E-Paper
Advertisement

Anasuya : ఇది మా బాడీ.. మా ఇష్టం… మీకేం నొప్పి… శివాజీకి అనసూయ కౌంటర్..

Anasuya : ఇది మా బాడీ.. మా ఇష్టం… మీకేం నొప్పి… శివాజీకి అనసూయ కౌంటర్..

Anasuya : తెలుగు ఆడియన్స్ కి పరిచయం అక్కర్లేని పేరు నటుడు శివాజీ.. ఆయన ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో నటుడిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.. ఒకప్పుడు హీరోగా వరుసగా సినిమాలు చేసి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈయన ప్రస్తుతం సినిమాల్లో కీలకపాత్రలో నటిస్తూ వస్తున్నారు. అయితే ఈమధ్య ఈయన నటించిన సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లలో ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్ని వివాదాస్పదంగా మారుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య కోర్టు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదాలు కు దారితీసాయి. అలాగే ఇప్పుడు దండోరా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల వస్త్రధారణ పై ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాదు..  అటు సోషల్ మీడియాలో కూడా దీనిపై చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆయన మాట్లాడిన మాటలు తప్పు అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా యాంకర్, సినీ నటి అనసూయ ఆయన వ్యాఖ్యలను ఖండించారు. అనసూయ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్టు కూడా శివాజీకి కౌంటర్ ఇచ్చేలా ఉందంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.. అనసూయ చేసిన పోస్ట్ లో ఏముందో ఒకసారి తెలుసుకుందాం..

శివాజీ వ్యాఖ్యలపై అనసూయ సీరియస్.. 

సినీ నటుడు శివాజీ దండోరా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ హీరోయిన్ల డ్రెస్సింగ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.. హీరోయిన్లు దరిద్రమైన బట్టలు వేసుకుంటే మనమే దరిద్రమైన పరిస్థితిని అనుభవించాలి అంటూ మాట్లాడారు. మీరు మీ సామాన్లని కప్పుకోవాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఎప్పటినుంచో సినిమాల్లో ఉన్న మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లతో కౌంటర్లు వేస్తున్నారు. ఇప్పటికే సింగర్ చిన్మయి లాంటి వాళ్లు దీనిపై స్పందించారు. నటి అనసూయ కూడా శివాజీ వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇది మా బాడీ మా ఇష్టం అంటూ ఆమె పోస్ట్ చేశారు. ఇది శివాజీకి కౌంటర్ లాగా ఉంది అంటూ నెటిజెన్లు అనసూయ కి సపోర్ట్ గా నిలిచారు. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం శివాజీ చేసిన వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీలో వ్యతిరేకత మొదలైనట్లు కనిపిస్తుంది. మరి ఈ వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ చెప్తారా? అసలు ఆ వ్యాఖ్యలు అనడానికి కారణం ఏంటో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.. ఏది ఏమైనా కూడా ఈ మధ్య ఈయన వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు.

Also Read : శివాజీ కాళ్లకు మెట్టలు పెట్టుకో… ‘దరిద్రపు ము**’ కామెంట్‌పై చిన్మయి ఫైర్

శివాజీ వ్యాఖ్యల పై నెటిజన్స్ ఫైర్.. 

శివాజీ నటించిన దండోరా మూవీ ఈనెల 25 న థియేటర్లలోకి రాబోతుంది.. ఈ క్రమంలో సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన నటుడు శివాజీ సినిమా గురించి మాట్లాడుతూ హీరోయిన్లపై కామెంట్లు చేశాడు. మహిళల అందం చీరలోనే ఉంటుందని వ్యాఖ్యానించిన ఆయన, ఆధునిక దుస్తులపై మాట్లాడుతూ ‘సామాన్లు’ అనే పదాన్ని ఉపయోగించడం తీవ్ర అభ్యంతరకరంగా మారింది.. మోడ్రన్ డ్రెస్ లను ధరించే కొందరు అమ్మాయిలను ఉద్దేశిస్తూ.. “దరిద్రపు ముండా” ఇలాంటి బట్టలు వేసుకున్నావు ఏంటి? అంటూ మాట్లాడటం మరింత ఆగ్రహాన్ని రేకెత్తించింది.. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా కామెంట్లు వినిపిస్తున్నాయి. నటుడు శివాజీ ఇలా మాట్లాడడం ఏంటి అంటూ విమర్శలు చేస్తున్నారు.. ఎటు చూసినా కూడా శివాజీకి వ్యతిరేకత పెరుగుతుంది. మరి దీనిపై ఆయన స్పందించి క్షమాపణ చెప్తారా? లేదా ఆయన అనడానికి గల కారణాలను వివరిస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది..

Related News

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

Big Stories

×