LIC POLICY: ఎల్ఐసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీపావళి పండుగ సందర్బంగా ప్రతి ఒక్కరికి ఇన్యూరెన్స్ కల్పించాలనే ఉద్దేశంతో కేవలం నెలకు రూ. 490కే లక్ష రూపాయల ఇన్సూరెన్స్ కల్పించనుంది. ఈ పాలసీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా.. మన దేశంలో అతి పురాతనమైన అతి పెద్దదైన ఇన్యూరెన్స్ కంపెనీ. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థం. ఈ సంస్థ ఇప్పటికే ఎన్నో రకాల ఇన్సూరెన్స్ సేవలు అందిస్తూ ఉంది. అయితే దేశంలో ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ అందిచాలనే సంకల్పంతో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నెలకు 490 రూపాయలు కడితే చాలు లక్ష రూపాయల ఇన్యూరెన్స్ అందించనుంది. ఇంత తక్కువ ప్రీమియంతో వస్తున్న ఈ స్కీమ్‌కు జన్ సురక్ష అనే పేరు పెట్టింది. అయితే జన్ సురక్ష గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
జన్ సురక్ష పాలసీ నెంబర్ 880. ఇది మన దేశంలోని పేద దిగువ తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ స్కీం తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో పొదుపు మరియు ఇన్సూరెన్స్ చేసుకునే వెసులుబాటును కల్పించింది ఎల్‌ఐసీ. పైగా ఇది అందరికీ అందుబాటులో ఉండేలా.. ఇన్‌కం ఫ్రూప్ కానీ మెడికల్ టెస్ట్ లేకుండానే పాలసీ తీసుకోవచ్చు. కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఇక ఈ పాలసీ తీసుకుంటే మొత్తం పీరియడ్‌లో చివరి ఐదు సంవత్సరాలు పాలసీ కట్టకపోయినా ప్లాబ్లం ఉండదు.
ఉదాహరణకు ఎవరైనా 12 సంవత్సరాలకు ప్రీమియం తీసుకుంటే వాళ్లు ఏడు సంవత్సరాలే ప్రీమియం కట్టాలి. అలాగే 15 ఏళ్లు తీసుకుంటే 10 సంవత్సరాలు.. 20 ఏండ్లు తీసుకుంటే.. పదిహేన సంవత్సరాలే ప్రీమియం కట్టొచ్చు. ఇక ఈ పాలసీ కట్టిన వాళ్లు మొదటి సంవత్సరం తర్వాత మీరు చెల్లించిన ప్రీమియం పై లోన్ కూడా లభిస్తుంది.
ఈ ప్లాన్ తీసుకోవడానికి కనీస వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు 55 సంవత్సరాలు వరకు ఉండాలి. ఇక ఇందులో కనీస భీమా లక్ష రూపాయలు, గరిష్ట భీమా రెండు లక్షల రూపాయలు. ఇక ప్రీమియం సంవత్సరం, ఆరు నెలలు, మూడు నెలలు, నెలకు ఒకసారి కట్టుకోవచ్చు. ఈ పాలసీ టర్మ్ మినిమం 12 సంవత్సరాలు, మాగ్జిమం 20 సంవత్సరాలు ఉంటుంది.
ఈ పాలసీలో ఇన్సూరెన్స్ ఎంత ఎక్కువ కాలం తీసుకుంటే మీకు అంత ఎక్కువ బోనస్ వస్తుంది. ఉదాహరణకు ఒక 30 సంవత్సరాల వ్యక్తి 20 సంవత్సరాల పాలసీ తీసుకుంటే అతను 15 సంవత్సరాలే ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. అతను ఒక లక్షకు ప్రీమియం తీసుకుంటే.. సంవత్సరానికి 5835 రూపాయలు, ఆరు నెలలకు అయితే 2917 రూపాయలు, మూడు నెలలకు 1458 రూపాయలు నెలకు అయితే 490 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఈ నాలుగింట్లో ఏదైనా ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఇరవై ఏళ్లు ప్రీమియం పూర్తి అయ్యాక ఆ పాలసీ హోల్డర్‌కు లక్షా నలభై అయిదు వేల రూపాయలు రిటర్న్ వస్తాయి. ఇదే విధంగా రెండు లక్షల పాలసీకి కూడా వర్తిస్తుంది.
పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఇవి మార్కెట్‌కు అనుగుణంగా మారతూ ఉండొచ్చు.