E-Paper
Advertisement

Ola Electric: తారాజువ్వలా ఓలా ఎలక్ట్రిక్ షేర్లు.. సోమవారం మార్కెట్‌లో పరిస్థితి, మార్కెట్ వర్గాలు ఏమంటున్నాయి?

Ola Electric: తారాజువ్వలా ఓలా ఎలక్ట్రిక్ షేర్లు.. సోమవారం మార్కెట్‌లో పరిస్థితి, మార్కెట్ వర్గాలు ఏమంటున్నాయి?
Advertisement

Ola Electric: దేశవ్యాప్తంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ షేర్లపై వివరీతంగా చర్చ జరుగుతోంది. సోమవారం నాటి మార్కెట్‌లో ఈ కంపెనీ షేర్ ఏ విధంగా ఉండబోతోంది? పెరుగుతుందా? మార్కెట్ విశ్లేషకులు ఏం చెబుతున్నారు? ఆ కంపెనీ షేర్ పెరుగుతోందని సంకేతాలు ఇస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలు ట్రేడర్లను వెంటాడుతోంది.

మార్కెట్లో తారాజువ్వలా దూసుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ షేర్లు

Advertisement

దేశీయ స్టాక్ మార్కెట్ నిఫ్టీలో ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ షేర్ శుక్రవారం తారాజువ్వలా మాదిరిగా పైకి ఎగిసింది. ఏప్రిల్ ఒకటి ఆ కంపెనీషేర్ కేవలం 21 నుంచి 22 రూపాయల మధ్య ట్రేడింగ్ జరిగింది. ఏప్రిల్ 10 నాటికి ఆ కంపెనీ స్టాక్ అమాంతంగా పెరిగింది. ప్రస్తుతం రూ. 40.88 వద్ద ముగిసింది. ఏప్రిల్ నెల మొదటి నుంచి ఇప్పటివరకు గరిష్టానికి వెళ్లిన కంపెనీ షేర్లలో ఓలా కూడా ఒకటి.

ఒక్కమాటలో చెప్పాలంటే దాదాపు 90 శాతానికి పైగానే పెరిగింది. ఒక్కసారిగా ఈ స్థాయిలో పెరుగుదల కనిపించడంతో సోమవారం ఓలా కంపెనీ షేర్ మాటేంటంటూ చర్చించుకోవడం ట్రేడర్ల వంతైంది.   ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ షేర్ పెరుగుదలకు కారణాలు చాలానే ఉన్నాయి. వాహనాల బ్యాటరీ టెక్నాలజీలో సానుకూల పరిణామాల నేపథ్యంలో ఈ పెరుగుదల చోటు చేసుకుందని ఆ కంపెనీ ప్రతినిధుల మాట.

Advertisement

కేవలం ఎలక్ట్రిక్ వాహనాల-ఈవీ రంగంలో ఉన్న ఈ సంస్థ, తాను సొంతంగా అభివృద్ధి చేసిన లిథియం ఐరన్ ఫాస్ఫేట్-LFP సెల్ సిద్ధంగా ఉందని ఇటీవల ప్రకటించింది. ఆ స్టేట్‌మెంట్ కంపెనీ షేర్ పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం నియంత్రణ సంస్థల నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. ఓలా వాహనాల బ్యాటరీ ఆవిష్కరణ ప్రయత్నాల్లో భాగంగా కొత్త రకం బ్యాటరీని అభివృద్ధి చేసింది.

సోమవారం ఓలా షేర్ ఎలా ఉంటుంది?  మార్కెట్ విశ్లేషకులు ఏమంటున్నారు?

46100 ఫార్మాట్ LFP సెల్ బ్యాటరీ అది. ప్రస్తుత NMC 4680 భారత్ సెల్ కంటే అది పెద్దది. మొబిలిటీ, ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ రెండింటిలోనూ పరిమాణం, వ్యయ సామర్, వినియోగం పరంగా ఒక విప్లవాత్మక మార్పును సూచిస్తుందని చెబుతున్నారు. వచ్చే త్రైమాసికం నుండి ఓలా ఉత్పత్తులలోకి ప్రవేశించడం ప్రారంభిస్తుందని ఆ కంపెనీ తెలిపింది. గతంలో ఓలా ఎలక్ట్రిక్ వాహనాల వేగంలో మెరుగుదలను హైలైట్ చేసింది.

ఈ ఏడాది మార్చి చివరి వారంలో రోజువారీ ఆర్డర్లు 1,000 యూనిట్లను దాటినట్టు పేర్కొంది. వాహన్ డేటా ప్రకారం.. ఫిబ్రవరిలోని 3,973 యూనిట్లతో పోలిస్తే మార్చిలో రిజిస్ట్రేషన్లు 10,117 యూనిట్లకు పెరిగాయి. నెల వారీగా 150 శాతానికి పైగా వృద్ధిని సూచించింది. ఒక్కమాటలో చెప్పాలంటే డిమాండ్‌లో గణనీయమైన పెరుగుదలను సూచించింది. నెల వారీగా తమ మార్కెట్ కోలుకుందని ఆ కంపెనీ మాట.

ALSO READ: సముద్ర గర్భంలో భారీగా బంగారు గనులు.. అద్భుతమైన పసిడి నిక్షేపాలు, ఎలా గుర్తించారంటే?

సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి మాట్లాడారు. చాలాకాలం పాటు కొనసాగిన పతనం తర్వాత ఓలా ఎలక్ట్రిక్ షేర్ తన పెరుగుదలను పునఃప్రారంభించిందన్నారు. దేశంలో తయారైన లిథియం అయాన్ బ్యాటరీ ప్రకటన ఆ కంపెనీకి చాలా సానుకూలంగా మారిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధర పెరుగుదల నేపథ్యంలో ఈవీల వినియోగం వేగవంతం కావచ్చని అంటున్నారు.

ఈ స్టాక్ అధిక రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉన్న పెట్టుబడిదారులకు అనువైనదిగా చెబుతున్నారు. భవిష్యత్తులో ఓలా ఎలక్ట్రిక్ పని తీరుకు దేశంలో ఈవీల వినియోగం వేగం అత్యంత కీలకమైన అంశం అవుతుందన్నారు. టెక్నికల్-డెరివేటివ్ రీసెర్చ్ సీనియర్ అనలిస్ట్ మాట్లాడారు. భారీ వాల్యూమ్‌ల మద్దతుతో ఓలా ఎలక్ట్రిక్ ధర దాదాపు 30 శాతం మేరా పెరిగిందన్నారు. బలమైన రివర్సల్ సంకేతాలను సూచిస్తోందన్నారు.

Related News

ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తారు? బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయ్!

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

పర్సనల్ లోన్ EMI కట్టలేకపోయారా? క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా ఎలా సరిచేయాలి?

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×