BigTV English

Paytm Shares Rise Up :పేటీఎంను కొంటున్న అదానీ..? 5 శాతం పెరిగిన షేర్లు!

Paytm Shares Rise Up :పేటీఎంను కొంటున్న అదానీ..? 5 శాతం పెరిగిన షేర్లు!

Paytm Share Price Hiked Today: ప్రముఖ ఆన్లైన్ పేమెంట్స్ యాప్ పేటీఎం ను అదాని గ్రూప్ కొంటుందన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలతో పేటీఎం షేర్లు ఒక్కసారిగా 5 శాతం పెరిగాయి. మే 29న పేటీఎం షేర్లు పెరగడంతో పెట్టుబడిదారులు ఆనందం వ్యక్తం చేశారు. పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ మాత్రం.. పేటీఎం ఇంకా ఏ కంపెనీతోనూ ఒప్పందం చేసుకోలేదని, అదానీ గ్రూప్ పేటీఎం ను కొంటుందన్న వార్తలు కేవలం ఊహాగానాలకే పరిమితమని తెలిపారు. కంపెనీ అమ్మకంపై ఎలాంటి చర్చలు జరపలేదని స్పష్టం చేశారు.


పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ మాత్రం.. పేటీఎం ఇంకా ఏ కంపెనీతోనూ ఒప్పందం చేసుకోలేదని, అదానీ గ్రూప్ పేటీఎం ను కొంటుందన్న వార్తలు కేవలం ఊహాగానాలకే పరిమితమని తెలిపారు. కంపెనీ అమ్మకంపై ఎలాంటి చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. SEBI 2015 నియమ, నిబంధనల ప్రకారం.. పేటీఎం ను కొనసాగిస్తామని పేటీఎం స్టాక్ ఎక్స్ఛేంజ్ తెలిపింది.

Also Read: LIC: మరో ఘనత సాధించిన LIC.. పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక జీడీపీని కలిపినా ఎల్ఐసీతో సరిపోలడంలే!


మరోవైపు అదానీ గ్రూప్ కూడా.. ఈ కథనాలను ఖండించాయి. ఇవి కేవలం ఊహాజనిత వార్తలని పేర్కొంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ అహ్మదాబాద్ లో ఉన్న ఆఫీస్ లో అదానీ విజయ్ శేఖర్ శర్మతో సమావేశమయ్యారు. ఇందులో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు పశ్చిమాసియా ప్రతినిధులను కూడా సంప్రదించారని రాసుకొచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ను అనేక లావాదేవీల నుంచి నిషేధించిన తర్వాత.. ఈ వార్త రావడంతో పేటీఎం షేర్లు పెరిగాయి. 5 శాతం షేర్లు పెరగడంతో.. ప్రస్తుతం రూ.359.45 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్చి త్రైమాసికంలో పేటీఎం రూ.549.60 కోట్ల నష్టాలను చూసింది. గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో ఇది రూ.219.80 కోట్లుగా ఉంది.

Tags

Related News

GST 2.0: కొత్త జీఎస్టీతో పన్ను తగ్గలేదా? నెంబర్ ఇదిగో, సామాన్యుడు ఫిర్యాదు చేయొచ్చు

Dasara Offers: ఫ్లిప్‌ కార్ట్ కళ్లు చెదిరే దసరా ఆఫర్లు, ఎథ్నిక్ వేర్ పై ఏకంగా 85 శాతం తగ్గింపు!

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు!

Postal PPF Scheme: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

JioMart Offers: రూ.99 నుంచే షాపింగ్.. జియోమార్ట్ ఫ్లాష్ డీల్ హాట్ సేల్ షురూ..

Big Stories

×