Gold Rate Dropped: ఆకాశాన్ని అంటుతున్న పసిడి ధరలు.. రోజు రోజు ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక బంగారం పై మొగ్గుచూపడం తగ్గిస్తున్న పసిడి ప్రియులు.. కొందరు ఏమో బంగారం రేటు పెరుగుతున్న అస్సలు ఆలోచించకుండా వెళ్లి కొంటున్నారు. మరికొందరు ఏమో బంగారం కొనాలంటేనే వాటి ధరలు చూసి బయపడిపోతున్నారు. అలాగే పెట్టుబడిదారులకు కూడా ఇదే మంచి సమయం అన్నట్లు బంగారాన్ని పెట్టుబడిగా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు బంగారం ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? అనేది అందరు ప్రశ్నిస్తున్నారు..
నేడు పసిడి ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,180 ఉండగా.. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,910 వద్ద కొనసాగుతోంది. అలాగే శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,000 కాగా.. నేడు శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,750 వద్ద ఉంది. నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ. 270 తగ్గింది.
పరుగాపని పసిడి..
పసిడి ధరలు ట్రైన్‌లా దూసుకెళుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కాస్తా బంగారం ధరలు తగ్గాయి.. కొంత బంగారం కొనాలి అనుకునేలోపే మళ్లీ లక్షా ముప్పై వేలు అయ్యి కూర్చింది. దీంతో సామాన్య ప్రజలు ఇంకా బంగారం కొనాలి అనే ఆశను చంపుకుంటున్నారు. అయితే ముందగానే నిపుణులు చెప్పినట్టు 2026లో రెండు లక్షలు అవ్వడానికి దగ్గర్లో ఉంది. ఇప్పుడు వేలలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. వందల్లో తగ్గుతుంది.. కావున 2026లో 2 లక్షలు అవ్వడం పక్కా అంటున్న నిపుణుల.. ఒకపై బంగారం కొనే వారు జాగ్రత్త..! కాస్తా ధరలు చూసి కొనండి..
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,33,910 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,750 వద్ద ఉంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,33,910 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,750 వద్ద పలుకుతోంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,33,910 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,750 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,34,070 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,22,900 వద్ద పలుకుతోంది.
Also Read: సుప్రీం ఆదేశాల ఎఫెక్ట్.. పిన్నెల్లి బ్రదర్స్ మళ్లీ అరెస్ట్..
నేటి సిల్వర్ ధరలు ఇలా..
నిన్నమొన్నటి వరకు బంగారం ధరల గురించి మాట్లాడుకున్న ప్రజలు ఇప్పుడు సిల్వర్ ధరల గురించి మాట్లాడుకుంటున్నారు. బంగారం ఎలాగో కొనలేము సిల్వర్ అయినా కొనాలి అనుకుంటే అది కూడా రికార్డు స్థాయిలో పెరిగిపోతుంది. గత వారం రోజులుగా భారీగా పెరిగిన వెండి ధరలు నేడు కాస్త స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,15,000 కాగా.. నేడు శనివారం కేజీ సిల్వర్ ధర రూ. 2,10,000 వద్ద పలుకుతోంది. నేడు కేజీ సిల్వర్ ధరపై రూ.5,000 తగ్గింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 1,98,000లు కొనసాగుతోంది.