E-Paper
Advertisement

తిరుమల కేక్ వివాదంపై మాధురి క్లారిటీ.. నేనెవరికీ క్షమాపణ చెప్పలేదు.. చెప్పనంటూ..

తిరుమల కేక్ వివాదంపై మాధురి క్లారిటీ.. నేనెవరికీ క్షమాపణ చెప్పలేదు.. చెప్పనంటూ..
Advertisement

Big Tv Kissik Talks: దివ్వెల మాధురి తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big tv Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తనకు సంబంధించిన అన్ని విషయాల గురించి ప్రస్తావించారు. అయితే ఈమె బిగ్ బాస్ సీజన్ 9 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో మరొక కంటెస్టెంట్ అయిన తనూజతో చాలా మంచి బాండింగ్ ఏర్పరచుకున్నారు. ఈ నేపథ్యంలోనే తనూజతో బాండింగ్ గురించి ఈ సందర్భంగా ప్రశ్నలు ఎదురవడంతో మాధురి తనూజ గురించి పలు విషయాలు తెలిపారు. సాధారణంగా నేను తొందరగా ఎవరితోనో కనెక్ట్ అవ్వను కానీ తనూజతో చాలా త్వరగా కనెక్ట్ అయిపోయానని తెలిపారు.

తిరుమలలో కేక్ కట్ చేయించిన మాధురి..

బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత తనతో చాలా మంచి బాండింగ్ ఏర్పడిందని తెలిపారు. అయితే ఇటీవల తనూజ పుట్టిన రోజు సందర్భంగా తిరుమలలో కేక్ కట్ చేయడంతో వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి కూడా వర్ష ప్రశ్న వేశారు. ఈ విషయంపై మరోసారి మాధురి క్లారిటీ ఇచ్చారు. తనూజ పుట్టినరోజు సందర్భంగా తిరుమల తీసుకెళ్లమని చాలా రోజుల క్రితమే అడిగింది. ఈ విషయం నేను శ్రీను గారికి చెప్పడంతో ఆరోజు ఆయనకు అసెంబ్లీ ఉన్నప్పటికీ కూడా మాకోసం తిరుపతి వచ్చి దర్శనం చేయించారు. కేక్ విషయానికి వస్తే మేము వెజ్ కేక్ తీసుకెళ్లాము.

తప్పు లేకుండా క్షమాపణలు చెప్పను..

Advertisement

మేము స్టే చేసిన గెస్ట్ హౌస్ లో కేక్ కట్ చేయించాను అయితే ఈ విషయంలో తనూజ తప్పు ఎక్కడా లేదు. తనకు సర్ ప్రైజ్ ఇద్దామని చెప్పి నేనే కేక్ తీసుకెళ్లానని ఈ విషయంలో తన తప్పు లేదని మాధురి తెలిపారు. అయితే అక్కడికి కేక్ తీసుకెళ్లకూడదు అనే విషయం మాకు తెలియదు. ఈ సంఘటన తరువాత ఈ విషయం అందరికీ తెలిసిందని మాధురి తెలిపారు. ఇక్కడ మీ తప్పు లేకపోయినా మీరు క్షమాపణలు చెప్పారు కదా అంటూ వర్ష చెప్పడంతో నేను ఎవరికీ క్షమాపణలు చెప్పలేదు. చెప్పను కూడా.. నా తప్పు ఉంటే నేను క్షమాపణలు చెబుతాను కానీ నేనేం తప్పు చేయనప్పుడు ఎవరికి క్షమాపణలు చెప్పనని మాధురి తెలిపారు.

Advertisement

నేను తప్పు చేశానా లేదా అనే విషయం భగవంతుడికి తెలుసు ఏ విషయమైనా నేను తనతో చెప్పుకుంటాను అంటూ తిరుమల వివాదం గురించి మరోసారి ఈమె క్లారిటీ ఇచ్చారు. అయితే గతంలో కూడా ఈమె ఈ వివాదం పై స్పందిస్తూ.. ఇది కేవలం రాజకీయ కుట్ర మాత్రమేనని, రాజకీయంగా ఈ వ్యవహారాన్ని వివాదంగా సృష్టించాలని భావిస్తున్నారు అంటూ మాధురి గతంలో కూడా ఈ ఘటనపై స్పందించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి తిరుమల వివాదం గురించి మాట్లాడుతూ.. నాకు తెలిసి ఉంటే నేను అక్కడికి కేక్ తీసుకెళ్లను, ఈ సంఘటన ద్వారా చాలామందికి తిరుమల గురించి తెలియని ఒక కొత్త విషయం కూడా తెలిసింది అంటూ మాధురి తెలిపారు.

Also Read: నేను సూసైడ్ చేసుకోలేదు..కారు ప్రమాద ఘటన పై మాధురి క్లారిటీ..ఆరోజు జరిగిందిదే అంటూ!

Related News

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఈమె!

Gundeninda Gudigantalu : సీరియల్లో యూట్యూబర్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ మావా..

Intinti Ramayanam : పల్లవి అవుట్.. ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Big Stories

Advertisement
×