BigTV English

Maruti Alto K10 Price: మారుతీ ఆల్టోపై మాస్ డీల్.. ఆఫర్లతో తక్కువ ధరకే కొనేయండి!

Maruti Alto K10 Price: మారుతీ ఆల్టోపై మాస్ డీల్.. ఆఫర్లతో తక్కువ ధరకే కొనేయండి!

Maruti Alto K10 Price Dropped: దేశంలోని అతిపెద్ద కార్ కంపెనీ మారుతీ సుజుకీ తన ఎంట్రీ లెవల్ కార్ ఆల్టో కె10 ధరలను తగ్గించింది. ఈ కారు కొనుగోలునపై రూ. 5,500 డిస్కౌంట్ లభిస్తుంది. కంపెనీ రెండు పెట్రోల్ వేరియంట్‌ల ధరలను తగ్గించింది. CNG వేరియంట్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అలానే దీని ప్రారంభ ధర కూడా రూ. 3.99 లక్షలుగానే ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు ఈ కారును కొనుగోలు చేయాలనుకుంటే దాని వేరియంట్ల కొత్త ధరల గురించి మీరు తెలుసుకోవాలి. కంపెనీ ఇటీవలే తన డ్రీమ్ ఎడిషన్‌ను కూడా విడుదల చేసింది. వీరి ధర రూ.4.99 లక్షలులగా ఉంది.


Alto K10 కొత్త ధరల గురించి చెప్పాలంటే కంపెనీ తన STD మాన్యువల్, LXI మాన్యువల్, VXI మాన్యువల్, VXI ప్లస్ మాన్యువల్ ధరలలో ఎటువంటి మార్పు చేయలేదు. STD మాన్యువల్ ధర రూ. 3,99,000, LXI మాన్యువల్ ధర రూ. 4,83,500, VXI మాన్యువల్ ధర రూ. 5,06,000, VXI ప్లస్ మాన్యువల్ ధర రూ. 5,35,500. VXI ఆటోమేటిక్ పాత ధర రూ. 5,56,000 కాగా అది ఇప్పుడు రూ. 5,51,000కి లభిస్తుంది. వీఎక్స్‌ఐ ప్లస్ ఆటోమేటిక్ పాత ధర రూ.5,85,500 కాగా అది రూ.5,80,000కి పెరిగింది.

Maruti Alto K10 Features
మాన్యువల్ వేరియంట్ ఒక లీటర్‌కు 24.39 కిమీ మైలేజీని ఇస్తుంది. అయితే దాని CNG వేరియంట్ మైలేజ్ 33.85 kmpl. ఇది 7 అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్‌ని కలిగి ఉంది. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో పాటు  ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ USB, బ్లూటూత్, ఆక్స్ కేబుల్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.


Also Read: వేరే లెవల్ బ్రో.. తక్కువ ధరకే 400 సీసీ బైకులు!

ఈ హ్యాచ్‌బ్యాక్ ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), రివర్స్ పార్కింగ్ సెన్సార్‌తో పాటు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)ని కలిగి ఉంది. దీనితో పాటు ఆల్టో కె10 ప్రీ-టెన్షనర్, ఫోర్స్ లిమిట్ ఫ్రంట్ సీట్ బెల్ట్‌ ఉంటుంది. రివర్స్ పార్కింగ్ సెన్సార్లు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. ఈ కారులో స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, హై స్పీడ్ అలర్ట్ వంటి అనేక ఇతర భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.

Tags

Related News

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Big Stories

×