E-Paper
Advertisement

LPG Price Cut: భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఏ నగరంలో ఎంత తగ్గాయంటే?

LPG Price Cut: భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఏ నగరంలో ఎంత తగ్గాయంటే?

LPG Price Cut: డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ ధర సవరింపు ప్రక్రియలో భాగంగా వచ్చిన ఈ తగ్గింపు సోమవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చింది. ఈసారి 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.10 తగ్గించగా, గత నెలలో తగ్గించిన రూ.5తో కలిపి రెండు నెలల్లో మొత్తం రూ.15 తగ్గినట్టైంది.

పరిశ్రమలు కాస్త ఉపశమనం

ఈ సవరణతో వ్యాపార రంగం, ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ యూనిట్లు, బేకరీలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు కొంత ఉపశమనం పొందనున్నాయి. కరోనా తరువాత పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ఆహార పదార్థాల ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రంగానికి ఇది తాత్కాలిక ఉపసమనం అవుతుందని పరిశ్రమ ప్రతినిధులు పేర్కొంటున్నారు.

ప్రధాన నగరాల్లో కొత్త ధరలు నమోదయ్యాయి

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) వెబ్‌సైట్‌లో ప్రకటించిన తాజా ధరల ప్రకారం 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ఢిల్లీలో రూ.1,590.50 నుండి రూ.1,580.50కు తగ్గింది. కోల్‌కతాలో రూ.1,694 నుంచి రూ.1,684కి, ముంబైలో రూ.1,541.50 నుంచి రూ.1,531.50కి, చెన్నైలో రూ.1,749 నుంచి రూ.1,739.50కి ధరలు తగ్గాయి. ఇతర ప్రధాన పట్టణాల్లో కూడా ఇదే తరహా తగ్గింపు నమోదైంది. పెరుగుతున్న రవాణా ఖర్చులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలలో వచ్చిన తాజా మార్పులు ఈ నిర్ణయానికి కారణమని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: Realme New 5G Phone: రోజంతా పవర్‌తో రియల్‌మీ నియో 7 టర్బో.. మిడ్ రేంజ్ ధరలో టాప్ క్లాస్ పర్‌ఫార్మెన్స్

వంట గ్యాస్ సిలిండర్ ధరలో మార్పులు

కమర్షియల్ సిలిండర్ ధరల్లో తగ్గింపు జరిగినప్పటికీ, వంట గ్యాస్ సిలిండర్ ధరలో 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర యథాతథంగానే కొనసాగుతోంది. ఢిల్లీలో ధర రూ.853గానే ఉంది. ముంబైలో రూ.852.50, లక్నోలో రూ.890.50. గత కొన్ని నెలలుగా గృహ ఎల్‌పిజి ధరల్లో ఎటువంటి మార్పులు లేకపోవడం వల్ల వినియోగదారులపై అదనపు భారాన్ని పడనీయకూడదనే ప్రభుత్వ ఉద్దేశ్యం ప్రతిఫలించినట్లు భావిస్తున్నారు.

పెరిగిన ఏవియేషన్ ఇంధన ధరలు 

ఒకవైపు వాణిజ్య ఎల్‌పిజి ధరలు తగ్గగా, మరోవైపు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ATF) ధరలు పెరిగాయి. కిలోలీటర్‌కు రూ.777 పెరిగి రూ.94,543.02కి చేరాయి. దీని ప్రభావం విమాన టికెట్ ధరలపై పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

భవిష్యత్తులో మార్పులు సాధ్యమేనా?

అంతర్జాతీయ చమురు ధరల్లో అస్థిరత కొనసాగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఇంకా మరిన్ని ధర సవరణలు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రస్తుతం జరిగిన ఈ తగ్గింపు వ్యాపార రంగానికి కొంత ఊరట ఇవ్వగా, గృహ ఎల్‌పిజి ధరల్లో ఎప్పుడు మార్పు వస్తుందో ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఇకపై ఆ కోడ్ లేకపోతే సిలిండర్ రానట్లే!

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

Big Stories

×