BigTV English

KTR: జాబ్ క్యాలెండర్.. వట్టి బోగస్: కేటీఆర్ కామెంట్స్

KTR: జాబ్ క్యాలెండర్.. వట్టి బోగస్: కేటీఆర్ కామెంట్స్

Job Calender: రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు, ఇతర ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను ఏ నెలలో విడుదల చేస్తామనేది చెప్పింది. అలాగే, పరీక్షల నిర్వహణ ఎప్పుడు? ఏ ఏజెన్సీ నిర్వహిస్తుంది? వంటి వివరాలను ఈ జాబ్ క్యాలెండర్‌లో పేర్కొంది. కాంగ్రెస్ ముందుగా ప్రకటించినట్టుగానే జాబ్ క్యాలెండర్‌ను ఈ రోజు అసెంబ్లీలో విడుదల చేయడంపై హస్తం శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం నిరసన మార్గాన్ని ఎంచుకుంది. గత మూడు నాలుగు రోజులుగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు చేస్తూనే ఉన్నది. తాజాగా జాబ్ క్యాలెండర్ పైనా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు.


జాబ్ క్యాలెండర్.. వట్టి బోగస్ అని, ఏదో నాలుగు కాగితాల్లో వారికి ఇష్టమైన వివరాలు రాసుకొచ్చి అసెంబ్లీలో చదివి ఇదే జాబ్ క్యాలెండర్ అని అంటున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇది బోగస్ అని వారికీ తెలుసు అని, ఇది యువతను మోసం చేయడమేనని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్య ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తూ అసెంబ్లీ ముందున్న గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు.

Also Read: మాజీ మంత్రి హరీశ్ రావుకు మైనంపల్లి మాస్ వార్నింగ్


జాబ్ క్యాలెండర్ పై అసెంబ్లీలో చర్చించాలని తాము అనుకున్నామని, దీనిపై మాట్లాడటానికి తాము సమయం అడిగామని కేటీఆర్ అన్నారు. కానీ, ప్రభుత్వం తమకు రెండు నిమిషాల సమయం కూడా ఇవ్వలేదని ఆగ్రహించారు. తాము తెలంగాణ యువత కోసం పోరాడుతున్న తమను అనర్హత వేటు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు మైక్ ఇచ్చి తిట్టించారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ టికెట్ పై ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించగా.. ఈ పిటిషన్ పై విచారణ జరుగుతున్నది.

ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా ఆగ్రహించారు. దానం నాగేందర్ రౌడీ షీటర్‌లా మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. తెలంగాణ శాసన సభ.. దుశ్శాసన సభగా మారిందని విమర్శించారు. మహిళా చట్టసభ్యులను అవమానిస్తున్నారని పేర్కొన్నారు.

Related News

Weather News: రాష్ట్రంలో కుండపోత వానలు.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం.. పిడుగులు పడే ఛాన్స్

Ramanthapur Incident: పెరుగుతున్న మృతుల సంఖ్య.. రామంతపూర్‌లో హై టెన్షన్..

CM Revanth Reddy: కులగణనను వక్రీకరిస్తే బీసీలకు న్యాయం జరగదు-సీఎం

RangaReddy District: రాష్ట్రమంతా వర్షాలు దంచికొడుతున్నా.. ఈ రెండు చెరువుల్లో చుక్క నీళ్లు లేని పరిస్థితి..

Heavy Rains: హైదరాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షం.. జనం అతలాకుతలం.. బయటకు వెళ్లోద్దు

Hyderabad News: హైదరాబాద్ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విషాదం.. ఐదుగురు మృతి

Big Stories

×