E-Paper
Advertisement

కొత్త వర్సెస్ పాత పన్ను విధానాలు.. పన్ను చెల్లింపులో ఏది బెస్ట్?

కొత్త వర్సెస్ పాత పన్ను విధానాలు.. పన్ను చెల్లింపులో ఏది బెస్ట్?
Advertisement

Old vs New Tax Regime: ఏప్రిల్‌ 1 నుంచి ఇన్ కమ్ ట్యాక్స్ విధానంలో మార్పులు వచ్చాయి. ఓల్డ్ ట్యాక్స్ నుంచి న్యూ ట్యాక్స్ విధానంలోకి మారితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఎక్స్ ఫర్ట్స్ అంటున్నారు. ఈ రెండు విధానాల్లో ఉండే ప్రయోజనాలను తెలుసుకుందాం. చాలామంది ఉద్యోగులు హెచ్ఆర్ఏ మినహాయింపు ఉండదనే ఉద్దేశంతో న్యూ ట్యాక్స్ రెజీమ్ కు మారేందుకు ఆలోచిస్తున్నారు. కానీ, కొత్త పన్ను విధానమే బెటర్ అంటున్నారు నిపుణులు. రానున్న ఒకటి రెండేళ్లలో ఓల్డ్ ట్యాక్స్ సిస్టమ్ పూర్తిగా రద్దయ్యే ఛాన్స్ ఉంది. దీంతో కొత్త పన్ను విధానానికి మారడమే మంచిదంటున్నారు.

న్యూ ట్యాక్స్ విధానంలో

కొత్త పన్ను విధానంలో సంవత్సరానికి రూ.12.75 లక్షల ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రిబేటు నిబంధనల మేరకు రూ.12 లక్షల లోపు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంపై ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే రూ.75,000 ప్రామాణిక తగ్గింపు అందరు ఉద్యోగులకు వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి జీతం రూ.12.75 లక్షలు అయితే, అందులో రూ.75 వేలు స్టాండర్డ్‌ డిడక్షన్‌ కింద పోగా.. మిగిలిన రూ.12 లక్షల ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది.

Advertisement

కొత్త పన్ను మేరకు ఈ ఆదాయంపై పన్ను కట్టక్కర్లేదు. దీంతోపాటు కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే ట్యాక్స్ ఎగ్జెంప్షన్ గిఫ్టులు, వోచర్ల లిమిట్ రూ.15,000కు పెరిగింది. గతంలో ఇది రూ.5,000 మాత్రమే. ఈ లిమిట్ పన్ను పరిధిలోకి రాదు. ఉద్యోగుల ఆదాయం రూ.12.75 లక్షల లిమిట్ దాటితే నూతన ఆదాయపు పన్ను చట్టం మేరకు ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది.

ఓల్డ్ ట్యాక్స్ విధానంలో

పాత పన్ను పద్ధతిలో.. ఇంటి అద్దె భత్యం(HRA) మినహాయింపు ఉంటుంది. మెట్రో నగరాల్లోని ఉద్యోగులు 50 శాతం హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు పొందవచ్చు. EPF, PPF, లైఫ్ ఇన్సూరెన్స్, ఈక్విటీ పొదుపు పథకాలు(ELSS), పిల్లల ట్యూషన్‌ ఫీజులు చెల్లింపులపై రూ.1.5 లక్షల వరకూ మినహాయింపు పొందవచ్చు. సొంతంగా, కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల కోసం తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీలపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం తీసుకున్న లోన్ పై చెల్లించే వడ్డీకి పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే డొనేషన్లకు కూడా పన్ను మినహాయింపు పొందవచ్చు.

Advertisement

పన్ను మినహాయింపులలో పిల్లల చదువులకు అయ్యే ఖర్చులు రూ.3,000కు పెంచారు. గతంలో ఇది రూ.100 ఉండేది. ఇది మ్యాగ్జిమమ్ ఇద్దరు పిల్లలకు వర్తిస్తుంది. హాస్టల్‌ ఖర్చులను నెలకు రూ.9,000కు పెంచారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి ఉద్యోగులు.. తమ హెచ్ఆర్ లకు ఏ ట్యాక్స్ విధానాన్ని ఎంచుకున్నారో తెలియజేయాల్సి ఉంటుంది. ఏ పన్ను విధానం మీకు మెరుగ్గా ఉంటుందో అంచనా వేసుకుని తెలియజేయాల్సి ఉంటుంది.

Also read: రూ.20 వేల కంటే ఎక్కువ క్యాష్ అప్పు ఇస్తున్నారా? అడ్డంగా బుక్కైపోతారు!

Related News

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×