BigTV English

Low Price High Mileage Bikes: అదిరింది మావా.. తక్కువ ధర.. ఎక్కువ మైలేజీ.. ఇలాంటి బైక్‌ల కోసమే ఎదురుచూస్తున్నారా?

Low Price High Mileage Bikes: అదిరింది మావా.. తక్కువ ధర.. ఎక్కువ మైలేజీ.. ఇలాంటి బైక్‌ల కోసమే ఎదురుచూస్తున్నారా?

Best Economy Bikes: ప్రస్తుతం ఆటో మొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వాహనాల పై ఆసక్తి తగ్గింది. అంతేకాకుండా ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్ ధరల కారణంగా, ప్రజలు ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల లీటర్ పెట్రోల్‌తో ఎక్కువ దూరం ప్రయాణించగల బైక్‌ల కోసం సెర్చ్ చేస్తున్నారు. మరి మీరు కూడా తక్కువ ధరలో.. లీటర్ పెట్రోల్‌తో అధిక మైలేజీని ఇచ్చే బైక్‌ను కొనుక్కోవాలని చూస్తున్నట్లయితే ఇక్కడ కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.


Bajaj Platina 110

బజాజ్ ప్లాటినా 110 అత్యంత సరసమైన బైక్. ఇది లీటరుకు 80.9 కిమీ మైలేజీని ఇస్తుంది. ఈ బైక్ రూ. 56,715 (ఢిల్లీ, ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇది నగరంలో రోజువారీ ఉపయోగం కోసం సరైనది. ఈ బైక్ 110cc ఇంజన్‌ని కలిగి ఉంది. అదేసమయంలో 7.9 PS పవర్, 8.4 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.


Honda CB Shine SP 125

హోండా CB షైన్ SP 125 బైక్ లీటరుకు 74.2 కి.మీ మైలేజీని ఇస్తుంది. ఈ బైక్ రూ. 73,916 (ఢిల్లీ, ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. CB షైన్ SP 125 అనేది మంచి ఇంధన సామర్థ్యానికి, సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రసిద్ధి చెందిన కమ్యూటర్ బైక్. ఇందులో 125సీసీ ఇంజన్ ఉంటుంది. ఇది 9.9 PS పవర్, 11 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Also Read: టీవీఎస్ నుంచి కొత్త CNG వెహికల్ వచ్చేస్తుంది.. ఎప్పుడంటే?

Hero Splendor Plus

హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ లీటరుకు 67.3 కి.మీ మైలేజీని ఇస్తుంది. ఇది రూ. 64,490 (ఢిల్లీ, ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభిస్తుంది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌లలో స్ప్లెండర్ ప్లస్ ఒకటి. ఈ బైక్ 97.2cc ఇంజన్‌ని కలిగి ఉంది. ఇది 7.8 PS శక్తిని, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

TVS Radeon 125

TVS రేడియన్ 125 బైక్ లీటరుకు 63.8 కిమీ మైలేజీని ఇస్తుంది. ఈ బైక్ రూ. 59,925 (ఢిల్లీ, ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. Radeon 125 బైక్ స్టైలిష్ అండ్ బడ్జెట్ కమ్యూటర్ బైక్. ఇందులో 125సీసీ ఇంజన్ ఉంటుంది. ఇది 8.7 PS పవర్, 10.5 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

Bajaj CT 100

బజాజ్ CT 100 బైక్ లీటరుకు 70.8 కిమీ మైలేజీని ఇస్తుంది. ఇది రూ. 53,400 (ఢిల్లీ, ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. భారతదేశంలో చౌకైన బైక్‌లలో CT 100 ఒకటి. ఇందులో 100సీసీ ఇంజన్ ఉంటుంది. అదే సమయంలో ఇది 7.7 PS పవర్, 8.4 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Related News

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు!

Postal PPF Scheme: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

JioMart Offers: రూ.99 నుంచే షాపింగ్.. జియోమార్ట్ ఫ్లాష్ డీల్ హాట్ సేల్ షురూ..

DMart Offers: దసరా పండుగ వచ్చేస్తోంది, డిమార్ట్ లో షాపింగ్ కు ఇది పర్ఫెక్ట్ టైమ్!

Jio Dasara Offers: జియో దసరా ఫెస్టివల్ ఆఫర్స్.. మీరు ఊహించని సర్ప్రైజ్‌లు వచ్చేశాయి!

Big Stories

×