E-Paper
Advertisement

Gold Rate Increased: భారీగా పెరిగిన పసిడి ధరలు.. ఇక తులం కొనాలంటే తల ప్రాణం తోకకు రావాల్సిందే

Gold Rate Increased: భారీగా పెరిగిన పసిడి ధరలు.. ఇక తులం కొనాలంటే తల ప్రాణం తోకకు రావాల్సిందే
Advertisement

Gold Rate Increased: దేవుడా.. బంగారం రేట్లు ఏంట్రా బాబు.. దారుణంగా పెరిగిపోతున్నాయి. బంగారం కొనాలంటేనే సామాన్య ప్రజలు భయపడిపోతున్నారు. ముందు ముందు బంగారం ధరలు తగ్గుతాయంటే అవి ఇంకా పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పసిడి ధరలు ఇలాగే ఉంటే ఇక ముందు ఇంకా బంగారం కష్టమే అంటున్నారు పసిడి ప్రియులు..

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,150 ఉండగా.. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,550 వద్ద కొనసాగుతోంది. అలాగే సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,800 కాగా.. నేడు మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,000 వద్ద ఉంది. నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.2,400 పెరిగింది.

Advertisement

భగ్గుమంటున్న పసిడి ధరలు..
బంగారం ధరలు అమాంతం పెరగడం సామాన్యులకు గుండె కోత మిగిలిస్తుండగా, దీని వెనుక కొన్ని బలమైన అంతర్జాతీయ ఆర్థిక కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడానికి ప్రధానంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలు, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రధాన కారణాలు. ఇటువంటి అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పుడు ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ కంటే సురక్షితమైన ఆస్తిగా భావించే బంగారంపై పెట్టుబడులు పెంచుతారు. దీనికి తోడు మన దేశంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం, చైనా, భారత్ వంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం వల్ల డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఇక ముందు ముందు రేట్లు తగ్గుతాయా అంటే.. అప్పట్లో తక్కువకు వస్తదని ఆశపడ్డ వాళ్లందరికీ ఇప్పుడు దిమ్మతిరిగేలా రేట్లు పెరిగాయి. 2026 నాటికి తులం బంగారం రూ. 1.50 లక్షల నుండి రూ. 2 లక్షల వరకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు అంచనా వేస్తున్నరు. మధ్యలో అప్పుడప్పుడు వందలు, వేలల్లో తగ్గొచ్చు కానీ, అది మనకు కంటి తుడుపు చర్యనే. పెళ్లిళ్ల సీజన్ వస్తే చాలు రేట్లు మళ్లీ రాకెట్లాగా దూసుకుపోతాయి. కాబట్టి ఇప్పుడున్న రేట్లే రేపటి రోజున తక్కువ అనిపించొచ్చు. బంగారం కొనాలనుకునేటోళ్లు రేటు తగ్గుతదని ఎదురుచూడకుండా, వీలైనప్పుడే కొంచెం కొంచెం కొనుక్కుంటేనే ఉత్తమమని నిపుణులు చెప్తున్నారు.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,38,550 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,000 వద్ద ఉంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,38,550 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,27,000 వద్ద పలుకుతోంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,38,550 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,27,000 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,38,700 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,27,150 వద్ద పలుకుతోంది.

Also Read: సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో అపశృతి.. కార్‌ కింద పడి చిన్నారి మృతి..

నేటి సిల్వర్ ధరలు ఇలా..
నేడు బంగారం ధరలకు తోడు సిల్వర్ ధరలు కూడా భారీగా పెరిగాయి. నిన్న సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,31,000 కాగా.. నేడు మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,34,000 వద్ద పలుకుతోంది. నేడు కేజీ సిల్వర్ ధరపై రూ.3,000 తగ్గింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2,23,000 వద్ద కొనసాగుతోంది.

Related News

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

Big Stories

Advertisement
×