E-Paper
Advertisement

Stock Market Today: స్టాక్ మార్కెట్‌లో ఓపెనింగ్ అదుర్స్.. దలాల్ స్ట్రీట్‌లో బుల్ జోరు, మదుపరులు పుల్ ఎంజాయ్

Stock Market Today: స్టాక్ మార్కెట్‌లో  ఓపెనింగ్ అదుర్స్.. దలాల్ స్ట్రీట్‌లో బుల్ జోరు, మదుపరులు పుల్ ఎంజాయ్
Advertisement

Stock Market Today: ఇరాన్ యుద్ధాన్ని రెండు లేదా మూడు వారాల్లో యుద్ధం ముగిస్తామని ట్రంప్ చేసిన ప్రకటనతో ఆసియా మార్కెట్లో జోష్ కనిపించింది.  దాని ప్రభావం బాంబే స్టాక్‌మార్కెట్‌పై పడింది. దీని ఫలితంగా బుధవారం ఉదయం  మార్కెట్ లాభాలతో మొదలైంది.

బుధవారం స్టాక్ మార్కెట్‌లో ఓపెనింగ్ అదుర్స్

Advertisement

అంతర్జాతీయ సానుకూల పవనాల మధ్య బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. దలాల్‌స్ట్రీట్‌లో బుల్ జోరు కొనసాగింది. ముడి చమురు ధరలు క్రమంగా తగ్గడం, ఇరాన్‌ యుద్ధంపై ట్రంప్‌ ప్రకటన వంటి పరిణామాలు మార్కెట్‌లో జోష్ వచ్చింది. ఫలితంగా పెట్టుబడుదారులు కొనుగోళ్లకు పాల్పడ్డారు.

బీఎస్ఈ సెన్సెక్స్ 1800 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ కూడా 22,500 పాయింట్ల మార్క్‌ను తాకింది. బీఎస్ఈ సెన్సెక్స్‌ 1850 పాయింట్లు ఎగబాకి 73,801 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. అటు నిఫ్టీ 563 పాయింట్లు పెరిగి 22,895 ట్రేడ్ కొనసాగుతోంది. అదే సమయంలో రూపాయి విలువ కాస్త కోలుకున్నట్లు కనిపించింది. డాలర్‌తో రూపాయి విలువ 15 పైసలు పెరిగి 94.70 ట్రేడ్ జరుగుతోంది.

Advertisement

దలాల్ స్ట్రీట్‌లో బుల్ జోరు, మదుపరులు పుల్ ఎంజాయ్

నిఫ్టీ 50 స్టాక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్‌సీ బ్యాంకు, భారతీ ఎయిర్ టెల్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, టీసీఎస్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, హిందుస్తాన్ యూనిలీవర్, ఎల్ అండ్ టీ, మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్ సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల షేర్లు రెండు నుంచి మూడు శాతం వరకు పెరిగాయి.

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, ఇంటర్ ‌గ్లోబ్‌ ఏవియేషన్‌ షేర్లు రాణిస్తున్నాయి. ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. దక్షిణ కొరియా- కోస్పి 6.5 శాతం, జపాన్-నిక్కీ 4.04, హాంకాంగ్‌- హాంగ్‌సెంగ్‌ 1.71, ఆస్ట్రేలియా- ఏఎస్‌ఎక్స్‌ 1.7 శాతం పెరిగాయి. చివరి వరకు ఇదే ట్రెండ్ కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గతరాత్రి ఐరోపా, అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

ALSO READ: వార్ ఎఫెక్ట్.. హోటల్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×