E-Paper
Advertisement

Galaxy A57 A37 Discount: గెలాక్సి కొత్త ఫోన్స్‌పై లాంచ్ ఆఫర్.. విడుదల కాగానే డిస్కౌంట్ డీల్స్

Galaxy A57 A37 Discount: గెలాక్సి కొత్త ఫోన్స్‌పై లాంచ్ ఆఫర్.. విడుదల కాగానే డిస్కౌంట్ డీల్స్

Galaxy A57 A37 Discount| శాంసంగ్ కంపెనీ భారతదేశంలో గెలాక్సీ A57 5G, గెలాక్సీ A37 5G స్మార్ట్‌ఫోన్‌లు అధికారికంగా విడుదల చేసింది. ఈ రెండు ఫోన్‌లు ఆధునిక ఫీచర్లు, ఆకర్షణీయ ఆఫర్లతో మిడ్ రేంజ్‌లో మార్కెట్‌లో ఎంట్రీ ఇస్తున్నాయి. సేల్ ప్రారంభం కాగానే ముందుగా కొనుగోలుదారులు డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్, అప్‌గ్రేడ్ బోనస్‌లు పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ A57, A37 ధరలు?

శాంసంగ్ గెలాక్సీ A57 5G రెండు వేరియంట్లలో వస్తుంది. 8GB ర్యామ్+ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.56,999. 12GB ర్యామ్ వేరియంట్ ధర రూ.62,499.
గెలాక్సీ A37 5G మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ.41,999 నుంచి మొదలవుతుంది. 8GB ర్యామ్ + 256GB వేరియంట్ రూ.47,499కి లభిస్తుంది. టాప్ మోడల్ 12GB ర్యామ్ + 256GB ధర రూ.52,499.
ఈ ఫోన్‌లు రిటైల్ షాపులు మరియు ఆన్‌లైన్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి. ప్రీ-ఆర్డర్ కూడా ప్రారంభమైంది.

లాంచ్ ఆఫర్లు, ప్రయోజనాలు

శాంసంగ్ ఈ కొత్త ఫోన్స్ లాంచ్ సందర్బంగా ఆరంభ కొనుగోలుదారులు మంచి డీల్స్ ఇస్తోంది. బ్యాంక్ కార్డులు లేదా యుపిఐ ద్వారా చెల్లింపు చేస్తే రూ.3,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
24 నెలల వరకు జీరో ఇంట్రెస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంది. దీనికి డౌన్ పేమెంట్ అవసరం లేదు. క్యాష్‌బ్యాక్ బదులు రూ.3,000 అప్‌గ్రేడ్ బోనస్ కూడా తీసుకోవచ్చు. ఈ ఆఫర్లతో కొత్త గెలాక్సీ ఫోన్లు అందుబాటు ధరలోకి వచ్చాయి. ఏప్రిల్ 2 నుంచి డెలివరీలు ప్రారంభం.

డిజైన్, కలర్ ఆప్షన్లు

ఈ ఫోన్‌లు స్టైలిష్ రంగులలో వస్తున్నాయి. గెలాక్సీ A57 5G Awesome Navy, Awesome Icy Blue, Awesome Lilac కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
గెలాక్సీ A37 5G Awesome Lavender, Awesome Charcoal, Awesome GreyGreen కలర్ వేరియంట్స్‌లో ఉంటుంది. ఈ రంగులు ఫోన్‌లకు ప్రీమియం, ఆధునిక లుక్ ఇస్తాయి.

డిస్‌ప్లే, పర్‌ఫామెన్స్

రెండు ఫోన్‌లలోనూ 6.7 అంగుళాల Full HD+ Super AMOLED+ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఫొటోలు, వీడియోలు స్మూత్‌గా కనిపిస్తాయి.
గెలాక్సీ A57 5Gలో Exynos 1680 చిప్‌సెట్ ఉంది. గెలాక్సీ A37 5Gలో Exynos 1480 ప్రాసెసర్ ఉంది. రెండింటిలోనూ 12GB వరకు LPDDR5X ర్యామ్, 256GB వరకు UFS 3.1 స్టోరేజ్ ఉన్నాయి. గేమింగ్ మరియు మల్టీటాస్కింగ్‌కు ఇవి చాలా వేగంగా పని చేస్తాయి.

