E-Paper
Advertisement

Pinnelli Brothers Arrest: సుప్రీం ఆదేశాల ఎఫెక్ట్.. పిన్నెల్లి బ్రదర్స్ మళ్లీ అరెస్ట్..

Pinnelli Brothers Arrest: సుప్రీం ఆదేశాల ఎఫెక్ట్.. పిన్నెల్లి బ్రదర్స్ మళ్లీ అరెస్ట్..
Advertisement

Pinnelli Brothers Arrest: పల్నాడు జిల్లాలో వైసీపీకి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికల సమయంలో అరాచకాలకు సంబంధించి ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉండి విడుదలైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతడి సోదరుడు జంట హత్యల కేసులో తిరిగి జైలు పాలయ్యారు. సుప్రీం ఆదేశాల మేరకు మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్డి ఎదుట లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్‌కి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

జంట హత్యల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు
జంట హత్యల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి నిందితులు నెల్లూరు జిల్లా జైలుకు తరలింపురామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి మాచర్ల కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారిద్దరూ గురువారం మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎదుట లొంగిపోయారు. విచారణ అనంతరం న్యాయమూర్తి వారికి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులను నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ ఏడాది మే 24న మాచర్ల నియోజకవర్గం, వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో టీడీపీ నేతలు జవ్విశెట్టి వెంకటేశ్వరరావు, జవ్విశెట్టి కోటేశ్వరరావు హత్యకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Advertisement

ఈ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి మాచర్ల కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారిద్దరూ గురువారం మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎదుట లొంగిపోయారు. విచారణ అనంతరం న్యాయమూర్తి వారికి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులను నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. పోలింగ్ సమయంలో ఈవీఎం విధ్వంసం కేసులో అరెస్ట్ అయిన వారిద్దరు అప్పట్లో నెల్లూరులోనే జైలు జీవితం గడిపారు.

జంట హత్యల కేసులో A6, A6 లుకా ఉన్న పిన్నెల్లి బ్రదర్స్..
ప్రస్తుత కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతడి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోయారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో A6 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , A7 పిన్నెల్లి వెంకటరామిరెడ్డి నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి రెండు వారాల్లో లొంగిపోవాలంటూ పిన్నెల్లి సోదరులకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేటితో సుప్రీం కోర్టు గడువు ముగియడంతో గురువారం ఉదయం మాచర్ల జూనియర్ సివిల్ కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోయారు.

Advertisement

ఈ ఏడాది మే 24న పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన అన్నదమ్ములు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావులు దారుణ హత్యకు గురయ్యారు. తెలంగాణలోని బంధవుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న బైక్‌ను కారుతో ఢీకొట్టి కింద పడిన ఇద్దరినీ బండరాళ్లతో కొట్టి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ జంట హత్యల కేసులో మొత్తం 9 మందిని నిందితులుగా చేర్చారు. వారిలో ఏ6గా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.

బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటీషన్ వేసిన పిన్నెల్లి
అయితే తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టును పిన్నెల్లి సోదరులు ఆశ్రయించారు. హైకోర్టులో పిన్నెల్లి బ్రదర్స్‌కు చుక్కెదురవడంతో సుప్రీంలో పిటిషన్ వేశారు. దీంతో కొద్దిరోజుల పాటు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది సుప్రీం కోర్టు. ఈ కేసు విచారణలో భాగంగా ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించారు. నిందితులు విచారణకు సహకరించడం లేదని, సాక్షులను బెదిరిస్తున్నారంటూ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న సుప్రీం పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేయడంతో పాటు వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది.

Also Read: శరవేగంగా మేడారం ఆలయ అభివృద్ధి పనులు.. డ్రోన్ విజువల్స్

అయితే రెండు వారాల పాటు సమయం ఇవ్వాలని పిన్నెల్లి తరఫున న్యాయవాది కోరారు. ఈ క్రమంలో పిన్నెల్లి సోదరులు లొంగపోయేందుకు రెండు వారాల పాటు సుప్రీం కోర్టు గడువు ఇచ్చింది. సుప్రీం ఆదేశాల మేరకు లొంగిపోయేందుకు నిర్ణయం తీసుకున్న పిన్నెల్లి సోదరులు మాచర్ల కోర్టులో సరెండర్ అయ్యారు. వారికి 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. దాంతో వీరిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. అసలే ముందుండి నడిపించే నాధుడు లేక పల్నాడు జిల్లాలో ఆపసోపాలు పడుతున్న వైసీపీ పిన్నెల్లి బ్రదర్స్ అరెస్టు పెద్ద ఎదురుదెబ్బే అంటున్నారు.

Story By Rami Reddy, Bigtv

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×