E-Paper
Advertisement

Huge Discount on Ola Bikes: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై కిక్కిచ్చే డిస్కౌంట్స్.. మళ్లీ ఇలాంటి ఛాన్స్ రాదు మావ!

Huge Discount on Ola Bikes: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై కిక్కిచ్చే డిస్కౌంట్స్.. మళ్లీ ఇలాంటి ఛాన్స్ రాదు మావ!
Advertisement

Ola Offers Huge Discounts on Electric Scooters: ప్రస్తుత ఆటో మొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఫుల్ డిమాండ్ ఉంది. అందువల్లనే ప్రముఖ టూ వీలర్ అండ్ ఫోర్ వీలర్ వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై ఫోకస్ పెడుతున్నాయి. ఇందులో భాగంగానే వరుస పెట్టి ఎలక్ట్రిక్ స్కూటర్‌లు, ఎలక్ట్రాక్ కార్లు మార్కెట్‌లో రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. అందులో ప్రముఖ టూ వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఓలా ఒకటి. ఈ కంపెనీ మొదటి నుంచి ఆటో మొబైల్ మార్కెట్‌లో తన హవా చూపిస్తూ వస్తోంది.

పలు ఈవీ లను రిలీజ్ చేస్తూ వాహన ప్రియులను ఆకట్టుకుంటుంది. మైలేజీ అండ్ సేఫ్టీ పరంగా ప్రత్యేక దృష్టి సారించి అద్భుతమైన ఫీచర్లతో స్కూటర్లను లాంచ్ చేసి సేల్స్‌లో నెంబర్ వన్‌గా నిలుస్తుంది. అంతేకాకుండా తమ కంపెనీ స్కూటర్లపై అప్పుడప్పుడు డిస్కౌంట్లు ప్రకటించి మరింత సేల్స్ పెంచేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఈ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఈ నెలలో (జూలై) తన ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

Advertisement

పలు స్కూటర్ల మోడల్‌ను దాదాపు రూ.20,000 వరకు డిస్కౌంట్లు అందిస్తున్నట్లు తెలిపింది. ఈ డిస్కౌంట్ ఆఫర్.. ఎస్1 ఎయిర్, ఎస్ 1 ప్రో, ఎస్ 1 ఎక్స్, ఎస్ 1 ఎక్స్ ప్లస్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు లభిస్తాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ స్కూటర్లపై ఆఫర్లు కేవలం జూలై 17వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. జూలై 17 తర్వాత ఈ ఆఫర్ లభించదు. ఓలో ఎస్ 1 ఎయిర్, ఎస్ 1 ప్రో స్కూటర్లపై దాదాపు రూ.15000 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

Also Read: అదిరింది మావా.. తక్కువ ధర.. ఎక్కువ మైలేజీ.. ఇలాంటి బైక్‌ల కోసమే ఎదురుచూస్తున్నారా?

Advertisement

ఈ రెండు స్కూటర్లు ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ సబ్సిడీ ప్రయోజనాలతో లభిస్తాయని కంపెనీ తెలిపింది. ఇక వీటి ధరల విషయానికొస్తే.. ఎస్ 1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.1.01 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో ప్రారంభమవుతుంది. అలాగే ఎస్1 ప్రో రూ.1.29 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్లతో పాటు ఓలా ఎస్ 1 ఎక్స్ పై రూ.12,500 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. దీనిని కూడా జూలై 17 లోపు కొనుగోలు చేసుకోవాలి.

ఈ ఎస్1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.75,000 నుండి ప్రారంభమవుతుంది. ఈ మోడల్‌లోని హై వేరియంట్‌కు ఒక్కసారి ఛార్జింగ్ పెడితే దాదాపు 190 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఇందులో దీంతోపాటు ఓలా ఎస్‌1 ఎక్స్ ప్లస్‌పై కూడా మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై దాదాపు రూ.20,000 వరకు తగ్గింపు బెనిఫిట్స్ అందిస్తుంది. ఇది 3కిలో వాట్ల బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. దీనికి ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 151 కిమీ మైలేజీ అందిస్తుంది. ఇది రూ.85,000 ధరతో లభిస్తుంది.

Tags

Related News

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

Big Stories

Advertisement
×