సాఫ్ట్‌వేర్, AI ఫీచర్లు

రెండు ఫోన్‌లు Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో One UI 8.5తో వస్తాయి. శాంసంగ్ ఆరు సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు మరియు సెక్యూరిటీ సపోర్ట్ ఇస్తుంది.
ఇందులో శాంసంగ్ బిక్స్‌బీ, జెమినీ, పర్‌ప్లెక్సిటీ, వంటి AI టూల్స్ ఉన్నాయి. ఇవి ఫోన్ వాడకాన్ని సులభం చేసి పనులు త్వరగా పూర్తి చేయడానికి సహాయపడతాయి.

కెమెరా సెటప్

రెండు ఫోన్‌లలోనూ 50MP మెయిన్ రియర్ కెమెరా ఉంది. వివిధ లైటింగ్ పరిస్థితుల్లో క్లియర్ ఫోటోలు తీయవచ్చు.
A57 5Gలో 12MP అల్ట్రా-వైడ్ 5MP మాక్రో కెమెరాలు ఉన్నాయి. A37 5Gలో 8MP అల్ట్రా-వైడ్ మరియు 5MP మాక్రో ఉన్నాయి. సెల్ఫీల కోసం రెండింటిలోనూ 12MP ఫ్రంట్ కెమెరా ఉంది.

Also Read: మీ జేబులో సరిపోయే పవర్ బ్యాంక్స్.. చిన్న సైజులో బెస్ట్ ఇవే

బ్యాటరీ, డ్యూరబిలిటీ

రెండు మోడల్స్‌లోనూ 5,000mAh బ్యాటరీ ఉంది. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ 2.0 సపోర్ట్ ఉంది. సుమారు 30 నిమిషాల్లో 60 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.
IP68 రేటింగ్‌తో నీరు, దుమ్ము నుంచి ప్రొటెక్షన్  ఉంది. Samsung Knox Vaultతో సెక్యూరిటీ కూడా బలంగా ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ A57, A37 5G ఫోన్‌లు మంచి ఫీచర్లు మరియు లాంచ్ ఆఫర్లతో మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో ఆకర్షణీయంగా ఉన్నాయి. పనితీరు, డ్యూరబిలిటీ కావాలనుకునే వినియోగదారులకు ఇవి మంచి ఆప్షన్స్.

ముఖ్య గమనిక: ఈ కథనంలో మీకు తెలిపిన శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ దాని ధరలు.. శాంసంగ్ కంపెనీ ఇచ్చే ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. ఫోన్ కొనుగోలు చేసేముందు బాగా చెక్ చేసి కొనాలని వినియోగదారులకు సూచన. మీరు కొనుగోలు చేసే సమయానికి పైన పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదు.

Related News

టీచర్లు, ఆన్‌లైన్ ట్యూటర్ల పని సులువు చేసే టాప్-5 AI టూల్స్ ఇవే!

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాకర్లు ఎలా దొంగిలిస్తున్నారో తెలుసా?

ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్.. రూపాయి ఖర్చు లేకుండా ‘నెట్‌ఫ్లిక్స్’ ఉచితం!

50MP కెమెరా, 6,500mAh బ్యాటరీతో Motorola Edge 70 Pro+ లాంచ్.. ధర వింటే షాకే!

డిజైన్ అదిరింది.. 5x పెరిస్కోప్ కెమెరాతో Xiaomi 17T లాంచ్, సేల్స్ ఎప్పటి నుంచంటే?

Physical SIM vs eSIM: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏ సిమ్ బెస్ట్? ఏది వాడితే ఎక్కువ లాభం?

గంటల తరబడి హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటున్నారా? ఈ 60/60 రూల్ తెలియకపోతే డేంజర్లో పడ్డట్టే!

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×