BigTV English

Telangana Weather Update: నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. రానున్న మూడు రోజులు వర్షాలు!

Telangana Weather Update: నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. రానున్న మూడు రోజులు వర్షాలు!

Telangana Weather Forecast: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు దాదాపు విస్తరించాయని హైదారాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే కురిసే అవకాశం ఉందని తెలిపింది. అంతే కాకుండా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేసింది.


రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. నిజామాబాద్ దిశగా నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి వెళ్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా నైరుతి దిశ నుంచి వీస్తున్నాయని పేర్కొంది. ఈ రోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నిజామాబాద్ సిద్దిపేట, కరీంనగర్, యాద్రాద్రి, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్‌తో పాటు పలు ప్రాంతాతాల్లో కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది,

రాష్ట్రంలో సోమవారం కూడా ఈదురుగాలుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సిద్దిపేట్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, వరపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.


Also Read: రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. ఆరోగ్య శ్రీలో అదనంగా 65 కొత్త చికిత్సలు

తెలంగాణలో మంగళవారం ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. నల్గొండ, రంగారెడ్డి, హైదారాబాద్, వికారాబాద్,కామారెడ్డి, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

Related News

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Mallareddy: మల్లారెడ్డి యూటర్న్.. రాజకీయాల్లో నో రిటైర్మెంట్

Telangana rains: మళ్ళీ ముంచెత్తనున్న వర్షాలు.. ఆగస్టు 14 నుండి 17 వరకు జాగ్రత్త!

Big Stories

×