Virat kohli Vs Travis Head: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 ) శనివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రారంభ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ( Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad) తలపడ్డాయి. ఈ మ్యాచ్ వన్ సైడ్ అన్నట్లుగానే సాగింది. అయితే చిన్నస్వామి స్టేడియం ( M.Chinnaswamy Stadium, Bengaluru ) వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు విరాట్ కోహ్లీ ( Virat kohli ). సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్ ను ( Travis Head) ఉద్దేశించి విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్ ( sledging) చేసినట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ పై నెటిజెన్స్ సీరియస్ అవుతున్నారు. విదేశీ, దేశీయ ఆటగాళ్ల పట్ల విరాట్ కోహ్లీకి ఏ మాత్రం మర్యాద లేదని ఫైర్ అవుతున్నారు. వెంటనే విరాట్ కోహ్లీ పై పర్మినెంట్ బ్యాన్ విధించాలని.. ఐపీఎల్ ఆడకుండా చేయాలని కోరుతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 ) భాగంగా తొలి మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( SR VS RCB) మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో హైదరాబాద్ ఓపెన్ ట్రావిస్ హెడ్ 9 బంతుల్లో 11 పరుగులు చేసి జాకబ్ డఫ్ఫీ బౌలింగ్ లో అయ్యాడు. ఈ క్రమంలో ట్రావిస్ హెడ్ ను ఉద్దేశించి విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్ చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అతడు అవుట్ కాగానే వెనకాలే బూతులు తిట్టినట్లు తెలుస్తోంది. అంతే కాదు 2025 ఐపీఎల్ సందర్భంగా కూడా ట్రావిస్ హెడ్ పట్ల అచ్చం ఇలాగే విరాట్ కోహ్లీ ప్రవర్తించాడు. అతన్ని అవమానించే తరహాలో గల్లి క్రికెటర్ లాగా వ్యవహరించాడు విరాట్ కోహ్లీ.
దీంతో ఈ పోస్టర్లు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన క్రికెట్ అభిమానులు సీరియస్ అవుతున్నారు. విరాట్ కోహ్లీకి కొంచెం కూడా మర్యాద అనే విషయమే తెలియదని ఫైర్ అవుతున్నారు. తోటి క్రికెటర్ పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాడని.. ఇలాంటోడిని ఐపీఎల్ ఆడకుండా బ్యాన్ విధించాలని కోరుతున్నారు. విరాట్ కోహ్లీపైన బ్యాన్ విధించకపోతే ఇండియా పరువు అంతర్జాతీయంగా పోతుందని మండిపడుతున్నారు. అయితే, టీమిండియాతో మ్యాచ్ జరిగితే, ఆస్ట్రేలియా ఆటగాడిగా ట్రావిస్ హెడ్ సెంచరీలు చేసి రెచ్చిపోతాడు. అందుకే ట్రావిస్ హెడ్ ను ఉద్దేశించి, కోహ్లీ ఇలా వ్యవహరించాడని అతని ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.
He needs to respect other players, unnecessary shwing so much agression#rcbvssrh #rcbvsrh #klassen royal challengers bengaluru virat kohli anushka sharma ishan kishan fixers abhishek sharma jacob duffey travis headpic.twitter.com/XL2Xy04QxW
— Vikas Agarwal (@VikasAg55263788) March 28, 2026