E-Paper
Advertisement

LPG Vs PNG Vs LNG Vs CNG.. ఈ గ్యాస్ ల ఉపయోగాలు, తేడాలేంటి?

LPG Vs PNG Vs LNG Vs CNG.. ఈ గ్యాస్ ల ఉపయోగాలు, తేడాలేంటి?
Advertisement

LPG Vs PNG Vs LNG Vs CNG: ఇరాన్ యుద్ధం కారణంగా వంట గ్యాస్ కోసం తిప్పలు మొదలయ్యాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కోసం జనం క్యూకడుతున్నారు. ఎల్పీజీ సరఫరా తగ్గడంతో ప్రజలు పీఎన్జీ వాడకం పెంచాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. అలాగే సీఎన్జీ కోసం వాహనదారులు తిప్పలు పడుతున్నారు. ప్రస్తుతం LPG, PNG, CNG, LNG పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పేర్లు ఒకేలా కనిపిస్తున్నప్పటికీ ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ, పీఎన్‌జీ, సీఎన్‌జీ రూపాలు, ఉపయోగాలు వేర్వేరు. ఇవన్నీ గ్యాస్ బేస్డ్ వ్యవస్థలో ముఖ్య భాగంగా ఉన్నాయి.

LPG గ్యాస్ అంటే ఏమిటి?

LPG -లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. మన ఇళ్లకు, రెస్టారెంట్లకు, హోటళ్లకు, కేఫ్‌లకు సిలిండర్ల ద్వారా వచ్చే గ్యాస్. దీనిని వంట కోసం ఉపయోగిస్తారు. ఇది ప్రొపేన్, బ్యూటేన్ గ్యాస్ ల మిశ్రమం. దీనిని స్టోర్ చేయడానికి, రవాణా చేయడానికి.. లిక్విడ్ రూపంలో సిలిండర్లలో నిల్వ చేస్తారు. ఎల్పీజీ గ్యాస్ ను ఇళ్లలో ఆహారం వండటానికి, నీటిని వేడి చేయడానికి ఉపయోగిస్తారు. హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లలో వంటకు వాడతారు. పరిశ్రమలలో నీటిని వేడి చేయడానికి, శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు.

PNG గ్యాస్ అంటే ఏమిటి?

Advertisement

PNG అనేది పైప్డ్ నేచురల్ గ్యాస్. పైప్‌లైన్‌ల ద్వారా నేరుగా ఇళ్లకు, హోటళ్లకు, పారిశ్రామిక యూనిట్లకు సరఫరా చేసే గ్యాస్. ఇందులో మీథేన్ వాయువు ఉంటుంది. పీఎన్జీని నేరుగా పైప్‌లైన్ ద్వారా సరఫరా చేస్తారు. దీనికి సిలిండర్లు అవసరం లేదు. అందుకే LPG కంటే PNGని సురక్షితమైనదిగా భావిస్తారు. పీఎన్జీని ఇళ్లు, హోటళ్లలో వంటకు, పరిశ్రమలలో ఉపయోగిస్తారు.

LNG గ్యాస్ అంటే ఏమిటి?

LNG అంటే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్, ఇది కూడా PNG లాంటి సహజ వాయువే. దీనిని దూర ప్రాంతాలకు సులభంగా రవాణా చేయడానికి చల్లబరిచి, లిక్విడ్ రూపంలోకి మారుస్తారు. పైప్‌లైన్‌లు అందుబాటులో లేని చోట LNG ఉపయోగపడుతుంది. LNGని పెద్ద పెద్ద పరిశ్రమలలో, విద్యుత్ ఉత్పత్తిలో, భారీ వాహనాలు, నౌకలలో ఉపయోగిస్తారు.

CNG గ్యాస్ అంటే ఏమిటి?

Advertisement

CNG అంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. దీనిని కంప్రెస్ చేసి సిలిండర్లలో నింపుతారు. పెట్రోల్, డీజిల్‌కు బదులుగా వాహనాలలో ఇంధనంగా ఉపయోగించే వాయువు ఇదే. ఇందులో కూడా ఎక్కువగా మీథేన్ గ్యాస్ ఉంటుంది. ఇది పెట్రోల్, డీజిల్ కంటే చౌక, తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తుంది. CNGని కార్లు, ఆటోలు, బస్సులు, టాక్సీలు, పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో ఉపయోగిస్తారు.

Also Read: వాట్సాప్ లో LPG గ్యాస్ బుకింగ్.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే!

Related News

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

Big Stories

Advertisement
×