Big Stories

Upcoming 400CC Bikes: ఈ బైక్స్ వేరే లెవల్ బ్రో.. తక్కువ ధరకే 400 సీసీ బైకులు.. ఇక రోడ్లపై రచ్చ రచ్చే!

Upcoming 400CC Bikes in India Market: బజాజ్ ఆటో, కెటిఎమ్, ట్రయంఫ్ నుంచి ఈ ఏడాది, 2025లో దేశంలో 400 సీసీ బైకులను విడుదల చేయనున్నాయి. ఈ మోడళ్లలో కొన్ని ఇప్పటికే భారతీయ, విదేశీ రోడ్లపై టెస్ట్ చేయడ్డాయి. ట్రయంఫ్ కొత్త సెమీ-ఫెయిర్డ్ వేరియంట్‌తో మార్కెట్‌లో విస్తరించనుంది. KTM 390 RC ఇప్పటికే విదేశాలలో టెస్ట్ చేశారు. KTM కొత్త 390 అడ్వెంచర్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. రాబోయే ఈ బైక్‌ల గురించి తెలుసుకుందాం.

- Advertisement -

Triumph 400
ట్రయంఫ్ మోటార్స్ భారతదేశం, అంతర్జాతీయంగా స్పీడ్ 400 స్క్రాంబ్లర్ 400Xతో మంచి విజయాన్ని సాధించింది. ఇది త్వరలో కొత్త సెమీ-ఫెయిర్డ్ వేరియంట్‌ రానుంది. దీనిని థ్రక్స్టన్ 400 మోడల్‌గా తీసుకురానుంది. ఈ బైక్‌ను ఇప్పటికే అనేక సార్లు టెస్ట్ చేశారు. 398 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. రాబోయే బైక్ సెమీ ఫెయిర్డ్ డిజైన్ స్పీడ్ ట్రిపుల్ RR నుండి తీసుకొన్నారు.

- Advertisement -

Also Read: ఈ క్రేజ్ ఏంట్రా బాబు.. ఒకేసారి 5 SUV’s లాంచ్.. ఫీచర్లు, డిజైన్ పీక్స్ అంతే!

KTM 390 RC
బైక్‌ను ఇప్పటికే విదేశాలలో టెస్ట్ చేశారు. అయితే దీనికి ముందే KTM తన  కొత్త 390 అడ్వెంచర్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450కి పోటీగా ఈ బైక్ నిలిస్తుంది. ఇది కాకుండా 390 RC కూడా ఇండియన్ మార్కెట్లోకి తీసుకురానుంది.

రెండు బైకులు సరికొత్త 390 డ్యూక్‌‌లో ఉండే అదే 399 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగిస్తాయి. ఈ ఏడాది చివర్లో మిలన్‌లో జరిగే EICMA ఈవెంట్‌లో ఈ అడ్వెంచర్ బైక్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నాము. రాబోయే కొద్ది నెలల్లో ఈ బైక్ భారతదేశంలో విడుదల కావచ్చు.

Also Read: రీకాల్ అలర్ట్.. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్లు అర్జెంట్‌గా షోరూమ్‌‌లో ఉండాల్సిందే!

Bajaj RS 400
బజాజ్ ఆటో ఇటీవలే పల్సర్ NS400 Zని విడుదల చేసింది. ఇది 400 సీసీ పల్సర్ లైనప్‌‌లో వస్తుంది. ఇది RS 200 ఫుల్ ఫెయిర్డ్ 400 సీసీ వెర్షన్ కావచ్చు. ఇది ఫ్లాగ్‌షిప్ పల్సర్ మోడల్‌గా ఉండే అవకాశం ఉంది. దీని ధర దాదాపు రూ. 2 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News