E-Paper
Advertisement

Pan- Aadhaar Link: మరో రెండు రోజులే సమయం.. పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేశారా..? లేదా..?

Pan- Aadhaar Link: మరో రెండు రోజులే సమయం.. పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేశారా..? లేదా..?
Advertisement

Pan- Aadhaar Link Deadline: పాన్ కార్డు హొలర్డర్లకు భారత ప్రభుత్వం మరోసారి కీలక సూచన చేసింది. భారత పౌరులకు అతిముఖ్యమైన ఆధార్ , పాన్ కార్డు లింక్ చేయడానికి త్వరలో గడువు ముగియనుంది. ఇప్పటికే ఉచితంగా లింక్ చేసుకునే ప్రక్రియకు సంబంధించిన గడువు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే మే 31వ తేదీ వరకు మరో అవకాశం ఉంది. రూ. 1,000 చెల్లించి పాన్ కార్డు, ఆధార్ లింక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే ఈ గడువు ముగిసిన తర్వాత పాన్ కార్డును, ఆధార్‌తో లింక్ చేయకపోతే పాన్ కార్డు పని చేయకపోవచ్చని తెలుస్తోంది.

మే31 వ తేదీలోపు పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే ఆ వ్యక్తి పాన్ కార్డు ఇన్ యాక్టివేట్ అవుతుంది. ఈ మేరకు 2024 మార్చి 31 వరకు జరిగిన లావాదేవీలపై పన్ను చట్టం 1961లోని సెక్షన్ 206ఏఏ, 206సీసీ కింద ట్యాక్స్ కలెక్షన్ జరగదు అని పేర్కొంటూ ఇన్ కంట్యాక్స్ ఆఫ్ ఇండియా ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేసింది.

Advertisement

Also Read: Unclaimed Funds in Stock Market: స్టాక్‌ మార్కెట్లు క్రాష్‌.. రూ.1.91 లక్షల కోట్లు వెయిటింగ్..

కాగా, పాన్ కార్డును, ఆధార్ కార్డుతో లింక్ చేయడం అనేది తప్పనిసరి. ఒకవేళ పాన్ కార్డు, ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే జీతం, పెట్టుడబుల ద్వారా వచ్చే వడ్డీ ఆధాయాలపై ఎక్కువ టీడీఎస్ కట్ అవుతుంది. అందువల్ల మరో రెండు రోజులే సమయం ఉండడంతో త్వరగా లింక్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు https://www.incometax.gov.in/iec/foportal/ వెబ్ సైట్ ద్వారా లింక్ చేసుకోవాలని సూచించింది. లేదంటే ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ దగ్గర కూడా లింక్ చేసుకోవచ్చు.

Tags

Related News

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×