BigTV English

Husband Killed Wife: పండంటి కాపురం మధ్య చిచ్చుపెట్టిన సోషల్ మీడియా..!

Husband Killed Wife: పండంటి కాపురం మధ్య చిచ్చుపెట్టిన సోషల్ మీడియా..!

Husband kills Wife in Uppal Hides Body in Trash Bag: భార్యాభర్తల పండంటి కాపురం మధ్య సోషల్ మీడియా చిచ్చు పెట్టింది. రీల్స్ చేస్తూ.. ఫోన్ లోనే గంటలు తరబడి ఉంటుందనే అనుమానంతో భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త. ఆ తర్వాత మృత దేహాన్ని సైతం మాయం చేసేందుకు యత్నించి విఫలమవ్వడంతో పరారైనట్టు తెలుస్తోంది.


భార్యతో పాటు కన్న బిడ్డను సైతం నదిరోడ్డుపై వదిలేసి నిర్దాక్షిణ్యంగా తన దారి తాను చూసుకున్నాడు ఓ దుర్మార్గుడు. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడడంతో నిందితుడు కటకటాల పాలయ్యాడు. ఈ ఊహించని ఘటన హైదరాబాద్ లోని ఉప్పల్ పరిధిలో గల న్యూ భారత్ నగర్ ఏరియాలో చోటు చేసుకుంది.

ఒరిస్సాకు చెందిన ప్రదీప్ బోలా, మధు స్మిత దంపతులు న్యూ భరత్ నగర్ ఏరియాలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే ఇంట్లోని నుంచి దుర్వాసన రావడంతో ఇంటి ఓనర్ కి అనుమానం వచ్చి.. తలుపులు తెరచి చూడగా.. అనుమానస్పదంగా ఓ మూట కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాత్రూంలో బస్తా సంచిలో మధు స్మిత మృతదేహాన్ని గుర్తించారు.


Also Read: కమ్మరి కృష్ణను చంపింది కొడుకే.. వివరాలు వెల్లడించిన పోలీసులు

ఇక అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 12 గంటల్లోనే చేధించారు. మధుస్మితను.. అర్ధరాత్రి వేళ చపాతి పీటతో తలపై కొట్టడంతో స్పృహ కోల్పోగా.. ఆ తర్వాత చున్నితో ఆమె మెడకు బిగించి ప్రదీప్ హత్య చేసినట్టు వెల్లడించారు. ఆ తర్వాత ఇంటి నుంచి పరారై బేగంపేటలో తన స్నేహితుడి దగ్గర ఉన్నట్టు తెలిపారు. ప్రదీప్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్టు చెప్పారు. మొత్తానికి సోషల్ మీడియా భూతానికి మరో జంట బలి

Tags

Related News

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Big Stories

×