E-Paper
Advertisement

వేసవిలో కిడ్నీ స్టోన్ సమస్యలు తీవ్రం.. ఈ జాగ్రత్తలతో నివారించండి

వేసవిలో కిడ్నీ స్టోన్ సమస్యలు తీవ్రం.. ఈ జాగ్రత్తలతో నివారించండి
Advertisement

Summer Kidney Stones| వేసవికాలంలో ఎండలు తీవ్రంగా ఉంటాయి. దీంతో శరీరం వేడెక్కి చెమట పడుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గితే త్వరగా అలసట వస్తుంది. దీంతో ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. వేసవిలో సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలలో మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లు (కిడ్నీ స్టోన్స్) ఒకటి. చాలా మంది శరీరంలో నీటి కొరత సమస్య సంకేతాలను నిర్లక్ష్యం చేస్తారు. ఈ నిర్లక్ష్యం వల్లే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. దీని వెనుక కారణాలు తెలుసుకుంటే ముందస్తుగా జాగ్రత్తలతో సమస్య నివారించవచ్చు.

వేసవిలో కిడ్నీ స్టోన్స్ ఎందుకు పెరుగుతాయి?

ఉష్ణోగ్రతలతో ఎక్కువ వేడి వల్ల శరీరం ఎక్కువ చెమట పడుతుంది. చెమట ద్వారా శరీరం సహజంగా చల్లబడుతుంది. కానీ ఇది శరీరం నుంచి నీటిని ఎక్కువగా కోల్పోయేలా చేస్తుంది. తగినంత నీరు తాగకపోతే డీహైడ్రేషన్ (నీటి కొరత) వస్తుంది. దీంతో శరీరంలో నీటి మొత్తం తగ్గుతుంది. ఈ కారణంగా కిడ్నీలు వ్యర్థ పదార్థాలను మూత్రపిండాలు సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోతాయి.

Advertisement

నీరు తగ్గిపోవడంతో మూత్రం మరింత చిక్కగా మారుతుంది. ఈ చిక్కటి మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పదార్థాలు మూత్రపిండాల్లో స్ఫటికాలుగా (ఉప్పు) మారడం ప్రారంభిస్తాయి. కాలక్రమేణా ఈ స్ఫటికాలు పెరిగి మూత్రపిండాల రాళ్లుగా మారతాయి. వేడి వాతావరణంలో ఈ ప్రక్రియ వేగంగా జరుగుతుంది.

నీటి కొరత వల్లే కిడ్నీ స్టోన్స్

నీటి కొరత వల్ల మూత్రం ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. మూత్రం తక్కువగా ఉండటం వల్ల వ్యర్థ పదార్థాలు మూత్రపిండాల్లో ఎక్కువ సేపు నిలిచి ఉంటాయి. దీంతో స్ఫటికాలు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. మందమైన మూత్రంలో ఖనిజాలు సులభంగా అంటుకుని గట్టిగా మారతాయి. ఇలా ఏర్పడిన గట్టి స్ఫటికాలనే కిడ్నీ స్టోన్స్ అంటారు. క్రమం తప్పకుండా నీరు తాగడం ఈ ప్రమాదకరమైన సమస్యను నివారిస్తుంది.

ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉంది?

Advertisement

కొంతమందికి కిడ్నీ స్టోన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తక్కువ నీరు తాగేవారు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. ఇంతకుముందు మూత్రపిండాల రాళ్ల సమస్యతో బాధపడిన వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఈ సమస్య ఉంటే ప్రమాదం ఎక్కువ.

ఆహారం కూడా రాళ్ల ఏర్పాటులో పెద్ద పాత్ర పోషిస్తుంది. ఎక్కువ ఉప్పు తినేవారికి, ఎక్కువ మాంసాహారం (ఎర్ర మాంసం – మటన్, బీఫ్, పోర్క్) తినేవారికి, ఆక్సలేట్ ఎక్కువ ఉన్న ఆహారాలు తినేవారికి, ఊబకాయం ఉన్నవారికి, మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నవారికి కిడ్నీ స్టోన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. తరచూ మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు ఉంటే కూడా ప్రమాదం పెరుగుతుంది.

కిడ్నీ స్టోన్స్ నివారించడానికి జాగ్రత్తలు

రోజంతా తగినంత నీరు తాగండి. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడం మంచిది. మీ మూత్రం రంగును గమనించండి. తెల్లటి లేదా లేత రంగు మూత్రం సరైన నీటి స్థాయిని సూచిస్తుంది. పసుపు రంగు మూత్రం వస్తే వెంటనే నీరు తాగాలి. రోజువారీ ఆహారంలో ఉప్పు తగ్గించండి. ఫ్రై చేసిన ఆహారాలు ఎక్కువ తినవద్దు. ఎర్ర మాంసం వంటి ఎక్కువ ప్రోటీన్ ఆహారాలు పరిమితంగా తినాలి. ఆక్సలేట్ ఎక్కువ ఉన్న ఆహారాలను నివారించండి.

Also Read: డాన్స్ చేసే సమయంలో గుండెపోటు.. పెరుగుతున్న కేసుల సంఖ్య.. ఇలా నివారించండి

నిమ్మకాయ, నారింజ వంటి సిట్రస్ పండ్లు, పండ్ల రసాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఈ పండ్లు.. రాళ్లు ఏర్పడకుండా సహజంగా సహాయపడతాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న సమయంలో భారీ వ్యాయామం చేయవద్దు. శరీరం అతిగా వేడెక్కకుండా విశ్రాంతి తీసుకోండి.

వేసవి కాలంలో మూత్రపిండాల రాళ్లు ఎక్కువగా వస్తాయి. దీనికి ప్రధాన కారణం నీటి కొరత. సాధారణ జీవనశైలి మార్పులతో ఈ ప్రమాదాన్ని సులభంగా తగ్గించవచ్చు. రోజూ తగినంత నీరు తాగండి, సమతుల్య ఆహారం తీసుకోండి. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మీ కిడ్నీలు ఆరోగ్యవంతంగా ఉంటాయి.

ముఖ్య గమనిక: ఈ వ్యాసంలో ఉన్నది  సాధారణ సమాచారం మాత్రమే. ఏదైనా తీవ్ర సమస్య ఉంటే వైద్య నిపుణులను తప్పక సంప్రదించాలి.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×