BigTV English

Oben Electric Freedom Offer: ఎలక్ట్రిక్‌ బైక్‌పై రూ.25,000 డిస్కౌంట్‌.. సమయం లేదు మిత్రమా..!

Oben Electric Freedom Offer: ఎలక్ట్రిక్‌ బైక్‌పై రూ.25,000 డిస్కౌంట్‌.. సమయం లేదు మిత్రమా..!

Oben Electric Freedom Offer: ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఆటో మొబైల్ సంస్థలు తమ వాహనాలపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా ఓ కంపెనీ తన ఎలక్ట్రిక్ బైక్‌పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీ సంస్థ ఒబెన్ ఎలక్ట్రిక్ తాజాగా తన ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగానే ఫ్రీడమ్ ఆఫర్ తీసుకొచ్చింది. ఇందులో ఒబెన్ రోర్ బైక్‌పై రూ.25000 భారీ తగ్గింపు అందిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1,49,999గా ఉంది. అయితే ఈ తాజా తగ్గింపుతో కేవలం రూ.1,24,999లకే కొనుక్కోవచ్చు.


అయితే కస్టమర్లు ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే.. ఈ ఆఫర్ కేవలం ఆగస్టు 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. షోరూమ్‌ల్లో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఈ ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ పూర్తి స్పెసిఫికేషన్ విషయానికొస్తే..

Also Read: మతిపోగొడుతున్న కొత్త టెక్నాలజీ.. త్వరలో హైడ్రోజన్‌తో నడిచే బైక్!


ఓబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ 2022 మార్చిలో లాంచ్ అయింది. ఈ బైక్‌లో 8కిలోవాట్ల ఐబీఎంఎస్ఎమ్ మోటార్‌ను అందించారు. ఈ బైక్ గంటకు 100 కి.మీ వేగంతో పరుగులు పెడుతుంది. ఇది 0 నుంచి 40 కి.మీ వేగాన్ని అందుకోవడానికి కేవలం 3 సెకన్లు పడుతుంది. ఈ బైక్‌లో 4.4 కిలో వాట్ల బ్యాటరీ ప్యాక్ అమర్చారు. దీంతో ఈ బైక్‌కు ఒక్కసారి ఫుల్‌గా ఛార్జింగ్ పెడితే ఏకంగా 187 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఈ బ్యాటరీ పూర్తిగా ఛార్జింగ్ కావడానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది.

ఇది అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో సర్క్యులర్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ అందించారు. అలాగే ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు, ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, టెయిల్ ల్యాంప్స్ వంటివి కలిగి ఉన్నాయి. అంతేకాకుండా ఈ బైక్ సరికొత్త డిజైన్‌ను కలిగి ఉంది. దేశీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ రంగంలో ప్రముఖ వాహనాలు సేల్స్‌లో దూసుకుపోతున్న తరుణంలో ఓబెన్ కంపెనీ తన ఎలక్ట్రిక్ బైక్‌పై ఆఫర్ ప్రకటించి మరిన్ని సేల్స్ అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Related News

AI Jobloss UBI: ఊడుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు.. ఆర్థిక పరిష్కారం సూచిస్తున్న టెక్ కంపెనీ యజమానులు

DMart Exit Check: డిమార్ట్ ఎగ్జిట్ చెక్.. బిల్ మీద స్టాంప్ ఎందుకు వేస్తారో తెలుసా?

DMart: డిస్కౌంట్స్ అని డిమార్ట్ కు వెళ్తున్నారా? ఆదమరిస్తే మోసపోవడం పక్కా!

Dmart Offers: డిమార్ట్ సిబ్బంది చెప్పిన సీక్రెట్ టిప్స్.. ఇలా చేస్తే మరింత చౌకగా వస్తువులు కొనేయొచ్చు!

GST Slabs: జీఎస్టీలో సంస్కరణలు.. ఇకపై రెండే స్లాబులు, వాటికి గుడ్ బై

లోన్ క్లియర్ అయ్యిందా..అయితే వెంటనే ఈ డాక్యుమెంట్స్ తీసుకోకపోతే భారీ నష్టం తప్పదు..

Big Stories

×