరకు వెనక్కి తీసుకోవచ్చు.

⦿ ఈ పాలసీ వ్యవధిలో పాలసీదారుడు మరణిస్తే నామినీకి పాలసీ మొత్తంతో పాటు, గ్యారంటీడ్‌ అడిషన్స్‌ అందిస్తారు. గడువు పూర్తైన తర్వాత మెచ్యూరిటీ ప్రయోజనం కింద బేసిక్ సమ్ అస్యూర్డ్ లేదా సింగిల్‌ ప్రీమియానికి 1.25 రెట్లు (ఏది ఎక్కువైతే అది) గ్యారంటీడ్‌ అడిషన్స్‌ తో కలిపి చెల్లిస్తారు.

⦿ దీంతో పాటు యాడ్ ఆన్ పాలసీ కింద యాక్సిడెంట్‌ డెత్‌ అండ్‌ డిజెబిలిటీ బెన్‌ఫిట్‌ రైడర్‌, న్యూటర్మ్‌ అష్యూరెన్స్‌ రైడర్‌ యాడ్ చేసుకోవచ్చు.

ఉదాహరణకు: 35 ఏళ్ల వ్యక్తి రూ.10 లక్షలకు జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం పాలసీ తీసుకున్నారనుకోండి. గ్యారెంటీడ్‌ అడిషన్‌ తో పీరియడ్‌ను 10 సంవత్సరాలు సెలెక్ట్ చేసుకుంటే..సింగిల్‌ ప్రీమియం కింద రూ.8,08,650 చెల్లించాల్సి ఉంటుంది. అతడికి 45 ఏళ్లు తర్వాత ఆదాయం రావడం స్టార్ అవుతుంది. ప్రతి ఏటా రూ.లక్ష చొప్పున..100 ఏళ్లు వరకు ఎల్ఐసీ చెల్లిస్తుంది. ఒకవేళ పాలసీ మధ్యలో పాలసీదారుడికి ఏదైనా జరిగితే నామినీకి రూ.14.22 లక్షలు చెల్లిస్తారు. ఒకవేళ రూ.10 లక్షలు పాలసీ గ్యారెంటీడ్ అడిషన్ 7 సంవత్సరాలకు తీసుకుంటే.. సింగిల్ ప్రీమియం కింద రూ.9,80,700 కట్టాలి. పాలసీదారుడు మరణిస్తే.. నామినీకి రూ.15,17,000 చెల్లిస్తారు.

Also Read:  ఎల్ఐసీ బంపర్ ఆఫర్ – రూ.490కే లక్ష రూపాయల పాలసీ

 

Related News

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

Big Stories

Advertisement
×