Gold Rate Increased: ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి విలువ క్షీణత వంటి కారణాలతో తులం బంగారం ధర మళ్లీ లక్షన్నరకు చేరుకుంది. శుభకార్యాల సీజన్ కావడంతో ఈ ధరల పెరుగుదల మధ్యతరగతి కుటుంబాలపై పెను భారంగా మారింది. అప్పు చేసి బంగారం కొనాలా లేక అసలు కొనుగోలు ఆలోచనే మానుకోవాలా అని జనం తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను చూస్తుంటే, పసిడి ధరలు త్వరలోనే మరిన్ని రికార్డులను తిరగరాసేలా కనిపిస్తున్నాయి.
నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,510 ఉండగా.. నేడు బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,51,480 వద్ద పలుకుతుంది. అలాగే మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,050 కాగా.. నేడు బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,850 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.1,970 పెరిగింది.
పసిడి ఆకాశానికి.. రోల్డ్ గోల్డ్ దిక్కంటున్న ప్రజలు..
ఇక బంగారం ధరలు ఆకాశాన్ని తాకడంతో ఇప్పుడు అందరి దృష్టి రోల్డ్ గోల్డ్ (Rolled Gold) ఆభరణాల వైపు మళ్లుతోంది. ఒకప్పుడు కేవలం ఫ్యాషన్ కోసం వాడిన ఈ ఇమిటేషన్ జ్యువెలరీ, ఇప్పుడు సామాన్యులకు ఏకైక ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ఒరిజినల్ బంగారానికి ఏమాత్రం తీసిపోని మెరుపుతో, సరికొత్త డిజైన్లలో లభిస్తుండటంతో శుభకార్యాలకు వీటినే ధరించేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. పెట్టుబడిగా కాకపోయినా, అలంకరణ పరంగా తక్కువ ధరలో రాజసం ఉట్టిపడేలా కనిపించేందుకు రోల్డ్ గోల్డ్ ఇప్పుడు మార్కెట్‌లో హాట్ కేకులా అమ్ముడవుతోంది.
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,51,480 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,850 వద్ద కొనసాగుతుంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,480 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,850 వద్ద ఉంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,480 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,850 వద్ద పలుకుతోంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,630 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,39,000 వద్ద ఉంది.
నేటి సిల్వర్ ధరలు..
వామ్మో.. బంగారం ధరలే అనుకుంటే.. సిల్వర్ ధరలు మరి భారీగా పెరిగిపోతున్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన సిల్వర్ ధరలు నేడు భారీగా పెరిగాయి. అయితే నేటి సిల్వర్ ధరలు చూసుకుంటే.. మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,50,000 వద్ద ఉండగా.. నేడు బుధవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,65,000 వద్ద కొనసాగుతుంది.. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో నేడు కేజీ సిల్వర్ పై రూ. 2,55,000 వద్ద పలుకుతోంది.
Also Read: స్టాక్ మార్కెట్‌లో ఓపెనింగ్ అదుర్స్.. దలాల్ స్ట్రీట్‌లో బుల్ జోరు, మదుపరులు పుల్ ఎంజాయ్