E-Paper
Advertisement

HRA Claim New Rules: హెచ్ఆర్ఏ క్లెయిమ్ లో ఈ తప్పు చేస్తే 200% జరిమానా.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్

HRA Claim New Rules:  హెచ్ఆర్ఏ క్లెయిమ్ లో ఈ తప్పు చేస్తే 200% జరిమానా.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్
Advertisement

HRA Claim New Rules: ఏప్రిల్1, 2026 హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసే విధానం మారుతోంది. సాధారణ కాగితంపై అద్దె కడుతున్నట్లు చూపిస్తే ఇకపై మీరు ఇబ్బందుల్లో పడినట్లే. మీ ఫాదర్ ను ల్యాండ్ లార్డ్ గా చూపిస్తే.. ఆయన ఐటీఆర్ లో అద్దెకు సంబంధించిన వివరాలు చూపించాలి. ఆదాయపు పన్ను శాఖ HRA క్లెయిమ్ లో మోసాలను గుర్తించింది. నిబంధనల ప్రకారం అద్దె రసీదులను ఎలా సమర్పించాలి. హెచ్‌ఆర్‌ఏ జీతంలోని ఒక పార్ట్. దీంతో ఉద్యోగి ట్యాక్స్ పడే ఆదాయంలో మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. మెట్రో నగరాల్లో ఉంటే బేసిక్ శాలరీలో 50%కి, నాన్ మెట్రో నగరాల్లో 40% వరకు హెచ్ఆర్ఏ క్లెయిమ్ ఉంటుంది. ఈ మినహాయింపు కోసం రెంట్ పేమెంట్ రసీదులు యాడ్ చేయాల్సి ఉంటుంది.

 హెచ్ఆర్ఏ మినహాయింపు

ఇప్పటి వరకూ హెచ్ఆర్ఏ లో తల్లిదండ్రులను ల్యాండ్ లార్డ్ గా చూపిస్తాం. కానీ వారికి అద్దె చెల్లించం. కానీ తల్లిదండ్రులకు అద్దె కడుతున్నట్లు ఐటీఆర్ ఫైల్ చేసి పన్ను మినహాయింపు పొందుతున్నారు. ఈ మోసాలను గుర్తించిన ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్.. రూల్స్ టైట్ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఐటీఆర్ హెచ్ఆర్ఏ ఫైల్ చేస్తే ల్యాండ్ లార్డ్ ఎవరో చెప్పాలి. అలాగే వారితో మీకున్న సంబంధం వివరించాలి. ల్యాండ్ లార్డ్ ను ఫాదర్ అని రాస్తే.. మీ ఫాదర్ తన ఐటీఆర్ రెంట్ ఇన్ కమ్ చూపించకపోతే.. ఆయనకు ఐటీ నోటీసులు వచ్చే అవకాశం ఉంది. అలాగే 200 శాతం జరిమానా విధించవచ్చు. అద్దె రూ.50 వేల కంటే ఎక్కువ ఉంటే.. TDS 2 శాతం డిడక్ట్ చేయాలి. టీడీఎస్ డిడక్ట్ చేయకపోతే నెలకు 1 శాతం వడ్డీ కట్టాలి. డిడక్ట్ చేసి ఆ డబ్బును ప్రభుత్వానికి కట్టకపోతే .. నెలకు 1.5 శాతం వడ్డీ కట్టాల్సి ఉంటుంది. టీడీఎస్ లేకుంటా ఐటీఆర్ ఫైల్ చేస్తే రోజుకు రూ.200 లేట్ ఫీజు కట్టాలి. అలాగే రూ.10000 నుంచి రూ.1 లక్ష వరకు జరిమానా పడే అవకాశం ఉంది.

Advertisement

Also Read: ఆస్తి పన్ను దారులకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. వడ్డీలో 50% భారీ రాయితీ!

రెంటల్ అగ్రిమెంట్

అద్దెను నిజాయితీగా చెల్లించాలి. యూపీఐ, బ్యాంక్ ట్రాన్స్ ఫర్ ద్వారా అద్దె చెల్లించాలి. డబ్బుల రూపంలో చెల్లించవద్దు. అలాగే మీ తల్లిదండ్రులకు ఐటీఆర్ లో రెంట్ ఇన్ కమ్ చూపించాలి. అలాగే రెంట్ అగ్రిమెంట్ ను కచ్చితంగా చేసుకోవాలి. ప్రతిదీ క్లియర్ గా ఉండాలి. అప్పుడే హెచ్ఆర్ఏ మినహాయింపు సేప్ గా ఉంటుంది. మీరు కూడా పేరెంట్స్ మీద హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేస్తే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి.

Related News

ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తారు? బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయ్!

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

పర్సనల్ లోన్ EMI కట్టలేకపోయారా? క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా ఎలా సరిచేయాలి?

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×