E-Paper
Advertisement

CM Revanth Reddy: పని చేయించుకోండి.. లంచం అడిగితే వీపు విమానం మోత మోగించండి: సీఎం రేవంత్

CM Revanth Reddy: పని చేయించుకోండి.. లంచం అడిగితే వీపు విమానం మోత మోగించండి: సీఎం రేవంత్
Advertisement

Revanth Meeting In Makthal: గత పాలకులు పందులకు, గొర్రెలకు లెక్కలు చెప్పారేగానీ.. కులాల లెక్కలు చెప్పలేదని.. మేము వర్గీకరణ చేసి మాల మాదిగల మధ్య పంచాయతీని శాశ్వతంగా తెంచేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం మక్తల్ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సభకు నియోజకవర్గం నలుమూలల నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ప్రధానంగా తెలంగాణలో తమ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఆరు గ్యారెంటీ పథకాల పురోగతి గురించి వివరించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలలో అనేక వాటిని అమలు చేశామని, మిగిలిన హామీలను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన లోపాలను, అవినీతిని ఎత్తి చూపుతూ, తమ ప్రభుత్వం నిస్వార్థ పాలన అందిస్తోందని, ప్రజల భాగస్వామ్యంతోనే ‘ప్రజా ప్రభుత్వం’ నడుస్తుందని తెలిపారు.

Advertisement

అంతేకాకుండా పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది. మోసగిస్తే పాతాళానికి తొక్కుతుందన్నారు. మక్తల్ నియోజకవర్గాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. అందుకే మక్తల్ నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు ప్రారంభించాం అన్నారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం విషయంలో పదేళ్లు మన గోడు విన్నవారే లేరు.. సాగునీరు, తాగునీరు కోసం ఏనాడు గత పాలకుల తాపత్రయపడలేదు.. ఈ జిల్లా ప్రాజెక్టులను గత ప్రభుత్వాధినేత పూర్తి చేయలేదు.. కాబట్టి రైతులు అడిగినంత పరిహారం ఇచ్చి ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రాజెక్టు భూమి ఇచ్చిన రైతులకు రూ.20 లక్షల పరిహారం ఇస్తున్నాం.. అలాగే దండు కట్టండి, గుంపు కట్టండి.. దగ్గరుండి పని చేయించుకోండి. ఎవరైన లంచం అడిగితే వీపు విమానం మోత మోగించండి అన్నారు.

Also Read: ఏకగ్రీవమే టార్గెట్! అభివృద్ధి చేస్తారా? దోచేస్తారా?

Advertisement

అలాగే.. స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన వస్తువులు ప్రపంచ మార్కెట్‌ను ఆకర్షిస్తున్నాయి. అలాగే గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానిస్తాం.. అంతేకాకుండా కాళ్లల్లో కట్టబెట్టేవారికి ఓటు వేస్తే.. అభివృద్ధి ముందుకు సాగదు.. మీ సమస్యను తెలుసుకుని మీతో ఉండేవారిని సర్పంచిగా ఎన్నుకోండి అని చెప్పారు.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×